Andhra King Taluka: ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మోస్ట్ ఎవైటెడ్ అండ్ యూనిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ (Andhra King Taluka). మహేష్ బాబు. పి దర్శకత్వంలో.. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే పలు మార్లు వాయిదా పడి.. ఫైనల్‌గా నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. మరో వైపు మేకర్స్ ప్రమోషన్స్‌ను యమా దూకుడుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్, పోస్టర్స్ మంచి స్పందనను రాబట్టుకుని, సినిమాపై హ్యూజ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. రామ్ పోతినేని స్వయంగా రాసిన, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ పాడిన ఫస్ట్ సింగిల్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. ప్రస్తుతం మ్యూజిక్ చార్ట్‌లలో ఆ పాట అగ్రస్థానంలో ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్డేట్‌ని ఇచ్చారు మేకర్స్.
Also Read- Blood Moon 2025: ఈ ఆదివారం ఆకాశంలో అద్భుతం.. ప్రత్యేక పరికరాల అవసరం లేకుండానే వీక్షించవచ్చు
సెకండ్ సింగిల్ అప్డేడ్ ఇదే..
ఆ అప్డేట్ ఏమిటంటే.. చిత్రానికి సంబంధించిన సెకండ్ సింగిల్‌ని విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. వివేక్ అండ్ మెర్విన్ సంగీతం అందించిన ఫన్నీ నంబర్ ‘పప్పీ షేమ్’ పాటను ఆగస్ట్ 8న విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రామ్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు. భారీగా జనం వున్న థియేటర్లలో ఫస్ట్ డే ఫస్ట్ షో జరుపుకుంటున్నట్లుగా ఈ పోస్టర్‌ను ప్రజెంట్ చేయడం ఆసక్తికరంగా వుంది. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాలో రామ్ డై-హార్డ్ సినిమా ఫ్యాన్‌గా అలరించబోతున్న విషయం తెలిసిందే. ఇది ఒక అభిమాని బయోపిక్‌గా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ తెలిపి ఉన్నారు. రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సూపర్ స్టార్ పాత్రలో కనిపించనున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ వంటి వారు ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు.
Also Read- OG Ticket: రూ. 5 లక్షలకు ఓజీ టికెట్ సొంతం చేసుకున్న వారు సంచలన నిర్ణయం
బాహుబలి నిర్మాతలతో..
ప్రస్తుతం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాతో బిజీగా ఉన్న రామ్.. మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కిషోర్ గోపు అనే కొత్త దర్శకుడిని ఆయన పరిచయం చేయబోతున్నారు. ఈ సినిమాను ‘బాహుబలి’ చిత్ర నిర్మాతలు నిర్మించబోతున్నట్లుగా సమాచారం. ఆర్కా మీడియా సంస్థ నిర్మించనున్న ఈ సినిమా డిఫరెంట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని అంటున్నారు. వాస్తవానికి ఈ సినిమా నాగ చైతన్య చేయాల్సి ఉందట. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చైతులు మారి రామ్ పోతినేని చేతుల్లోకి వచ్చిందనేలా టాక్ నడుస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు