Raveena Tandon Daughter
ఎంటర్‌టైన్మెంట్

Raveena Tandon Daughter: రవీనా టాండన్ కుమార్తె రాషా టాలీవుడ్ ఎంట్రీ ఖరారు.. హీరో ఎవరో తెలుసా?

Raveena Tandon Daughter: టాలీవుడ్‌లోకి మరో స్టార్ కిడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఎవరా స్టార్ కిడ్? అని అనుకుంటున్నారా? బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ (Raveena Tandon) కుమార్తె రాషా (Rasha Thadani) టాలీవుడ్ ఎంట్రీ ఖరారు అయినట్లుగా టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సెలబ్రిటీలందరి దృష్టి టాలీవుడ్‌పైనే ఉన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నుంచి కూడా టాలీవుడ్‌లో నటించేందుకు నటీనటులు క్యూ కడుతున్నారు. మన టాలీవుడ్ దర్శకులు బాలీవుడ్‌లో ఎలా చక్రం తిప్పుతున్నారో తెలియంది కాదు. ఇప్పుడు మహేష్ బాబు అన్నయ్య, దివంగత రమేష్ బాబు కుమారుడు (Ramesh Babu Son) జయకృష్ణ ఘట్టమనేని సరసన రవీనా టాండన్ కుమార్ రాషా హీరోయిన్‌గా సెలక్ట్ అయినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి రాషా గురించి కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఫైనల్‌గా జయకృష్ణ ఘట్టమనేని సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఖరారైందనేది తాజా అప్డేట్. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read- Chiru Odela: ఎన్ని టీజర్స్ వస్తే ఏంటి.. ఒక్క ట్వీట్‌తో మెగా ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ చేశాడుగా!

గతంలో రవీనా టాండన్ తెలుగులో నటసింహం నందమూరి బాలకృష్ణ ‘బంగారు బుల్లోడు’ (Bangaru Bullodu) చిత్రంలో నటించి హిట్ అందుకున్నారు. ఆమె వారసురాలిగా, రాషా తడానీ ఇప్పటికే బాలీవుడ్‌లో అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ సరసన ‘ఆజాద్’ సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టారు. ఆమె చేసింది ఒక్క సినిమానే అయినా.. తన అందం, అభినయం, డ్యాన్స్‌తో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు రాషా. ఇప్పుడు తెలుగు పరిశ్రమలోకి అడుగుపెడుతుందనే వార్తలతో అందరి దృష్టి ఆమెపై పడింది. జయకృష్ణ హీరోగా తెరంగేట్రం చేయబోతున్న సినిమాకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచినప్పటికీ, విషయం మాత్రం ఆగలేదు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని సినీ రంగ ప్రవేశం గురించి కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అతను అమెరికాలో నటనలో శిక్షణ తీసుకున్నారని, ఇప్పుడు హైదరాబాద్‌కు తిరిగి వచ్చి కథలు వింటున్నారనేలా వార్తలే కాకుండా.. ఇటీవల ఆయన ఫొటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి.

Also Read- Sanju Samson’s Wife: ఆసియా కప్‌కు ముందు సంజూ శాంసన్‌పై భార్య చారులత కీలక అప్‌డేట్!

జయకృష్ణను ఆ ఫొటోల్లో చూసిన వారంతా.. ఇండస్ట్రీని ఏలేందుకు ఇంకో వారసుడు రెడీ అవుతున్నాడనేలా మాట్లాడుకున్నారు కూడా. ఇక అతని ఎంట్రీకి సంబంధించి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ‘RX 100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపును సొంతం చేసుకున్న అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. వైజయంతి ఆర్ట్స్, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. ఈ సినిమాతో మహేష్ బాబు కూడా అండగా ఉంటారని, అన్నయ్య కుమారుడి అరంగేట్రానికి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని కూడా టాక్ నడుస్తుంది. రవీనా టాండన్ కుమార్తె, మహేష్ బాబు అన్న కుమారుడు కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్టుపై.. ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ, అప్పుడే అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్టోబర్ 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమవుతుందనేలా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల కొరకు వెయిట్ చేయాల్సి ఉంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది