Nithya Menen: సౌత్ హీరోయిన్లలో టాలెంటెడ్ హీరోయిన్‌గా పేరు పొందింది నిత్యా మీనన్. ఆమె ధనుష్‌తో కలిసి నటించిన ‘తిరుచిత్రంబలం’ అనే చిత్రానికిగానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్నారు. అయితే ఈ జాతీయ అవార్డు అందుకునే ముందు రోజు జరిగిన ఓ సన్నివేశాన్ని.. తాజాగా తన ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది నిత్యా మీనన్. ‘తిరుచిత్రంబలం’ తర్వాత మరోసారి కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) సరసన ఆమె ఓ చిత్రాన్ని చేస్తుంది. ఆ సినిమా పేరు ‘ఇడ్లీ కడై’ (తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ అని). ఈ సినిమాలో ఒక పల్లెటూరి యువతిగా, ఇడ్లీ అమ్ముకునే పాత్రలో నిత్యా మీనన్ నటించినట్లుగా తాజా ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. మొదటి నుంచి నిత్యా మీనన్ చేస్తున్న పాత్రలన్నీ వైవిధ్యతతో నిండినవే. అంతేకాదు, ఛాలెంజింగ్ రోల్స్ చేయడంలోనూ నిత్యా మీనన్ ఎప్పుడూ ముందుంటారు. అలాంటి పాత్రలే తనకు కావాలని చెబుతుంటారు. అలాంటి ఛాలెంజింగ్ పాత్రనే ‘ఇడ్లీ కడై’ చిత్రంలో చేసినట్లుగా నిత్యా మీనన్ చెప్పుకొచ్చింది.
Also Read- Surekha Vani: పబ్బులో గుర్తు తెలియని వ్యక్తితో ఎంజాయ్ చేస్తూ.. బండారం బట్టబయలు!
ఇక జాతీయ అవార్డు అందుకునే ముందురోజు ‘ఇడ్లీ కడై’ (Idli Kadai) చిత్ర షూటింగ్‌లో నిత్యా మీనన్ పాల్గొందట. ఆ రోజు ఆమె చేసిన సన్నివేశం అద్భుతం అంటూ చెప్పుకొచ్చింది. ‘ఇడ్లీ కడై’ సినిమా అంగీకరించే ముందు వారు నా పాత్ర గురించి చెప్పారు. ఇందులో మీరు పిడకలు చేయాలి. అందుకు మీకు సమ్మతమేనా? అని అడిగారు. తప్పకుండా చేస్తానని చెప్పాను. ఆవు పేడతో పిడకలు చేసిన సీన్ చేసిన మరుసటి రోజే జాతీయ అవార్డు తీసుకోవడానికి వెళ్లాను. అవార్డు అందుకునే సమయంలో నా వేలి గోర్లలో పేడ కనిపిస్తూనే ఉంది. నిజంగా ఇది నాకు చాలా గొప్ప అనుభూతిని ఇచ్చింది. కష్టానికి దక్కిన ప్రతిఫలంగా భావించాను. చాలా సంతోషంగా అనిపించింది. ఇది కదా జీవితం అంటే అని అనుకున్నాను. ఆ సందర్భాన్ని నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను. ‘ఇడ్లీ కడై’ కోసం ఆవు పేడను పట్టుకుని, పిడకలు చేశాను. ఆ సినిమాతో పిడకలు ఎలా చేయాలో నేర్చుకున్నాను. ఫస్ట్ టైమ్ నా జీవితంలో చేతులతో ఆవు పేడను పట్టుకుని పిడకలు చేయడం నేర్చుకున్నాను.. అని నిత్యా మీనన్ చెప్పుకొచ్చింది.
Also Read- Sania Mirza: ఆ తెలుగు హీరోతో సానియా మీర్జా రెండో పెళ్లి.. కాఫీ షాప్ లో అలా ఇద్దరూ?
ప్రస్తుతం నిత్యా మీనన్ ఇంటర్వ్యూలో చెప్పిన ఈ విషయం బాగా వైరల్ అవుతోంది. నిత్యా మీనన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎందుకంటే, సినిమాలు ఇకపై చేయను అని చెబుతూనే, ఇలాంటి పాత్రలు వస్తే మాత్రం అస్సలు వదులుకోవడం లేదు నిత్యా మీనన్. ‘ఇడ్లీ కడై’ చిత్రంలో కూడా తన పాత్ర అద్భుతంగా ఉంటుందని అంటోంది. అంతేకాదు, ఇందులోని పాత్రకు కూడా తనకు మంచి గుర్తింపు వస్తుందని చెబుతోంది. ‘ఇడ్లీ కడై’ విషయానికి వస్తే.. ధనుష్, నిత్యా మీనన్ కాంబోలో వస్తున్న రెండో చిత్రమిది. ఈ సినిమాను డాన్ పిక్చర్స్‌తో కలిసి ధనుష్ తన వండర్ బార్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా రచన, దర్శకత్వ బాధ్యతలను కూడా ధనుష్ నిర్వహిస్తున్నారు. అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, పార్థిబన్, సముద్రఖని, రాజ్‌కిరణ్‌లు వంటి వారు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. అక్టోబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు