Single Movie Trailer Launch
ఎంటర్‌టైన్మెంట్

Allu Aravind: ఆడవాళ్లను బొద్దింకలతో పోల్చి.. ఫీల్ కావద్దని అంటాడేంటి?

Allu Aravind: కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి గీతా ఆర్ట్స్ బ్యానర్‌‌‌లో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం ‘సింగిల్’ (Single Movie). కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 9న విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ క్రమంలో మేకర్స్ సోమవారం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసి, ప్రమోషన్ల జోరు పెంచారు.

Also Read- Padma Bhushan NBK: పద్మభూషణుడిగా నందమూరి నటసింహం.. తోడుగా ఎవరెవరు వెళ్లారంటే?

ఈ ట్రైలర్‌ను గమనిస్తే.. ఒక హ్యూమరస్ నోట్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌లో శ్రీ విష్ణు ఒక అమ్మాయి మనసుని గెలుచుకోవడానికి మూడు గోల్డెన్ టిప్స్ ఇస్తాడు. అమ్మాయిలు ‘గుడ్ బాయ్స్’ని ఇష్టపడతారని చెబుతాడు. ఆ తర్వాత ‘బ్యాడ్ బాయ్ యాటిట్యూడ్’, చివరగా, టిప్ నంబర్ త్రీ ‘మాస్ వాయిస్’ కస్సింగ్ వర్డ్స్, ఆల్ఫా మేల్ డామినెన్స్. పూర్వ (కేతిక శర్మ) అనే అమ్మాయిని శ్రీవిష్ణు ఇష్టపడినప్పుడు, మరొక అమ్మాయి హరిణి (ఇవానా) అతనిపై ప్రేమ చూపిస్తుంది, ఇది ట్రై యాంగిల్ లవ్ స్టోరీ అనేది ఈ ట్రైలర్ జస్టిఫికేషన్ ఇచ్చేస్తుంది. హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా అనేలా ఈ ట్రైలర్ ప్రామిస్ చేస్తోంది. కామెడీ, రొమాన్స్, లైటర్ డ్రామాతో ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్ అనే అభిప్రాయం సినిమాపై ఏర్పడేలా చేస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్లను బొద్దింకలతో పోల్చే డైలాగ్ హైలెట్ అనేలా ఉంది. దీనిపై ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ వివరణ కూడా ఇచ్చారు. (Single Trailer Released)

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. సీరియస్, ఎమోషనల్ లవ్ స్టోరీ‌గా తీసిన ‘తండేల్’‌కు ప్రేక్షకులు ఘన విజయం అందించారు. ఆ సినిమా జరుగుతున్నప్పుడే సరదాగా నవ్వుకునే ఒక కథ ఒకటి రెడీ చేయాలని విద్యాకి చెప్పాను. అప్పుడు భాను రియాజ్ ఈ ‘సింగిల్’ కథని తీసుకొచ్చారు. డైరెక్టర్ కార్తీక్ ఈ కథ చెప్తున్న రెండు గంటల సేపు నేను పగలబడి నవ్వుతూనే ఉన్నాను. అంత అద్భుతంగా చెప్పారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కనిపించినప్పుడు నవ్వకుండా ఉండలేరు.ఇది సమ్మర్‌కి యాప్ట్ అయ్యే సినిమా. అందరూ హాయిగా థియేటర్స్‌లో ఎంజాయ్ చేసే సినిమా. మే 9న అందరూ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. సాంకేతిక నిపుణులందరూ తమ పనితనం కనబరిచారు. ట్రైలర్‌లో కాక్రోచ్ థియరీ ఉంది. దానిని ఎవరూ అపార్థం చేసుకోకూడదని కోరుతున్నాను. అటామిక్ బాంబు పేలినా కూడా బ్రతకగలిగే రెజిలియన్స్ ఉన్న జీవి కాక్రోచ్. అలాంటి రెజిలియన్స్ క్వాలిటీ గురించి చెప్పడానికే ఆ డైలాగ్ వాడాము. దానిని ఎవరూ అపార్థం చేసుకోవద్దు. సమ్మర్‌లో ఈ సినిమా ఆడియన్స్ అందరినీ చాలా కూల్‌గా ఉంచుతుందని అన్నారు. అయితే, అమ్మాయిలను బొద్దింకలతో పోల్చి.. అరవింద్ ఇలా వివరణ ఇస్తాడేంటి? అని కొందరు అప్పుడే కామెంట్స్ చేస్తుండటం విశేషం.

Also Read- Samantha Temple: సమంతకు గుడి కట్టి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న అభిమాని.. ఎందుకంటే?

మార్పును ఎవరూ ఆపలేరు:
థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుంది కదా.. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘కొవిడ్ టైమ్‌లో అందరూ ఇంటి దగ్గరే ఉండటంతో, అందరూ ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. అదే మెయిన్ కారణం. అయితే, ప్రేక్షకులలో వచ్చిన మార్పును ఎవరూ ఆపలేరు. ఎలాంటి సినిమా అయినా ‘చాలా బాగుంది’ అని మౌత్ టాక్ వస్తేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. ఆ మాట అనిపించుకునేలా దర్శకనిర్మాతలు సినిమాలు చేయాలి. ‘సింగిల్’ విషయంలో చిన్న, మీడియం అని ఏం ఆలోచించలేదు. మంచి సినిమా తీశాం. థియేటర్లలో విడుదల చేస్తున్నాం.. అంతే’’ అని అరవింద్ చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం