Ravi Teja: మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) రూటు మారుస్తున్నాడా? అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే, ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘మాస్ జాతర’ తర్వాత.. ఇక తన పేరులోని మాస్ పక్కన పెట్టి.. క్లాస్‌గా మారిపోవాలని చూస్తున్నట్లుగా ఆయన రూటు కనిపిస్తుంది. అవును, ‘మాస్ జాతర’ తర్వాత రవితేజ చేసే చిత్రం ఓ క్లాస్ దర్శకుడితో అనే విషయం తెలిసిందే. దర్శకుడే క్లాస్ అనుకుంటే.. ఇప్పుడు ఈ సినిమాకు వినిపిస్తున్న టైటిల్ కూడా క్లాస్‌గా ఉండటం చూస్తుంటే.. రవితేజ మార్పు కోరుకుంటున్నారనేది అర్థమవుతోంది. మరి ఆయన ఈ నిర్ణయం ఎందుకు తీసుకుని ఉంటారు? మాస్ మహారాజా రవితేజ.. క్లాస్ అవతార్‌లోకి మారితే ఎలా ఉంటుందో? అనే వాటిపై ఇండస్ట్రీలో బాగానే చర్చలు నడుస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read- Tribanadhari Barbarik OTT: చెప్పుతో కొట్టుకున్న దర్శకుడి సినిమా ఓటీటీలోకి.. ఎప్పుడంటే?
ఫైనల్‌గా అక్టోబర్ 31న విడుదల
ప్రస్తుతం రవితేజ చేస్తున్న ‘మాస్ జాతర’ (Mass Jathara) సినిమా అక్టోబర్ 31న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గానే ఈ చిత్ర విడుదల తేదీపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. భాను భోగవరపు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై నిర్మాతలు సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. పలు వాయిదాల అనంతరం ఈ సినిమా ఫైనల్‌గా అక్టోబర్ 31న విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా తర్వాత క్లాస్ డైరెక్టర్ కిశోర్ తిరుమల (Kishore Tirumala) దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు వినిపిస్తున్న టైటిలే.. రవితేజ అభిమానుల్లో అనుమానాలకు కారణం అవుతోంది.
Also Read- Rashmika Mandanna: ‘ఇదంతా మీ కష్టంతోనే సాధ్యమైంది’.. రష్మిక పోస్ట్ వైరల్!
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’
ఇంతకీ ఆ టైటిల్ ఏమిటంటే.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Vignapathi) అనేలా టాక్ బాగా వైరల్ అవుతుంది. వాస్తవానికి ఈ సినిమాకు ఇప్పటి వరకు ‘అనార్కలి’ అనే టైటిల్ వినబడింది. కానీ, మేకర్స్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా ఈ టైటిల్‌ను అనౌన్స్ చేయబోతున్నారట. అయితే ఈ టైటిల్, అలాగే ఈ సినిమా దర్శకుడిని దృష్టిలో పెట్టుకుని.. కొన్నాళ్ల పాటు రవితేజ మాస్ చిత్రాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడనేలా టాక్ నడుస్తుంది. అందుకు కారణం వరుస పరాజయాలే. అవును ఒక హిట్ వస్తే.. మూడు ఫ్లాప్స్ అన్నట్లుగా రవితేజ కెరీర్ నడుస్తుంది. సినిమాల పరంగా గ్యాప్ లేకుండా ఆయన చేస్తున్నాడు కానీ, హిట్ మాత్రం వచ్చినట్టే వచ్చి, చివరి నిమిషంలో మిస్ అవుతుంది. అందుకే, కొన్నాళ్ల పాటు మాస్‌ని పక్కన పెట్టి, కుటుంబ కథా చిత్రాలతో సక్సెస్ కొట్టాలని రవితేజ నిర్ణయం తీసుకున్నారట. అందుకే, రవితేజ చిత్రానికి ఇలాంటి టైటిల్ ఫిక్స్ చేశారని అంటున్నారు. మరి ఈ టైటిల్‌తో మాస్ రాజా కొట్టే హిట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
