tollywood-sandlewood( image:x)
ఎంటర్‌టైన్మెంట్

Telugu vs Kannada cinema: అక్కడ పోస్టర్ చింపేస్తే.. ఇక్కడ కలెక్షన్లు కురిపిస్తారు.. ఎందుకిలా?

Telugu vs Kannada cinema: దక్షిణ భారతీయ సినిమా పరిశ్రమలో భాషా పరమైన విభేదాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఇటీవల పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’ (OG) సినిమా పోస్టర్లు కర్ణాటకలో కన్నడ యాక్టివిస్టులు చింపేశారు. మరోవైపు రిషబ్ శెట్టి హీరోగా నటించిన కన్నడ సినిమా ‘కాంతార చాప్టర్ 1’ తెలుగు వెర్షన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచడానికి అనుమతి ఇచ్చింది. ఈ రెండు సంఘటనలు రెండు భాషల మధ్య టెన్షన్‌ను మరింత పెంచాయి. తెలుగు ప్రేక్షకులు దీనిని ‘డబుల్ స్టాండర్డ్’గా చూస్తూ, కాంతార చాప్టర్ 1ను బాయ్‌కాట్ చేయాలని కాల్స్ ప్రయత్నించారు కానీ పవన్ కళ్యాణ్ కలిగించుకుని కళ ఎప్పుడూ కలిపేదే అని విభజించేది కాదు అని కాంతార చాప్టర్ 1ను సమర్థించారు.

Read also-Kiran Abbavaram: తెలుగు హీరోలకు తమిళనాడులో థియేటర్లు దొరకవా?.. ఆ హీరో చెప్పింది నిజమేనా?

‘ఓజీ’ పోస్టర్లు ఎందుకు చించారు?

‘ఓజీ’ సినిమా సెప్టెంబర్ 26న భారీ అంచనాలతో విడుదలైంది. కానీ రిలీజ్ రోజు నుంచే సమస్యలు మొదలయ్యాయి. కన్నడ రక్షణా వేదిక వంటి స్థానిక సంఘాలు ‘ఓజీ’ పోస్టర్లు, బ్యానర్లు తెలుగులో ఉండటాన్ని ఆక్షేపించి, వాటిని చింపివేశారు. కర్ణాటకలో థియేటర్ల వద్ద పోస్టర్లు కన్నడంలోనే ఉండాలని నియమాలు ఉన్నాయి. ఈ చర్యలు తెలుగు అభిమానులకు కోపాన్ని తెప్పించాయి. ఈ సంఘటన తెలుగు ప్రేక్షకుల్లో ‘ప్రతీకార’ భావాన్ని రేకెత్తించింది. ఇంతే కాకుండా కన్నడ ప్రభుత్వ సినిమా టికెట్ రేట్లను రూ.200 మించి ఉండకూడదు అన్న రూల్ కూడా తీసుకొచ్చింది. దీంతో ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలకు ఇది చెంపపెట్టులా మారింది.

Read also-Srinidhi Shetty: రొమాంటిక్ స్టోరీస్ చేయడమంటే ఇష్టం.. ఏదో తేడాగా ఉందేంటి?

‘కాంతార చాప్టర్ 1’కి టికెట్ హైక్..

మరోవైపు, ‘కాంతార చాప్టర్ 1’ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచడానికి అనుమతి ఇచ్చింది. 10 రోజుల పాటు హైక్, మొదటి రోజు రాత్రి 10 గంటల ప్రీమియర్ షోలకు అవకాశం ఇవన్నీ కన్నడ సినిమాకు పెద్ద బూస్ట్. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ నిర్ణయానికి మద్దతు తెలిపారు. “కళ ఐక్యతను ప్రోత్సహించాలి, విభజన చేయకూడదు” అని ఆయన చెప్పారు. తెలుగు ప్రేక్షకులు దీనిని ‘అన్యాయం’గా చూస్తున్నారు. తెలుగు సినిమాలు కర్ణాటకలో అధిక రేట్లు వసూలు చేయకపోతే, కన్నడ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు అనుమతి అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కొందరు “కాంతార చాప్టర్ 1 బాయ్‌కాట్ చేయాలి” అని చూసినా పవన్ కళ్యాణ్ దానికి మద్దతు తెలపలేదు.తెలుగు కన్నడ సిస్టర్ లాంగ్వేజెస్ చాలా వరకూ ఒకే విధంగా ఉంటాయి. ఈ వివాదాలు రెండు ఇండస్ట్రీలను దెబ్బ తీస్తున్నాయి. “సినిమా భాషా సరిహద్దులు మరచి, ఐక్యత చూపాలి” అని సినిమా పెద్దలు సూచిస్తున్నారు. లేకపోతే, ఈ ట్రెండ్ మరింత పెరిగి పరిశ్రమకు దీర్ఘకాలిక హాని చేస్తుంది. రెండు భాషల ప్రేక్షకులు గౌరవాన్ని కాపాడుకుంటూ, సినిమాను ఉత్సవంగా చూడాలని అందరూ ఆశిస్తున్నారు.

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?