Ramana Gogula: రమణ గోగుల.. ఈ పేరు ఇప్పటి జనరేషన్‌కు అంతగా తెలియకపోవచ్చునేమో కానీ, కాస్త వెనక్కి వెళితే.. ఆయనో స్టార్ మ్యూజిక్ కంపోజర్. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోల చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు రమణ గోగుల (Ramana Gogula) అందించిన ప్రతి సాంగ్ హిట్టేనంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాంటి సంగీత దర్శకుడు.. కొన్నాళ్ల పాటు సంగీతానికే కాదు, సినిమా ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో ఒక పాట పాడి.. మళ్లీ తన సత్తా ఏంటో చాటిన రమణ గోగుల.. నయా జర్నీకి సిద్ధమయ్యారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని ‘గోదారి గట్టుపైన రామ చిలకవే’ అంటూ ఆయన పాడిన పాట ఎలాంటి ఆదరణను రాబట్టుకుందో.. ఆ సినిమా సక్సెస్‌లో ఎంతగా భాగమైందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వాయిస్‌కు ఉన్న ఆదరణ అలాంటిది మరి. ప్రేక్షకులు చూపించిన ఈ ప్రేమతో ఆయన ట్రావెలింగ్ సోల్జర్‌గా కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Bigg Boss Telugu 9: ఇమ్మానుయేల్ చేతుల్లో పవరాస్త్ర.. ఈ వారం ఎలిమినేషన్ ఆపుతాడా?
ఇన్ కాన్వర్సేషన్స్ విత్ ది ట్రావెలింగ్ సోల్జర్
విశ్వ వేదికలపై తెలుగు పాటల జెండాను ఎగరవేయడానికి, ఏళ్ల నాటి స్మృతులను మళ్ళీ మీటేందుకు ఈ మల్టీ టాలెంటెడ్ పర్సన్ సిద్ధమయ్యారు. మెల్‌బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ (Melbourne MAMA Creative Space), టాప్ నాచ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆస్ట్రేలియా (Top Notch Entertainment Australia) సంయుక్తంగా ‘ఇన్ కాన్వర్సేషన్స్ విత్ ది ట్రావెలింగ్ సోల్జర్ – రమణ గోగుల ఆస్ట్రేలియా టూర్ ఫిబ్రవరి 2026’ (In Conversations with the Travelling Soldier) పేరిట ఒక భారీ సంగీత యాత్రను ప్రకటించాయి. ఈ విషయాన్ని తెలిపేందుకు హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రమణ గోగులతో పాటు, ఎక్సెల్ గ్లోబల్ సర్వీసెస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రామ్ కట్టాల, మెల్‌బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ వ్యవస్థాపకుడు సతీష్ వర్మ.. ఈ వరల్డ్ టూర్ వివరాలను వెల్లడించారు.
‘డాక్యుమెంటరీ-మ్యూజికల్ సిరీస్’
రమణ గోగుల తన సంగీత ప్రస్థానంలో తొలిసారిగా పూర్తి స్థాయి గ్లోబల్ కాన్సర్ట్ టూర్ (Global Concert Journey) చేయబోతుండటం.. తెలుగు సంగీత చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ టూర్ కేవలం సంగీత కచేరీలకు మాత్రమే పరిమితం కాకుండా.. రమణ గోగుల ఐకానిక్ పాటలు, వాటి వెనుక ఉన్న జ్ఞాపకాలు, తెర వెనక ఉన్న కథలతో కూడిన ఒక భావోద్వేగభరితమైన అన్వేషణగా ఉంటుందని ఈ గ్లోబల్ కాన్సర్ట్ టూర్ నిర్వాహకులు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా మెల్‌బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ ఒక వినూత్నమైన ‘డాక్యుమెంటరీ-మ్యూజికల్ సిరీస్’ను రూపొందిస్తోంది. దీనిని ప్రీమియం ఇండో-ఆస్ట్రేలియన్ మ్యూజికల్ జర్నీగా ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read- Chiranjeevi: అనిల్ రావిపూడి బర్త్‌డే.. చిరు పోస్ట్ వైరల్!
హృదయాన్ని టచ్ చేసే సంభాషణల సమాహారం
ఈ సందర్భంగా మెల్‌బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ వ్యవస్థాపకుడు సతీష్ వర్మ మాట్లాడుతూ.. రమణ గోగుల గతంలో ఎప్పుడూ ఇలాంటి కాన్సర్ట్స్ చేయలేదు. ఇది కేవలం ఒక టూర్ మాత్రమే కాదు, ఇదొక భావోద్వేగాల ఉద్యమంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇది నోస్టాల్జియా, హృదయాన్ని టచ్ చేసే సంభాషణల సమాహారం. ‘ట్రావెలింగ్ సోల్జర్’ తొలిసారిగా ప్రపంచ వేదికపైకి అడుగుపెడుతున్నారు. ఖండాంతరాల్లో ఉన్న మ్యూజిక్ లవర్స్ అంతా రమణ గోగుల కళను, కథను విని గొప్ప అనుభూతికి లోనవుతారని, అలా ఈ టూర్‌ని ప్లాన్ చేశామని చెప్పుకొచ్చారు.
‘ఇన్ కాన్వర్సేషన్స్ విత్ ది ట్రావెలింగ్ సోల్జర్’ టూర్ వివరాలివే..
2026 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా పర్యటనతో ఈ ప్రపంచ యాత్ర ప్రారంభమవుతుంది. ఆ తర్వాత యూకే, అమెరికా పర్యటనలు ఉంటాయి.
ఆస్ట్రేలియా (ఫిబ్రవరి 2026): మెల్‌బోర్న్, సిడ్నీ, పెర్త్
యూకే (2026): లండన్, మాంచెస్టర్
అమెరికా (2026): ఈస్ట్ కోస్ట్ అండ్ వెస్ట్ కోస్ట్
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

