prabhas-voice( image :X)
ఎంటర్‌టైన్మెంట్

AI voice in Spirit: ‘స్పిరట్’ గ్లింప్స్‌లో ప్రభాస్ వాయిస్ నిజం కాదని మీకు తెలుసా.. ఏం చేశారంటే?

AI voice in Spirit: ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ మూవీ ఆడియో టీజర్ ‘వన్ బ్యాడ్ హ్యాబిట్’ సోషల్ మీడియాలో తుఫాను సృష్టించింది. సందీప్ రెడ్డి వాంగా డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ప్రభాస్ పవర్ ఫుల్ కాప్ గా కనిపించబోతున్నారు. కానీ, ఈ టీజర్‌లో ప్రభాస్ వాయిస్ నిజమైనది కాదని, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీతో రిక్రియేట్ చేసినట్టు ఆరోపణలు ఊపందుకున్నాయి. ఇప్పటికే మిరాయ్ సినిమాలో ప్రభాస్ వాయిస్ ను ఏఐ చేయగా మరో సారి తన సొంత సినిమాలోనే ఇలా వాయిస్ ఏఐ చేయండం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంత చిన్న విషయానికి కూడా ఏఐ ఉపయోగించడం ఎందుకని ప్రభాస్ అభిమానులు సందీప్ రెడ్డి వంగాపై సీరియస్ అవుతున్నారు. అయితే ఇది ఏఐ వాడి చేసినది అని ఎక్కడా మూవీ టీం క్లారిటీ ఇవ్వలేదు.

Read also-Hit and run case: కన్నడ నటి దివ్యా సురేశ్ హిట్ అండ్ రన్ కేసులో కీలక మలుపు..

ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా సందీప్ రెడ్డి వాంగా తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఈ ‘సౌండ్ స్టోరీ’ని విడుదల చేశారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళం – ఐదు భాషల్లో వచ్చిన ఈ 30 సెకన్ల టీజర్ ప్రకాష్ రాజ్ శక్తివంతమైన వాయిస్‌తో మొదలై ప్రభాస్ వాయిస్ తో ముగుస్తుంది. “ఒక చెడు అలవాటు… అది నా జీవితాన్ని మార్చేసింది” అంటూ ప్రభాస్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. మొదట్లో పాజిటివ్ రివ్యూలే వచ్చాయ. సౌండ్ డిజైన్, ఎమోషనల్ డెప్త్ అంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. కానీ, కొన్ని గంటల్లోనే ట్విస్ట్ మొదలైంది!

టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ ఊపందుకుంది. చాలా మంది నెటిజెన్స్, “ఇది ప్రభాస్ ఒరిజినల్ వాయిస్ కాదు! ఏఐ సాఫ్ట్‌వేర్‌తో డబ్బింగ్ చేశారు” అంటూ కామెంట్స్ పెట్టడం మొదలెట్టారు. ఇన్‌సైడ్ సర్కిల్స్ నుండి వచ్చిన ఇన్ఫో ప్రకారం, ప్రభాస్ ప్రకాష్ రాజ్ వాయిస్‌లు అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ ఉపయోగించి రీక్రియేట్ చేయబడ్డాయట. హిందీ వెర్షన్‌లో ప్రభాస్ డైలాగ్ ‘డబ్డ్’ లాగా అనిపించడం వల్ల ఈ రూమర్స్ బలపడ్డాయి. కొందరు ఫ్యాన్స్, “ఇది టెక్నాలజీ ఇన్నోవేషన్, కూల్!” అంటూ సపోర్ట్ చేస్తున్నారు. కానీ మిగిలినవారు, “సందీప్ రెడ్డి వంటి రా ఫిల్మ్‌మేకర్ ఏఐపై డిపెండ్ అవ్వడం డౌట్‌ఫుల్. ఒరిజినాలిటీ ఎక్కడ?” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వివాదం ‘స్పిరిట్’పై ఉన్న భారీ అంచనాలను మరింత పెంచుతుంది.

Read also-AI in Tollywood: సినిమాల్లో ఏఐ టెక్నాలజీ వాడకం పెరుగుతుందా?.. దీనివల్ల జరిగే అనార్థాలు ఏమిటి?

ప్రస్తుతానికి సందీప్ రెడ్డి వాంగ లేదా ప్రొడక్షన్ టీమ్ నుండి ఎటువంటి అధికారిక ప్రతిస్పందన లేదు. టీజర్ ఏఐతో చేయబడిందా, లేక ట్రెడిషనల్ డబ్బింగ్ మాత్రమేనా అనేది స్పష్టం కావాలి. ‘అనిమల్’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ లాంటి హిట్స్ ఇచ్చిన సందీప్ ఈసారి ప్రభాస్‌తో మ్యాజిక్ క్రియేట్ చేస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కానీ ఈ ఏఐ డిబేట్ మూవీ రిలీజ్‌కు ముందు మరిన్ని డిస్కషన్స్ తీసుకొస్తుందని అనిపిస్తోంది.’స్పిరిట్’ 2026లో రిలీజ్ కానుంది. యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Just In

01

The Girlfriend: రష్మిక రెమ్యూనరేషన్ తీసుకోలేదు.. ఆసక్తికర విషయం చెప్పిన నిర్మాత

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ నిడివి ఎంతో తెలుసా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఇదేనా? ప్రేమికులకు పండగే!

Dragon: ఎన్టీఆర్, నీల్ ‘డ్రాగన్’పై ఈ రూమర్స్ ఏంటి? అసలు విషయం ఏమిటంటే?

Private Buses: కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో తనిఖీలు.. తెలంగాణలో తొలిరోజే 4 బస్సులు సీజ్