Chiranjeevi: అనిల్ రావిపూడి బర్త్‌డే.. చిరు పోస్ట్ వైరల్!
Chiranjeevi Anil Ravipudi (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Chiranjeevi: అనిల్ రావిపూడి బర్త్‌డే.. చిరు పోస్ట్ వైరల్!

Chiranjeevi: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి పుట్టినరోజు (HBD Anil Ravipudi)ను పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడికి ఆయన అందమైన వాచ్‌ని గిఫ్ట్‌గా ఇచ్చారు. అంతేకాదు, కేక్ కట్ చేసి బర్త్‌డే‌ని సెలబ్రేట్ చేశారు. అనిల్ రావిపూడి అనే కాదు, గతంలో దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ బాబీ వంటి వారికి కూడా చిరంజీవి వాచ్ ప్రజంట్ చేసిన విషయం తెలిసిందే. బాబీతో సినిమా చేసే టైమ్‌లో అతని బర్త్ ‌డే రావడంతో.. అప్పుడు కూడా ప్రత్యేకమైన వాచ్‌ని బాబీని గిప్ట్‌గా ఇచ్చారు చిరు. ప్రస్తుతం అనిల్ రావిపూడితో ‘మన శంకరవరప్రసాద్ గారు’ (Mana ShankaraVaraPrasad Garu) అనే సినిమా చేస్తున్న చిరంజీవి (Megastar Chiranjeevi).. దర్శకుడి పుట్టినరోజుకు మెమురబుల్ గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేసి అతనికి ఆనందాన్నిచ్చారు. ఈ సర్ప్రైజ్ గిఫ్ట్, చిరు అందించిన హృదయపూర్వక శుభాకాంక్షలు అనిల్ రావిపూడికి మోస్ట్ మోమరబుల్ మూమెంట్స్‌గా నిలిచిపోతాయనడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు.

Also Read- Bigg Boss Telugu 9: ఇమ్మానుయేల్ చేతుల్లో పవరాస్త్ర.. ఈ వారం ఎలిమినేషన్ ఆపుతాడా?

‘మన శంకరవరప్రసాద్ గారు’ కోసం వెయిటింగ్..

అనిల్ బర్త్‌డే‌ను పురస్కరించుకుని చిరంజీవి పబ్లిక్ ఫ్లాట్‌ఫామ్ ఎక్స్‌లోనూ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘మై డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలి. సెట్‌లో మీ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ప్రతి క్షణాన్ని ఎంతో ప్రత్యేకం చేశాయి.ఈ 2026 సంక్రాంతికి థియేటర్లలో మీతో, అలాగే మన ‘మన శంకరవరప్రసాద్ గారు’ బృందంతో ఫెస్టివల్ మ్యాజిక్‌ను జరుపుకోవడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నాను’’ అని చిరంజీవి ఓ పిక్‌ని షేర్ చేశారు. ఈ పిక్‌లో సాహూ గారపాటి ఫ్యామిలీతో పాటు, సుస్మిత కొణిదెల కూడా పుష్ప గుచ్చంతో అనిల్ రావిపూడికి శుభాకాంక్షలు చెబుతున్నారు.

Also Read- Mass Jathara OTT: లైన్ క్లియర్.. ‘మాస్ జాతర’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

మీసాల పిల్లతో ఊపేస్తున్నారు

‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం కేథరీన్ థ్రెసా మరో హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్ అద్భుతమైన స్పందనను రాబట్టుకుని, సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ క్రాస్ చేసి.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగు సినిమా మ్యూజిక్‌కి సరికొత్త బెంచ్‌మార్క్‌ క్రియేట్ చేసి, సినిమా కోసం వేచి చూసేలా చేసింది. ఇందులో చిరంజీవి తన సిగ్నేచర్‌ చార్మ్‌, ఎక్సెప్రెషన్స్, ఎనర్జిటిక్‌ డ్యాన్స్‌ మూవ్స్‌తో అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్నారు. ఈ పాటకు వస్తున్న అద్భుతమైన స్పందనతో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ భారీగా పెరిగిపోయాయి. సాహూ గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా ‘షైన్‌ స్క్రీన్స్‌, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం