Ravi Teja: మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) నటించిన ‘మాస్ జాతర’ (Mass Jathara) చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలై డిజాస్టరైన విషయం తెలిసిందే. తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా అక్కడ మాత్రం మంచి ఆదరణనే రాబట్టుకుంటోంది. ‘మాస్ జాతర’ తర్వాత రవితేజ చేస్తున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi). ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్, బెల్లా బెల్లా సాంగ్ వచ్చి, సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా రాబోయే సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి నెట్టింట ఓ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే..
Also Read- RJ Shekar Basha: హీరో ధర్మ మహేశ్ భార్య బెదిరిస్తుందంటూ ఆర్జే శేఖర్ భాషా పోలీసులకు ఫిర్యాదు
ఆరుగురు హీరోయిన్లు అనే మాట నమ్మవద్దు
ఈ సినిమాలో రవితేజ సరసన ఆరుగురు హీరోయిన్లు నటిస్తున్నారన్నట్లుగా వైరల్ అవుతున్న వార్తలపై రవితేజ పీఆర్ క్లారిటీ ఇచ్చింది. ‘రవితేజ తర్వాత సినిమాలో ఆరుగురు హీరోయిన్లు నటిస్తున్నారనే వార్తల్లో నిజం లేదు. అవన్నీ ఫేస్ వార్తలు. దయచేసి అభిమానులెవరూ ఈ వార్తలను నమ్మవద్దు’ అని క్లారిటీ ఇచ్చారు. ఒక రూమర్ వ్యాపించకుండా ఆదిలోనే ఫుల్ స్టాప్ పెట్టేసింది టీమ్. దీంతో రవితేజ తదుపరి సినిమాలో హీరోయిన్ ఎవరా? అని అంతా సెర్చ్ చేస్తున్నారు. శివ నిర్వాణతో చేస్తున్న సినిమా షూటింగ్‌ను ఇటీవలే స్టార్ట్ చేసినట్లుగా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో లీకైన విషయం తెలిసిందే. ఈ ఫొటోలో రవితేజ ఆటో డ్రైవర్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమా థ్రిల్లర్ జానర్‌లో ఉంటుందని, ఇందులో ఒక్కరే హీరోయిన్ ఉంటారనేలా ఇప్పుడు ప్రచారం మొదలైంది.
Also Read- Venu Swamy: మూఢమిలో పెళ్లి.. సమంత – రాజ్ నిడిమోరు వివాహంపై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్
హీరోయిన్ ఎవరంటే..
ఆల్రెడీ హీరోయిన్ కూడా ఫిక్సయినట్లుగా టాక్ నడుస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) అనేలా తాజాగా వార్తలు మొదలయ్యాయి. ప్రియా భవానీ శంకర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్నే. ‘కళ్యాణం కమనీయం’, ‘భీమా’, ‘జీబ్రా’, ‘ఇండియన్ 2’, ‘డిమోంటీ కాలనీ 2’ వంటి చిత్రాలలో నటించి, నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. గ్లామర్ పరంగానూ ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. మరి ఈ సినిమాలో ఎలాంటి రోల్ చేస్తుందో తెలియాల్సి ఉంది. ఈలోపు ఆమెనే ఇందులో హీరోయిన్ అనే అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంది. అలాగే ఇందులో సమంత (Samantha) కూడా హీరోయిన్ అనేలా వార్తలు వచ్చాయి. రవితేజ విషయానికి వస్తే.. శివ నిర్వాణతో చేస్తున్న సినిమా అనంతరం మరో మూడు సినిమాలను లైన్‌లో పెట్టినట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి మల్టీ స్టారర్ చిత్రం అని కూడా టాక్. అలాగే ‘విశ్వంభర’ దర్శకుడితో కూడా ఓ సినిమా ఉండనుందని తెలుస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
