Peddi leaked video: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తర్వాత రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పెద్ది’. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. అనేక లీక్ ఫోటోలు, వీడియోలు సినిమాను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. తాజాగా ‘పెద్ది’ సినిమా నుంచి వచ్చిన మరో వీడియో మూవీ టీమ్ ను మరింత కలవరపెడుతోంది. ఇలా షూటింగ్ వీడియోలు, ఫోటోలు ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నా నిర్మాతలు మూవీ టీం వీటి గురించి ఏం చర్యలు తీసుకున్నట్లుగా కనబడటం లేదు. రెండు రోజుల క్రితం కూడా ఇలాగే సినిమా షూట్ జరుగుతున్న పిక్ ఒకటి వైరల్ అయింది. తాజాగా ఈసారి ఏకంగా వీడియోనే వచ్చేసింది. ఎవరిని పడితే వారిని షూటింగ్ లోకి రానివ్వడంతో ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయని రామ్ చరణ్ అభిమానులు మూవీ టీంపై ఫైర్ అవుతున్నారు. అయితే కొందరు మాత్రం విడుదలైన వీడియో చూసి సంబరాలు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా షూటింగ్ జరిగే ప్రాంతం నుంచి ఇలాంటి వీడియోలు విడుదల కావడం మూవీ టీం అలసత్వానికి నిదర్శనంగా నిలుస్తుందని రామ్ చరణ్ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఈ వీడియో తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అయితే కొందరు ఇదంతా నిర్మాతలే చేస్తున్నారని పబ్లిసిటీ కోసం ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. మరి కొందరు వీరికి వత్తాసు పలుకుతూ నిర్మాతలు చేయిస్తున్నారు కాబట్టే దీనిని అరికట్టడం లేదని ఆరోపిస్తున్నారు. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read also-Manchu Lakshmi controversy: మంచు లక్ష్మికి క్షమాపణలు చెప్పిన సీనియర్ జర్నలిస్ట్.. ఎందుకంటే?
వీడియోలో రామ్ చరణ్ లోతైన కొండల్లో సాంగ్ కోసం చిన్న స్టెప్ వేస్తున్నట్లు కనిపిస్తుంది. దీనిని చూసిన అభిమానులు రామ్ చరణ్ ను చూసి తెగ సంబారాలు చేసుకుంటున్నారు. రామ్ చరణ్ అభిమానులకు ‘పెద్ది’ సినిమా మరో సమ్మర్ కానుకగా రానుంది. 2026 మార్చి,27న విడుదల కానున్న ఈ చిత్రం, స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సనా ఈ సినిమాను రాసి, దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూసర్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రం, పాన్-ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా రూపొందుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ గ్రామీణ నేపధ్యంలో పెరిగిన క్రీడాకారుడిగా కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. దివ్యేందు షర్మ (మిర్జాపూర్ ఫేమ్) కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలు రామ్ చరణ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
Read also-Kishkindhapuri OTT: ‘కిష్కిందపురి’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘పెద్ది’ మూవీ ఫస్ట్ సింగిల్ త్వరలో రాబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి రామ్ చరణ్.. పాట కంపోజిషన్ పూర్తియింది. లిరికల్ చేయడానికి వర్క్ జరుగుతుంది, అంటూ చెప్పుకొచ్చారు. ఇది తెలిసిన ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు. మొదటి సింగిల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ‘పెద్ది’ కోసం ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రహ్మాన్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌ని కంపోజ్ చేసినట్లుగా ఇప్పటికే బుచ్చిబాబు సనా తెలిపారు. ఆడియన్స్, ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే సాంగ్స్‌ని ఏఆర్ రహ్మాన్ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నారు. జగపతి బాబు వంటి వారు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైసూర్లో జానీ మాస్టర్ ఒక భారీ సాంగ్‌ను కొరియోగ్రఫీ చేశారు. సుమారు 1000 మందికి పైగా డాన్సర్లతో ఈ సాంగ్ షూట్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ సినిమాకు హైలెట్ గా ఉంటుందని మూవీ టీం చెబుతోంది.
