ChiruOdela
ఎంటర్‌టైన్మెంట్

Chiru Odela: ఎన్ని టీజర్స్ వస్తే ఏంటి.. ఒక్క ట్వీట్‌తో మెగా ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ చేశాడుగా!

Chiru Odela: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టినరోజును పురస్కరించుకుని.. ఆయన చేస్తున్న, చేయబోతున్న సినిమాల అప్డేట్స్ వచ్చిన విషయం తెలిసిందే. ముందుగా ‘విశ్వంభర’ గ్లింప్స్‌తో మొదలైన అప్డేట్స్, అనిల్ రావిపూడి సినిమా, బాబీ సినిమాల అప్డేట్స్‌లో హడావుడి అయిపోయిందని అనుకున్నారు. ఈ మధ్యలో చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) సినిమా ఒకటి ఉందని అంతా మరిచిపోయారు. ఫ్యాన్స్ కొందరు మాత్రం, ఆ యూనిట్ నుంచి ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో.. నాని (Natural Star Nani) నిర్మించే ఈ సినిమా ఆగిపోయిందని అనుకోవడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే, నాని కూడా చిరుకు బర్త్‌డే గ్రీట్ చేయలేదు. చిరంజీవి వీరాభిమాని అని చెప్పుకునే శ్రీకాంత్ ఓదెల కూడా ట్వీట్ వేయకపోవడంతో.. నిజంగానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానాలకు తెరదించుతూ, ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్‌ అన్ని పక్కన పెట్టేసి మరీ మాట్లాడుకునేలా శ్రీకాంత్ ఓదెల ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో ఆయన అందరి అటెన్షన్‌ని సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన పోస్ట్‌లో..

Also Read- Vishal 35 Movie: ‘విశాల్ 35’ ప్రాజెక్ట్‌లో అంజలికి ఛాన్స్.. ఆ బ్యానర్‌కి ఇది 99వ చిత్రం

‘‘నువ్వు నా ప్రత్యక్ష దైవం
చిరంజీవితో ఒక ఫొటో దిగి ఇంట్లో అమ్మకు చూపెడితే.. ఫస్ట్ టైమ్ నువ్వు ఫొటోలో నవ్వడం చూస్తున్నా రా అని చెప్పింది. నా దృష్టిలో చిరంజీవికి నిర్వచనం ఇదే.
ఏం చేస్తాడు నీ చిరంజీవి అంటే..
నా లాంటి ఇంట్రోవర్ట్ గాడితో ఇంద్ర స్టెప్ చేయించగలడు.
సినిమా టికెట్లు కొనుక్కునేవాడితో సినిమా తీయించగలడు.
జీవితకాలం ఆడే సినిమా రా చిరంజీవి. ఇప్పుడు చిరంజీవితో సినిమా అంటే.. జీవితకాలం గుర్తుండిపోయేలా తీయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు.
చివరిగా నేను చెప్పేదేమిటంటే.. ఈ మధ్యకాలంలో నా చిరంజీవిని (వింటేజ్ చిరు) తెరపై మిస్సవుతున్నాను. మళ్లీ ఆయనని అలా చూపిస్తానని మాట ఇస్తున్నాను. నాకోసం నేనే తీస్తున్న సినిమా ఇది. నాలాంటి ప్రతి చిరంజీవి అభిమాని కోసం తీస్తున్న సినిమా ‘చిరుఓదెల’ (ChiruOdela). ఇట్స్ ఏ బ్లడ్ ప్రామిస్. హ్యాపీ బర్త్‌డే డైనోసార్ మెగాస్టార్ చిరంజీవి సార్.. (ఫొటో తీసేటప్పుడు చెయ్యి వణికి.. ఫొటో అలా బ్లర్ వచ్చింది. దీనిని పట్టించుకోవద్దు)’’ అని చిరుతో సెల్ఫీని ఆయన పోస్ట్ చేశారు.

Also Read- Chiranjeevi – Bobby: వీరి కాంబినేషన్‌లో మరో సినిమా.. ఈ సారి పూనకాలు డబుల్ లోడింగ్

ఇక ఈ పోస్ట్‌కు పడుతున్న కామెంట్స్ చూస్తుంటే.. శ్రీకాంత్ ఓదెలకు గుడి కట్టేయడానికి ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారనిపిస్తుంది. గ్లింప్స్ లు, టీజర్లు ఇవన్నీ ఇవ్వని హై ఈ పోస్ట్ ఇచ్చింది. ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం.. అని ఓ నెటిజన్ పోస్ట్ చేస్తే.. ‘అన్నా.. చదువుతుంటే కళ్లలో నీళ్లు ఆగలేదు. రోరింగ్ ఎపిక్‌‌కు ఆల్ ద బెస్ట్’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. మీ ట్వీట్‌లో ప్యూర్ లవ్ కనిపిస్తోంది సార్ అంటూ.. శ్రీకాంత్ ఓదెలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మొత్తంగా అయితే.. మరోసారి ‘చిరుఓదెల’ ప్రాజెక్ట్‌పై భారీగా అంచనాలను పెంచేశారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. అదీ కూడా ఎలాంటి పోస్టర్ వదలకుండా. ఇది కదా.. ట్రూ ఫ్యాన్ బాయ్ సంభవం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం