Kishkindhapuri OTT: హారర్ థీమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కిష్కిందపురి’ ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుందో తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, మకరంద్ దేశ్‌పాండే ప్రధాన పాత్రల్లో నటించిన ‘కిష్కింధపురి’ రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం గా నిలిచింది. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం ఈ హారర్ థ్రిల్లర్ థియేటర్లో సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అందరికీ థియేటర్లో ఇది సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించింది. థియోటర్లలో చూడలేని వారు ఓటీటీ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి ఓటీటీ ప్లాట్ ఫారమ్ ZEE5 గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా అక్టోబర్ 17న సాయంత్రం 6 గంటల నుండి జీ5 లో స్ట్రీమింగ్‌కు కానుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రంలో థియేటర్లలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని ఇక ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్‌ఫాంలోకి అడుగు పెడుతోంది.
Read also-HBD Rajamouli: జక్కన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ.. ఎవరెవరు ఏం అన్నారంటే..
రేడియో స్టేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అందరికీ స్పైన్ చిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చింది. వెన్నులో వణుకు పుట్టించే ఎన్నో థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో వచ్చిన ఈ చిత్రం ఇక ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను అలరించేందుకు సిద్దమైంది. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ .. “నేను పోషించిన అత్యంత కఠినమైన పాత్రలలో ఇది ఒకటి. ఇలాంటి పాత్రలు చేసేటప్పుడు సెట్‌లో మన ముందు ఎలాంటి భయానక పరిస్థితులు ఉండవు. కానీ మేం మాత్రం ఊహించుకుని అలా నటించాల్సి వస్తుంది. నటుడిగా, అది నన్ను నా కంఫర్ట్ జోన్ నుండి బయటకు తీసుకు వచ్చినట్టు అయింది. సెట్‌లో నేను నిరంతరం భయం, అనిశ్చితి వాతావరణంలో జీవించాల్సి వచ్చింది. రేడియో స్టేషన్ వింతైన వాతావరణం నాతో పాటు ఇంకా ఉంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఓటీటీలో కూడా ఆస్వాదిస్తారని నేను భావిస్తున్నాను’ అని అన్నారు.
Read also-Prabhas leaked video: ‘ది రాజాసాబ్’ నుంచి వీడియో వైరల్.. ఇక లాఫింగ్ జాతరే..
అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ ..‘‘కిష్కింధపురి’లో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. లుక్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. రకరకాల ఎమోషన్స్‌ను పోషించే అవకాశం నాకు ఈ చిత్రంతో దక్కింది. ఇందులో నా పాత్ర ‘హారర్ హీరోయిన్’ స్టీరియోటైప్ పాత్ర కాదు. కొన్ని సార్లు భయపడుతుంది, ఇంకొన్ని సార్లు కృంగిపోతుంది.. మరి కొన్ని సార్లు తనని తాను ప్రశ్నించుకుంటుంది.. మళ్లీ వెంటనే రెట్టింపు శక్తితో పైకి లేస్తుంది.. నా పాత్రకి ఆడియెన్స్ కనెక్ట్ అవుతారని నేను ఆశిస్తున్నాను. నాకు, ఆ వెంటాడే ప్రదేశాలలో షూటింగ్ అనేది ఒక వింతైన అనుభవం. మన చుట్టూ ఉండే వాతావరణం కూడా మనల్ని మన పాత్రల్లోకి లోతుగా నెట్టివేస్తున్నట్లు అనిపించింది’ అని అన్నారు.
The scare will see you and find your fears!
Get ready for #KishkindhapuriOnZee5 on #ZEE5Telugu
🎬 World OTT & Television Premiere – Don’t miss it!@BSaiSreenivas @anupamahere @Koushik_psk @sahugarapati7 @chaitanmusic @Shine_Screens pic.twitter.com/wTVtxBNHpf— ZEE5 Telugu (@ZEE5Telugu) October 10, 2025
