The Girlfriend: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) మరోసారి తన ప్రతిభను కనబరిచేందుకు రెడీ అవుతోంది. సౌత్, నార్త్‌లలో బిజీ హీరోయిన్‌గా మారిన రష్మిక.. ఇప్పుడు టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టితో కలిసి నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ సినిమాను నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బుధవారం ఈ చిత్రం నుంచి ‘నదివే..’ అనే సాంగ్‌ను హిందీతో పాటు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో మేకర్స్ రిలీజ్ చేశారు. ‘నదివే..’ పాటను బ్యూటీఫుల్ మెలొడీగా కంపోజ్ చేయడంతో పాటు, మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ ఆలపించారు. రాకేందు మౌళి ఈ పాటకు లిరిక్స్ అందించారు. ఈ పాటను గమనిస్తే..
Also Read- Nithya Menen: జాతీయ అవార్డు తీసుకునే ముందురోజు నిత్యా మీనన్ ఏం చేసిందో తెలుసా?
‘‘వెలుగారునా.. నిశి పూసినా..
వెలివేసినా.. మది వీడునా..
గుండె కను మూసినా.. విధి రాసిన
కళ కాలిపోవు నిజమైనా.. నిను వదలకుమా, వదలకుమా బెదురెరుగని బలమా..
నదివే.. నువ్వు నదివే..
నీ మార్పే రానుంది వినవే..
నదివే.. నువ్వు నదివే..
నీకే నువ్వియ్యాళీ.. విలువే..
శిలువ బరువే మోయాక, సులువు భవితే లేదుగా..
వెన్నెల వలె నను కలువవు నువు కావా కాలేవా..
తడువు గురుతులై.. ఇలా..
తరుము గతములా అవలా..
ఎటు కదలను ఈ నిమిషం..
నులిమిన గొంతుకవా..
నటనిక చాలనే యద మోసిన కొన ఊపిరున్న చైతన్యం..
నువ్వు వదలకుమా.. వదలకుమా.. సరికోరే నిజమా..
Also Read- Surekha Vani: పబ్బులో గుర్తు తెలియని వ్యక్తితో ఎంజాయ్ చేస్తూ.. బండారం బట్టబయలు!
నదివే.. నువ్వు నదివే..
నీ మార్పే రానుంది వినవే..
నదివే.. నువ్వు నదివే..
నీకే నువ్వియ్యాళీ.. విలువే..
మునుముందే వెలుగుందీ.. నిన్నల్లో నిశి దాగున్నా..
మునుముందే వెలుగుందీ.. దారే మూసుకుపోతున్నా..
మునుముందే వెలుగుందీ.. ఆగొద్దు ఏదేమైనా..
మునుముందే వెలుగుందీ.. దాటేయి ఆటు పోటైనా..
మునుముందే వెలుగుందీ.. కలలే వీడొద్దంటున్నా..
మునుముందే వెలుగుందీ.. తెలుపేగా హరివిల్లైనా..
మునుముందే వెలుగుందీ.. ఉనికిని మరువద్దంటున్నా..
మునుముందే వెలుగుందీ.. నీ వెలుగై నేనొస్తున్నా.
నదివే’’…… అంటూ ప్రేయసి ప్రత్యేకతను పొగుడుతూ పొయెటిక్‌గా సాగిందీ పాట.
ఈ పాట వినడంతో పాటు కచ్చితంగా చూడాలనిపించేలా మేకర్స్ పిక్చరైజ్ చేశారు. హీరోహీరోయిన్లు ఇద్దరూ తమ డ్యాన్స్‌తో ఈ పాటన ఓ స్థాయికి తీసుకెళ్లారు. ఈ పాటతో ఈ సినిమాపై భారీగా అంచనాలు మొదలయ్యాయి. ఎందుకంటే, రష్మిక ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఇలా డ్యాన్స్ చేసింది లేదు. ఇద్దరూ కూడా కళ్లు చెదిరేలా డ్యాన్స్‌తో అలరించారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ విడుదలైన అన్ని భాషల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు