mass-trailer( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Mass Jathara trailer: ‘మాస్ జాతర’ ట్రైలర్‌ అప్డేట్ ఇచ్చిన రవితేజ.. వచ్చేది ఎప్పుడంటే?

Mass Jathara trailer: మాస్ మహారాజ్ రవితేజ ప్రధాన పాత్రలో రాబోతున్న మాస్ జాతర చిత్రం అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఇప్పటికే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీని గురించి మాస్ మహారాజ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ట్రైలర్ అక్టోబర్ 27 విడుదలవుతుందని తెలిపారు. అంతే కాకుండా ఈ సినిమా సెన్సార్ ఇప్పటికే పూర్తయి యూఏ పొందింది. మాస్ మహారాజ్ రవితేజకు జోడీగా ఈ సినిమాలో శ్రీలీల నటిస్తోంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హాస్యం, భావోద్వేగాలు మాస్ అంశాలతో నిండిన వినోదభరితమైన కుటుంబ చిత్రంగా ఉంటుందని నిర్మాతలు ఇప్పటికే పలు సందర్భాల్లో తెలిపారు.

Read also-The Girlfriend trailer: రష్మిక మందాన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ట్రైలర్ వచ్చేసింది.. ఏం పర్ఫామెన్స్ గురూ..

‘మాస్ జాతర’ కథ ఒక లోకల్ జాతర (ఉత్సవం) చుట్టూ తిరుగుతుంది. రవి తేజ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారిగా నటిస్తూ, రౌడీ గ్యాంగులు, అవినీతికర రాజకీయవేత్తలతో పోరాడుతాడు. ఈ జాతర సందర్భంగా జరిగే ప్రమాదాలు, యాక్షన్ సీక్వెన్స్‌లు, హాస్య ఎలిమెంట్స్ మిక్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రూపొందించబడింది. డైరెక్టర్ భాను భోగవరాపు తొలి చిత్రంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. “ఇది రవి తేజ ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా రూపొందించిన మాస్ ఫెస్ట్” అని టీమ్ సభ్యులు చెబుతున్నారు. ఈ చిత్రం మొదట మే 9, 2025కి ప్లాన్ చేసినా, ఇతర కారణాల వల్ల ఆగస్ట్ 27కి మార్చారు. తర్వాత నిర్మాత ‘వార్ 2’ విఫలం కారణంగా మళ్లీ అక్టోబర్ 31కి జరిగింది.

Read also-AI voice in Spirit: ‘స్పిరట్’ గ్లింప్స్‌లో ప్రభాస్ వాయిస్ నిజం కాదని మీకు తెలుసా.. ఏం చేశారంటే?

రవి తేజ హీరోగా, ధమాకాలో తర్వాత శ్రీలీల హీరోయిన్‌గా ఈ జోడీ మళ్లీ కనిపిస్తోంది. శ్రీలీల పాత్ర గురించి టీజర్‌లో ఆకట్టుకున్న గ్లింప్స్ కనిపించాయి. నితీష్ నిర్మల్ స్నేహితుడిగా, రితు పీ సూద్ తల్లిగా, కృష్ణ కుమార్ మామగా, రాజేంద్ర ప్రసాద్ మొదలైనవారు కీలక పాత్రల్లో ఉన్నారు. టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌లో విధు అయ్యన్నా సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, భీమ్స్ సెసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంకా అయిదు రోజులు మాత్రమే ఉండటంతో సినిమా ప్రమోషన్ లో వేగం పెంచింది మూవీ టీం. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ప్రచార చిత్రాలు సినిమాపై మరింత హైప్‌ను పెంచాయి. అక్టోబర్ 31వ తేదీ కోసం మస్ మహారాజ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Just In

01

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ రిలీజ్ మరొక్క రోజు వెనక్కి!.. ఎందుకంటే?

Gold Price Today: తగ్గిన గోల్డ్ రేట్స్.. కొనాలనుకునేవారికీ ఇదే మంచి ఛాన్స్!

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు