The Girlfriend trailer: రష్మిక మందానా ప్రధాన పాత్రలో నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో రూపొందిన ఒక లేడీ ఓరియంటెడ్ చిత్రం. ధీక్షిత్ షెట్టి రష్మిక మందాన కు జోడీగా నటిస్తున్నారు. అను ఇమాన్యూవల్ ఈ సినిమా లో కీలక పాత్రలో కనిపించనున్నారు. రోహిణి, రావు రమేష్ వంటి సీనియర్ నటులు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా రొమాన్స్‌తో పాటు భావోద్వేగాలు, డ్రామా కలిపిన ఇంటెన్స్ రిలేషన్‌షిప్ స్టోరీగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతుంది.
Read also-Rashmika Mandanna: కర్నూలు బస్సు ప్రమాదంపై ఎమోషనల్ అయిన రష్మిక మందాన..
ట్రైలర్ ను చూస్తుంటే.. ‘ఈ సినిమా మొత్తం రష్మిక మందాన చూట్టూ తిరుగుతుంది. రష్మిక మందాన దీక్షిత్ శెట్టితో ప్రేమలో ఉంటుంది. ఒక రోజు సాయంత్రం మనిద్దరం కొంచెం గ్యాప్ తీసుకుందామా అంటూ రష్మిక హీరోకు ప్రపోజల్ పెడుతుంది. దీనికి హీరో కొంచెమా అని అడగ్గా.. కొంచెం కాదు గ్యాప్ తీసుకుందాం అని చెబుతుంది. దీంతో హీరో దక్షిత్ ఒక్క సారిగా షాక్ అవుతాడు. అక్కడి నుంచి అంతకు ముందు వారిద్దరి మధ్య జరిగిన కొన్ని సరదా సన్నివేశాలు ట్రైలర్ మూమెంటమ్ ను మార్చేస్తాయి. వీరిద్దరి మధ్యకు వేరే అమ్మాయి రావాలనుకోవడంతో గొడవలు మొదలవుతాయి. దీంతో ఒక్కసారిగా కథ మలుపు తిరుగుతుంది. ఈ కథలో సెకండ్ హీరోయిన్ గా నటించిన అను ఇమానువల్ హీరో రష్మిక ప్రేమలో ఉన్నాడని తెలిసినా.. హీరో ప్రేమను పొందాలనుకుంటుంది. ఈ ముగ్గురి ఎమోషన్స్ మధ్యలో కథ తిరుగుతుంది. రావు రమేశ్ ఎంట్రీ కథకు ఎమోషనల్ డెప్త్ ఇస్తుంది. అసలు ఏం జరిగిందో తెలియాలి అంటే.. నవంబర్ 7 వరకూ ఆగాల్సిందే.
Read also-AI voice in Spirit: ‘స్పిరట్’ గ్లింప్స్‌లో ప్రభాస్ వాయిస్ నిజం కాదని మీకు తెలుసా.. ఏం చేశారంటే?
మొత్తంగా రష్మిక మందాన ఆల్ రౌండ్ పర్ఫామెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ సమర్పణలో విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని కలిసి నిర్మించారు. రాహుల్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. హెషమ్ అబ్ధల్ వాహబ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఎడిటర్ గా చోటాకే ప్రసాద్ ఉన్నారు. కృష్ణన్ వాసంత్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు రష్మిక అభిమానులు. ఈ సినిమా నటనకు స్కోప్ ఉండటంతో రష్మిక మొత్తం ఎఫర్ట్ పెట్టారు. దీంతో ఎమోషన్ బాగా పండాయి. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
