Megastar-Chiranjeevi( image :x)
ఎంటర్‌టైన్మెంట్

Chiranjeevi – Bobby: వీరి కాంబినేషన్‌లో మరో సినిమా.. ఈ సారి పూనకాలు డబుల్ లోడింగ్

Chiranjeevi – Bobby: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరి పోయే సప్రైజ్ లను ఇస్తున్నారు నిర్మాతలు. ఇప్పటికే వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ‘విశ్వంభర’ నుంచి గ్లింప్స్ విడుదలై సంచలనం సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఇది విడుదలైన కొద్ది సేపటికే సోషల్ మీడియాను షేక్ చేసింది. తాజాగా మరో సప్రైజ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు ‘మెగా 158’ నిర్మాతలు. బాబి కొల్లి దర్శకత్వంలో మరో సినిమాకు రెడీ అవుతున్నారు మెగాస్టార్. అయితే దీనికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ ‘వాల్తేరు వీరయ్య’ హిట్ కావడంతో రాబోయే సినిమాతో మరో హిట్ ఖాయం అంటున్నారు అభిమానులు.

Read also- Sedan SUVs – GST: గుడ్ న్యూస్.. కారు చౌకగా ఎస్‌యూవీ, సెడాన్లు.. అప్పు చేసైనా కొనేయాలి!

చిరంజీవి బాబీ కొల్లి గతంలో 2023 సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో కలిసి పనిచేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. చిరంజీవి కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా రికార్డు సృష్టించింది. ఈ విజయం తర్వాత, ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్ జానర్‌లో ఉంటుందని, పాన్-ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుందని సమాచారం. బాబీ కొల్లి ఈ చిత్రం కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇది చిరంజీవి మాస్ ఇమేజ్‌కు తగినట్లుగా ఉండనుంది. సినిమా టైటిల్‌గా ‘పూనకాలు లోడింగ్’ అనే పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. ఇది ‘వాల్తేరు వీరయ్య’లోని ఒక హిట్ పాట పేరు నుంచి స్ఫూర్తి పొందినది. అయితే, ఈ టైటిల్‌పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Read also- Kukatpally Murder Case: సహస్ర హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. హంతకుడు ఓ మైనర్.. పక్కా ప్లాన్‌తో..

ఈ పోస్టర్ ను చూస్తుంటే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఉండబోతుంని తెలుస్తోంది. గొడ్డలి గోడకు దిగిన తీరు చూస్తే చిరంజీవిలో యాక్షన్ కోణాన్ని మరో సారి మన ముందు ఆవిష్కరించనున్నారు దర్శకుడు బాబి. ఈ సినిమా ‘మెగా158’అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్  ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనుంది. ‘ద బ్లేడ్ దట్ సెట్ ద బ్లడీ బెన్చ్‌మార్క’ అంటూ రాసుకొచ్చారు ఆ పోస్టర్ లో. మొత్తంగా ఈ సినిమా ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఉండబోతుందని తెలుస్తోంది.

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?