Rare Frame: భారతీయ సినీ, క్రీడా రంగాల్లో కొన్ని కలయికలు చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి ఒక అరుదైన, వెలకట్టలేని దృశ్యం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు (Salman Khan 60th Birthday) వేడుకలు ముంబైలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం ఏమిటంటే.. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), క్రికెట్ లెజెండ్ MS ధోని (MS Dhoni), బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, బాబీ డియోల్ (Bobby Deol) ఒకే చోట చేరి ముచ్చటించుకోవడం. ఈ నలుగురు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ‘RRR’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్లతో ఎప్పుడూ మంచి అనుబంధాన్ని కొనసాగిస్తుంటారు. సల్మాన్ ఖాన్‌తో చరణ్‌కు ఉన్న స్నేహం ఇప్పటిది కాదు. సల్మాన్ 60వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ, చరణ్ ప్రత్యేకంగా హాజరై తన శుభాకాంక్షలు తెలియజేశారు. వైట్ పోలో షర్ట్, బ్లాక్ ట్రౌజర్స్‌లో చరణ్ క్లాస్ లుక్‌లో మెరిసిపోతుంటే.. సల్మాన్ తనదైన స్టైల్లో బ్లాక్ షర్ట్‌లో మాస్ లుక్ ఇచ్చారు. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూస్తుంటే, త్వరలో ఏదైనా క్రేజీ కొలాబరేషన్ ఉంటుందా అన్న ఆశ అభిమానుల్లో మొదలైంది.
Also Read- Huma Qureshi as Elizabeth: యష్ ‘టాక్సిక్’ సామ్రాజ్యంలో ‘ఎలిజబెత్’గా హుమా ఖురేషి.. పోస్టర్ పీక్స్..
కెప్టెన్ కూల్, యానిమల్ స్టార్
ఈ ఫ్రేమ్‌లో మరో ప్రధాన ఆకర్షణ ‘కెప్టెన్ కూల్’ మహేంద్ర సింగ్ ధోని. సినిమా వేడుకల్లో ధోని కనిపించడం చాలా అరుదు. సల్మాన్ అంటే ఉన్న ప్రత్యేక అభిమానంతో ధోని ఈ బర్త్‌డే పార్టీకి హాజరైనట్లుగా తెలుస్తోంది. బ్రౌన్ జాకెట్, జీన్స్‌లో ధోని సింపుల్‌గా కనిపిస్తూనే తన చరిష్మాను చాటారు. ఇక ‘యానిమల్’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన బాబీ డియోల్ కూడా ఈ ఫ్రేమ్‌లో ఉండటం విశేషం. గ్రేడ్ బియర్డ్ లుక్‌లో బాబీ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు.
Also Read- Sanjana Journey: గౌరవం కోసమే బిగ్ బాస్9లో టాప్ 5 వరకూ వచ్చానంటున్న సంజన.. ఆ నింద ఏంటంటే?
ఒకే చోట కోట్లాది మంది అభిమానం
ఈ ఒక్క ఫోటోతో టాలీవుడ్ మాత్రమే కాదు.. అన్ని ఇండస్ట్రీస్ షేకవుతున్నాయి. కారణం కెప్టెన్ కూల్ అండ్ మెగా పవర్ స్టార్. ధోని, రామ్ చరణ్‌లు ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా కలిసి ఓ యాడ్ చేశారు. వారిద్దరి మధ్య ఎప్పటి నుంచో స్నేహం ఉంది. ఈ ఫొటోలో వారు కనబడుతున్న తీరు మరోసారి వారి స్నేహాన్ని తెలియజేస్తుంది. టాలీవుడ్ గర్వకారణంగా చెప్పుకునే రామ్ చరణ్, బాలీవుడ్ బాక్సాఫీస్ కింగ్ సల్మాన్ ఖాన్, ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరు ఎమ్మెస్ ధోని, ప్రస్తుత ట్రెండింగ్ విలన్‌గా దూసుకుపోతున్న బాబీ డియోల్.. ఈ నలుగురి ఫాలోయింగ్‌ను కలిపితే అది ఒక దేశపు జనాభా కంటే ఎక్కువే ఉంటుంది. అందుకే ఈ ఫొటోను అభిమానులు ‘ప్రైస్‌లెస్ మూమెంట్’ అని అభివర్ణిస్తున్నారు. ఉత్తరాది, దక్షిణాది అనే భేదం లేకుండా భారతీయ దిగ్గజాలందరూ ఇలా కలిసి ఉండటం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుకలు కేవలం ఒక పార్టీలా కాకుండా, భారతీయ సినిమా, క్రీడా రంగాల కలయికలా సాగాయనేదానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ పిక్ నిలుస్తోంది. రామ్ చరణ్ వంటి గ్లోబల్ స్టార్ అక్కడ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవడం మెగా అభిమానులకు పండుగ లాంటిదే. సోషల్ మీడియాలో ఈ ఫోటో ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టౌన్‌గా ట్రెండ్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

