OG Ticket: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), సుజీత్ (Sujeeth) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘ఓజీ’ (OG Movie) సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా ప్రారంభం నుంచి అందరికీ హై ఇస్తూనే ఉంది. ప్రమోషనల్ కంటెంట్ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే.. సినిమాపై క్రేజ్ డబుల్, త్రిబుల్ అవుతూనే ఉంది. ప్రస్తుతం అందరి కళ్లు ఈ సినిమాపైనే ఉన్నాయంటే అతిశయోక్తి కానే కాదు. ఇక ఇప్పటికే ఓవర్సీస్‌లో ఈ సినిమా ప్రీ బుకింగ్ సేల్స్‌లో ప్రభంజనం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ప్రీమియర్ ప్రీ-సేల్స్‌లో 1 మిలియన్ డాలర్లను రాబట్టి, ఈ సంచలనాత్మక ఘనతను అత్యంత వేగంగా సాధించిన చిత్రంగా ‘ఓజీ’ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఇందులో భాగంగా ఓజీ టికెట్ రూ. 5 లక్షలకు సొంతం చేసుకున్న ‘టీం పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా’ (Team Pawan Kalyan North America) బృందం.. ఇప్పుడో సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే..
Also Read- Little Hearts Hero: ఎప్పుడో, ఎవరినో, ఏదో అన్నానని బాయ్‌కాట్ అంటున్నారు.. అసలు మీరు మనుషులేనా?
జనసేనకు విరాళంగా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’ చిత్రం సెప్టెంబర్ 25న విడుదలకాబోతోంది. ‘ఓజీ’ సినిమా మొట్టమొదటి నైజాం టికెట్ ‘టీం పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా’ బృందం రూ. 5 లక్షలకు సొంతం చేసుకున్నారు. ‘నా సేన కోసం నా వంతు’ సభ్యులు సందీప్ ధనపాల, వీరాభిమాని అరవింద్ పీసపాటి నైజాం మొదటి టికెట్ వేలం వేయగా.. ‘టీం పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా’కు చెందిన సభ్యులు రూ. 5 లక్షలకు దక్కించుకున్నారు. ఈ వేలంలో వచ్చిన రూ. 5 లక్షలను సందీప్ ధనపాల, అరవింద్ పీసపాటి డిడి రూపంలో శాసన మండలి సభ్యులు, మెగా బ్రదర్ నాగబాబు (Mega Brother Nagababu) చేతుల మీదుగా గురువారం జనసేన పార్టీకి అందజేశారు.
Also Read- Allu Arjun and Anushka: ‘పుష్ప’ యూనివర్స్‌లో ‘ఘాటి’ కూడా భాగమా?.. పుష్పరాజ్‌తో షీలావతి!
చాలా ఆనందంగా ఉంది.
ఈ సందర్భంగా ‘టీం పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా’ బృందాన్ని.. ‘నా సేన కోసం నా వంతు’ సభ్యులు సందీప్ ధనపాల, వీరాభిమాని అరవింద్ పీసపాటిలను నాగబాబు ప్రత్యేకంగా అభినందించారు. వీరంతా వివిధ హోదాల్లో పని చేస్తూనే.. అవకాశం దొరికినప్పుడల్లా పార్టీ బలోపేతం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి, పార్టీకి సహకారం అందిస్తున్న విధానం చాలా మందికి స్పూర్తిదాయకమని నాగబాబు స్పష్టం చేశారు. ఇలాంటి అభిమానులు జనసేన పార్టీకి, తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు ఉన్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. జనసేన అభిమానులు, కార్యకర్తలు, మెగాభిమానులు ‘టీం పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా’ బృందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఓజీ టికెట్ రూ. 5 లక్షలకు సొంతం చేసుకున్న “టీం పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా” బృందం -రూ. 5 లక్షల డిడి జనసేనకు అందజేసిన శ్రీ సందీప్ ధనపాల, శ్రీ అరవింద్ పీసపాటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు హీరోగా సెప్టెంబర్ చివర్లో విడుదల… pic.twitter.com/vfa5eDTR4R
— JanaSena Party (@JanaSenaParty) September 4, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు