Srinidhi-Shetty
ఎంటర్‌టైన్మెంట్

Srinidhi Shetty: రొమాంటిక్ స్టోరీస్ చేయడమంటే ఇష్టం.. ఏదో తేడాగా ఉందేంటి?

Srinidhi Shetty: నాకు రొమాంటిక్ స్టోరీస్ చేయడం ఇష్టమని అంటోంది ‘కెజియఫ్, హిట్ 3’ చిత్రాల బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty). ‘మిరాయ్’ (Mirai Movie) వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘తెలుసు కదా’ (Telusu Kada). స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా, ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ క్రమంలో హీరోయిన్ శ్రీనిధి శెట్టి మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.

Also Read- Niharika NM: నా సీన్ వస్తుంటే నా ఫ్యామిలీ కళ్లు మూసుకోకూడదు.. అలాంటి పాత్రలే చేస్తా!

ట్రై యాంగిల్ లవ్ స్టోరీ అనుకుంటారు.. కానీ,

ఈ సందర్భంగా శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్ టైం లవ్ స్టోరీ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ‘కెజియఫ్, హిట్ 3’ సినిమాలు యాక్షన్‌తో పాటు చాలా బ్లడ్ బాత్ ఉన్న సినిమాలు. కానీ ‘తెలుసు కదా’ అలా కాదు.. ఒక లైట్ హార్టెడ్ మూవీ. చాలా కొత్తగా ట్రై చేశాం. తప్పకుండా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ఇందలో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నప్పుడు అంతా ట్రై యాంగిల్ లవ్ స్టోరీ అనే అనుకుంటారు. కానీ, ఈ సినిమా ఒక యూనిక్ పాయింట్‌తో తీశాం. అదేంటనేది ఇప్పుడే రివీల్ చేయకూడదు. సినిమా చూసినప్పుడు మీరు ఖచ్చితంగా సర్ ప్రైజ్ అవుతారు. వాస్తవానికి, నాకు రొమాంటిక్ స్టొరీస్ చేయడమంటే చాలా ఇష్టం. ఇందులో మంచి లైట్ హార్ట్టెడ్ ఎంటర్టైన్మెంట్ వుంటుంది. ‘హిట్ 3’కి ముందే ఈ స్టోరీ విన్నాను. ఇందులో లవ్, ఎమోషన్, లాఫ్, సాంగ్స్ ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటాయి. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులందరూ మంచి రొమాంటిక్ డ్రామాని ఫీల్ అవుతారు.

Also Read- Ananya Nagalla: ప్రేమలో అనన్య నాగళ్ల.. ఏకంగా లాంగ్‌టెర్మ్ రిలేషన్‌షిప్ అంట, ఎవరితోనంటే?

అతని టైమింగ్ అద్భుతం

ఇది మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ చిత్రం. చాలా కొత్త పాయింట్ ఇందులో ఉంది. మూడు క్యారెక్టర్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. థియేటర్స్ లో చూస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా సిద్దు క్యారెక్టర్‌ని చాలా ఎంజాయ్ చేస్తారు. అతనికి అన్నీ డిపార్ట్‌మెంట్స్‌పై మంచి నాలెడ్జ్ వుంది. ఒక యాక్టర్‌కి అన్ని విభాగాలపై పట్టు వుండటమనేది అదృష్టమని చెప్పాలి. అలాగే అతని టైమింగ్ కూడా అద్భుతం. నీరజ ప్యాషన్‌తో ఈ సినిమా చేశారు. తను చాలా సపోర్టివ్. నా సహ నటి రాశి ఖన్నా చాలా క్రమశిక్షణ గల నటి. డైట్, వర్కవుట్ అన్నీ చాలా పద్దతిగా వుంటాయి. థమన్ మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్. ఆయన మ్యూజిక్‌కు నేను అభిమానిని. బీజీఎం అద్భుతంగా వుంటుంది. పీపుల్ మీడియా ప్రొడక్షన్ హౌస్‌లో పని చేసినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వారిచ్చిన సపోర్ట్, కంఫర్ట్ మర్చిపోలేను’’ అని చెప్పుకొచ్చింది. ఆమె మాటలు విన్న వారంతా.. ఏంటి రొమాన్స్ అని తెగ నొక్కి మరీ చెబుతోంది. చూస్తుంటే, తెలుగింటి కోడలి పిల్ల అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయంటూ కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?