Rithu Chowdary and YS Jagan
ఎంటర్‌టైన్మెంట్

Rithu Chowdary: వైఎస్ జగన్ పేరు ప్రస్తావిస్తూ.. రూ. 700 కోట్ల స్కామ్‌పై రీతూ షాకింగ్ కామెంట్స్!

Rithu Chowdary: ఈ మధ్య ఫేమస్ అయిన నటీమణులలో రీతూ చౌదరి కూడా ఒకరు. అంతకు ముందు ఆమె ఎవరో కూడా ఎవరికీ తెలియదు. సీరియల్స్ చేసుకునే తను, జబర్దస్త్ లో కామెడీ చేయడం మొదలైనప్పటి నుంచి జనాలకు తెలిసింది. ఇక సోషల్ మీడియాలో అయితే అమ్మడి సంగతి సరే సరి. నిత్యం గ్లామర్ ఫొటోలతో సోషల్ మీడియాకే సెలబ్రిటీగా మారిపోయింది. ఆమె ఫొటోలు ఎలా వైరల్ అవుతుంటాయో తెలియంది కాదు. ఇవి కాకుండా రీతూ చౌదరి పేరు బాగా వినిపించింది ఎక్కడంటే.. ఇటీవల ఏపీలో రూ. 700 కోట్ల ల్యాండ్ స్కామ్ అంటూ వచ్చిన వార్తలలో ప్రధానంగా రీతూ చౌదరి పేరు వైరల్ అయింది. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసినందుకుగానూ ఆమెపై కేసు నమోదవడం, పోలీసుల విచారణకు హాజరవడం వంటి విషయాలతో రీతూ జనాల్లో బాగానే నోటెడ్ అయింది.

Also Read- Allu Aravind: ఆడవాళ్లను బొద్దింకలతో పోల్చి.. ఫీల్ కావద్దని అంటాడేంటి?

మరీ ముఖ్యంగా, వైసీపీ పాలనలో ల్యాండ్ స్కామ్ విషయంలో రీతూ చౌదరిపై రకరకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి పేరు ప్రస్తావిస్తూ మీడియాలో కూడా ఆమెపై చాలానే ఆరోపణలు వచ్చాయి. ఆ రూమర్స్‌పై ఇంత వరకు ఎక్కడా స్పందించని రీతూ చౌదరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాత్రం ఉన్న విషయాన్ని బయటపెట్టేసింది. అదీ కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు ప్రస్తావిస్తూ, ఆమె వివరణ ఇవ్వడంతో.. ఇప్పుడా ఇంటర్వ్యూ బాగా వైరల్ అవుతోంది. అసలింతకీ రీతూ చౌదరి ఈ స్కామ్‌పై ఏం చెప్పిందంటే..

అసలు ఆ స్కామ్ గురించి నాకేం తెలియదు. నేనొక పార్టీలో ఉన్నప్పుడు మీడియా వాళ్లే నాకు ఫోన్ చేసి, రూ. 700 కోట్ల ల్యాండ్ స్కామ్‌లో మీ పేరు ప్రముఖంగా వినబడుతోంది. దీనిపై మీ స్పందన ఏంటి? అని అడిగారు. అసలు నాకేం అర్థం కాలేదు. అలా అడిగిన వారిని.. ఏం మాట్లాడుతున్నారు మీరు అంటూ తిట్టిపడేశాను. ఆ తర్వాత చూస్తే, నా పేరు అందులో బాగా హైలెట్ అవుతుంది. ఇక అంతే, సోషల్ మీడియా అంతా నా ఫొటోలతో నింపేశారు. యూట్యూబ్ వాళ్లకి అయితే మంచి కంటెంట్ దొరికినట్లయింది. రకరకాల థంబ్స్‌తో ఏవేవో రాసేశారు. వాటిని చూసిన మా బంధువులు నాకు ఫోన్ చేయడం మొదలెట్టారు. ఎంత మందికి అని సమాధానం చెప్పను.

Also Read- Padma Bhushan NBK: పద్మభూషణుడిగా నందమూరి నటసింహం.. తోడుగా ఎవరెవరు వెళ్లారంటే?

ముఖ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరును వాడుతూ నాపై ఏవేవో రాశారు. ఇంకా నేను ఎవరితోనూ డేట్ చేశానంటూ, ఆ వ్యక్తే ఈ స్కామ్‌లో మెయిన్ అంటూ రాశారు. నిజంగా అతనెవరో కూడా నాకు తెలియదు. ఎక్కడో ఒక ఫొటోలో కనిపించానని, నా పేరుని అలా వాడేశారు. నిజంగా ఆ స్కామ్ ఏంటో, అసలు అది జరిగిందో, లేదో కూడా నాకు తెలియదు. నేను లోను ఇన్‌స్టాల్‌మెంట్స్ కట్టలేదని, వాళ్లు వచ్చి మీ దగ్గర బోలెడంత డబ్బు ఉందిగా ఎందుకు కట్టడం లేదు? అని ప్రశ్నించారు. నాకు తెలియక అడుగుతున్నాను.. నిజంగా వాళ్లు చెబుతున్న స్కామ్‌లో నేను ఉంటే, ఇలా బయట ఎందుకు ఉంటాను. అరెస్ట్ చేసి జైలుకి పంపేవారుగా. ఓ ఛానల్ వారయితే ఫేక్ ఎఫ్ఐఆర్ క్రియేట్ చేసి, నన్ను భయపెట్టారు. ఇవన్నీ భరించాను. కర్మ సిద్ధాంతం అంటారు కదా.. అదే చూసుకుంటుందని భావించి, చాలా ఓపికగా ఉన్నానని’ రీతూ చౌదరి క్లారిటీ ఇచ్చింది. వివరణ ఇచ్చింది కాబట్టి.. ఇకనైనా ఈ విషయంలో ఆమె పేరు వినబడకుండా ఉంటుందేమో చూద్దాం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం