Prabhas leaked video: ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన ట్రైలర్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కష్టాలు తప్పడంలేదు. ఈ సినిమా నుంచి అనధికార వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిని చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ నిర్మాతలపై మండిపడుతున్నారు. ఇలా వీడియోలు విడుదల అయితే మూవీ చూడాలని ఇంట్రస్ట్ పోతుందని అభిమానులు అంటున్నారు. ఇప్పటికైనా మూవీ టీం స్పందించి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి పెద్ద సినిమాల నుంచి ఇలాంటి పొరపాట్లు సహజమే అయినా వాటిని నివారించడంలో నిర్మాతలు జోక్యం చేసుకుని ఇలాంటి వైరల్ వీడియోలను అరికట్టాలని అభిమానులు కోరుతున్నారు.
Read also-Telugu vs Kannada cinema: అక్కడ పోస్టర్ చింపేస్తే.. ఇక్కడ కలెక్షన్లు కురిపిస్తారు.. ఎందుకిలా?
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియోలో ప్రభాస్ లుక్ చూసిన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఓ సాంగ్ కోసం ప్రభాస్ ఈ లుక్ లో కనిసిస్తున్నాడని తెలుస్తోంది. అందులో డాన్స్ రిహాసల్స్ కూడా చేయడం కనిపించాయి. అంతే కాకుండా ఇటీవలే ఈ సినిమా సంగీత దర్శకుడు థమన్ పాటకు సంబంధించిన చిన్న హింట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అదే పాటకు సంబంధించి వీడియో ఒకటి హల్ చల్ చేస్తుంది. ఏది ఏమైనా ప్రభాస్ ఈ లుక్ లో కనిపించడంపై అభిమానులే కాకుండా సినిమా ప్రేక్షకులు అదిరిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. కామెడీ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ సినిమా మొదటి సింగిల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read also-Kiran Abbavaram: తెలుగు హీరోలకు తమిళనాడులో థియేటర్లు దొరకవా?.. ఆ హీరో చెప్పింది నిజమేనా?
తెలుగు సినిమా పరిశ్రమలో రచయిత, దర్శకుడు మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ తో పాటుగా.. సంజయ్ దత్త్, నిధి అగర్వాల్, మాలవికా మోహన్ వంటి తారలు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హారర్-కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ జోనర్ లో రాబోతున్న ఈ సనిమాపై అభిమానుల భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి. విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. మరింత ప్రజాదరణ పొందేలా 3డీ వెర్షన్ లో కూడా రాబోతుంది. ఈ సినిమాను 2026 జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా తీసుకురానున్నారు నిర్మాతలు.
Golden days ahead for rebels 🕺🏻🕺🏻🕺🏻pic.twitter.com/7ocqM9Yjfe
— Pandu (@PanduPrabhas__) October 9, 2025
