RJ Shekar Basha: టాలీవుడ్ హీరో ధర్మ మహేష్ (Dharma Mahesh) ఫ్యామిలీ కాంట్రవర్సీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రముఖ సినీ నటుడు ధర్మ మహేశ్ భార్య గౌతమి (Gautami)పై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ ఆర్జే (రేడియో జాకీ) శేఖర్ భాషా (RJ Shekar Basha) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆర్జే శేఖర్ భాషా పోలీసులకు అందించిన ఫిర్యాదులో సంచలన ఆరోపణలు చేశారు. హీరో ధర్మ మహేశ్, గౌతమిల మధ్య తలెత్తిన వ్యక్తిగత వివాదంలో తాను హీరో ధర్మ మహేశ్‌కు మద్దతుగా మాట్లాడానని పేర్కొన్నారు. ఈ కారణంగా గౌతమి చౌదరి తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని, తీవ్రంగా వేధింపులకు గురిచేస్తోందని తెలిపారు. ఫిర్యాదులో అత్యంత ముఖ్యమైన ఆరోపణ ఏమిటంటే, గౌతమి చౌదరి ఏకంగా తనను బీహార్ రౌడీలను పంపించి చంపిస్తానని బెదిరిస్తోందని శేఖర్ భాషా పేర్కొన్నారు. అంతేకాకుండా, గౌతమి.. తన తల్లి, చిన్న కూతురిపై కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిందని ఆయన పోలీసులకు తెలియజేశారు. ఈ మానసిక వేధింపులు, బెదిరింపుల కారణంగా తనకు తీవ్ర భయాందోళనలు ఎదురవుతున్నాయని ఆయన వివరించారు.
Also Read- Akhanda 2: నందమూరి ఫ్యాన్స్‌కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒక రోజు ముందే వస్తోన్న ‘అఖండ 2’!
పలు సెక్షన్ల కింద కేసు నమోదు
ఆర్జే శేఖర్ భాషా ఫిర్యాదును స్వీకరించిన పంజాగుట్ట పోలీసులు, గౌతమి చౌదరిపై వివిధ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ప్రధానంగా, బెదిరింపులు, వేధింపులకు సంబంధించిన బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్లు 351(3), 352 కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా, ఇంటర్నెట్ లేదా డిజిటల్ మాధ్యమాల ద్వారా అభ్యంతరకరమైన కంటెంట్‌ను ప్రచురించడం లేదా వ్యాప్తి చేయడం వంటి ఆరోపణల నేపథ్యంలో ఐటీ చట్టం సెక్షన్ 67 కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్లను చేర్చడం ద్వారా బెదిరింపులు ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా కూడా జరిగాయని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ధర్మ మహేశ్, గౌతమి చౌదరిల మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ బెదిరింపులకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ కేసు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read- Venu Swamy: మూఢమిలో పెళ్లి.. సమంత – రాజ్ నిడిమోరు వివాహంపై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్
ధర్మ మహేశ్, గౌతమి చౌదరిల మధ్య గొడవలేంటంటే..
హీరో ధర్మ మహేశ్, ఆయన భార్య గౌతమి చౌదరి మధ్య మొదలైన గొడవ చాలా కాలంగా తీవ్ర వివాదంగా కొనసాగుతోంది. ఇది వ్యక్తిగత సమస్యగా మొదలై, క్రమంగా బహిరంగ ఆరోపణలు, ప్రతి ఆరోపణలు, చివరికి పోలీస్ కేసుల వరకు దారితీసింది. వారి మధ్య అసలు గొడవలకు కారణం.. గౌతమి చౌదరి తన భర్త ధర్మ మహేశ్ మీద ప్రధానంగా అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపణలు చేయడం, అందులో ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిలు, అలాగే యాంకర్స్‌తో సంబంధాలు ఉన్నాయని, అర్ధరాత్రుళ్లు తన ఇంటికే వారిని రప్పించుకున్నారని గౌతమి బహిరంగంగా ఆరోపణలు చేశారు. తాను గర్భవతిగా ఉన్న సమయంలో బరువు పెరిగినందుకు మహేశ్ తనపై ఆసక్తి కోల్పోయారని, అప్పుడే వేరే నటీమణులు తమ జీవితంలోకి వచ్చారని గౌతమి ఆరోపించారు. అంతేకాదు, ధర్మ మహేశ్ సినిమా అవకాశాలు పెరిగిన తర్వాత, అదనపు కట్నం తేవాలని తనను వేధించారని గౌతమి చౌదరి గతంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ వరకట్న వేధింపులు కూడా వారి గొడవకు ఒక ముఖ్య కారణమని తెలుస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

