Sanjana Journey: బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఎంతో మంది కంటెస్టెంట్స్ వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ కొందరి ప్రయాణం మాత్రమే ప్రేక్షకులపై బలమైన ముద్ర వేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9లో తనదైన ఆట తీరుతో, మొండితనంతో, ఆత్మవిశ్వాసంతో టాప్-5 వరకు చేరుకున్న కంటెస్టెంట్ సంజన. హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత ‘బిగ్ బాస్ బజ్’ కార్యక్రమంలో శివాజీతో ఆమె పంచుకున్న విశేషాలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇదే సందర్భంలో శివాజీ ఆమె ను ‘ఆంటీ’ అని సంబోధించారు. ఆమె మాత్రం నవ్వుతూనే సమాధానం ఇచ్చారు. సంజన తన బిగ్ బాస్ ప్రయాణాన్ని అత్యంత విజయవంతంగా 15 వారాల పాటు కొనసాగించింది. ప్రారంభంలో ‘గుడ్ల దొంగతనం’ వంటి చిన్నపాటి గొడవలతో ఆటను మొదలుపెట్టిన ఆమె, రోజులు గడిచేకొద్దీ తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ ‘వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్’ ఇచ్చే స్థాయికి ఎదిగిందని శివాజీ ఆమెను కొనియాడారు. సాధారణంగా తెలుగు బిగ్ బాస్ చరిత్రలో వివాహిత మహిళలు లేదా ‘ఆంటీలు’గా పిలవబడే వారు టాప్-5 వరకు రావడం చాలా అరుదు, కానీ సంజన ఆ రికార్డును తిరగరాశారు.
Read also-RajaSaab Pre Release: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా?.. ఎప్పుడంటే?
తాను టాప్-5 కి చేరుకుంటానని మొదటి నుండే సంజనలో గట్టి నమ్మకం ఉండేది. ఆ నమ్మకంతోనే ఆమె ఏకంగా 100 డ్రెస్సులను ప్యాక్ చేసుకుని బెంగళూరు నుండి హైదరాబాద్ వచ్చానని ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఏ దశలోనూ ఆమె తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా, హౌస్‌లో తన ఉనికిని చాటుకున్నారు. గతాన్ని చెరిపివేసి, పిల్లల కోసం కొత్త చరిత్ర రాయడానికి ఇక్కడకు వచ్చానన్నారు. సంజన బిగ్ బాస్ హౌస్‌లోకి రావడానికి వెనుక ఒక బలమైన ఎమోషనల్ కారణం ఉంది. 2020లో ఆమెపై వచ్చిన ఒక ఆరోపణ (నింద) వల్ల ఆమె చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. “డబ్బులు లేకపోయినా, చిన్న ఇంట్లో ఉన్నా మనిషి బ్రతకగలడు, కానీ గౌరవం పోతే అది తట్టుకోవడం కష్టం” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Read also-Christmas Boxoffice: ఈ క్రిస్మస్ కు విడుదలైన తెలుగు సినిమాల డే వన్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?..
తన పిల్లలు స్కూల్‌కు వెళ్ళినప్పుడు ‘మీ అమ్మ ఎవరో మాకు తెలుసు’ అని ఆ పాత నింద గురించి ఎవరూ అనకూడదని, దానికి బదులుగా “బిగ్ బాస్ సీజన్ 9 టాప్-5 లో ఉన్న సంజన మా అమ్మ” అని వాళ్ళు గర్వంగా చెప్పుకోవాలనే లక్ష్యంతోనే తాను ఇక్కడికి వచ్చానని భావోద్వేగంగా చెప్పారు. సంజన ప్రయాణం కేవలం ఒక రియాలిటీ షో విజయం మాత్రమే కాదు, నిందలను ఎదుర్కొని నిలబడాలనుకునే ప్రతి మహిళకు ఒక స్ఫూర్తి. తనపై పడ్డ మరకను తన ప్రతిభతో కడిగేసుకుని, ఒక ‘గ్రేట్ మదర్’గా, సక్సెస్ ఫుల్ కంటెస్టెంట్ గా ఆమె బయటకు వచ్చారు. శివాజీ కూడా ఆమె పోరాటాన్ని చూసి అభినందించారు. మొత్తానికి సంజన ఇంటర్వ్యూ ఆమె వ్యక్తిత్వాన్ని, లక్ష్యాన్ని స్పష్టంగా ఆవిష్కరించింది. అయితే ఈ ఇంటర్వ్యూలో ఒకానొక సందర్భంలో శివాజీ సంజనను ఆంటీ అని సంబోధించారు. ఇది చూసిన నెటిజన్లు ఇదంతా ఎవరిమీదో పగ తీర్చుకోవడానకి చేస్తున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే మళ్లీ ఈ మాటలు ఎక్కడి వరకూ వెళ్తాయో చూడాలి మరి.

