Ram Charan: నెవర్ బిఫోర్ లుక్‌లో.. ‘పెద్ది’ సర్‌ప్రైజ్‌కు సిద్ధమా!
Peddi Movie Team
ఎంటర్‌టైన్‌మెంట్

Ram Charan: నెవర్ బిఫోర్ లుక్‌లో.. ‘పెద్ది’ సర్‌ప్రైజ్‌కు సిద్ధమా!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ (Peddi Movie). ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ షాట్ సినిమాపై అమాంతం అంచనాలు పెంచేశాయి. మరీ ముఖ్యంగా ఫస్ట్ షాట్‌లో రామ్ చరణ్‌ని రా అండ్ రస్టిక్ లుక్‌లో చూసిన వారంతా.. ఈ సినిమాకు ఇక తిరుగులేదని, బుచ్చి మామ మళ్లీ హిట్ కొట్టబోతున్నాడంటూ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారంటే.. ఫస్ట్ షాట్ ఇంపాక్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే, తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ అప్డేట్ వదిలారు. ఈసారి ‘పెద్ది’ నుంచి రాబోయే లుక్‌కు సంబంధించిన అప్డేట్ ఇది. ఇప్పటివరకూ ఎన్నడూ చూడని న్యూ అవతార్‌లో రాబోయే లుక్‌లో రామ్ చరణ్ కనిపించబోతున్నారట. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

Also Read- HHVM OTT: షాకింగ్ సర్‌ప్రైజ్.. ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘వీరమల్లు’.. ఇంకొన్ని గంటల్లోనే!

ఇప్పటికే సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్‌తో దేశవ్యాప్తంగా సంచలనాన్ని క్రియేట్ చేయగా.. రామ్ చరణ్ పెద్దిలో నెవర్ బిఫోర్ లుక్‌తో మెస్మరైజ్ చేయడానికి రెడీ అయ్యారంటూ మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. టాప్ సెలబ్రిటీ స్టైలిస్ట్ ఆలీం హకీం, రామ్ చరణ్ కోసం స్పెషల్ కేర్ తీసుకొని సరికొత్త లుక్‌లో ప్రెజంట్ చేయబోతున్నారని.. రామ్ చరణ్ స్టైల్, శ్వాగ్‌లో కొత్త బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేయనున్నారని ఈ అప్డేట్‌లో మేకర్స్ తెలిపారు. అంతేకాదు.. స్టైలిస్ట్ ఆలీం హకీంని రామ్ చరణ్‌, బుచ్చిబాబు కలిసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు వచ్చినప్పటి నుంచి ఇదే టాక్ వైరల్ అవుతుండగా, అదే విషయాన్ని మేకర్స్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక నెక్ట్స్ రాబోయే రామ్ చరణ్ లుక్ ఎలా ఉంటుందో అని.. ఫ్యాన్స్ అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులకు తగ్గ సర్‌ప్రైజ్ ఉంటుందని, బుచ్చి మామ డిజప్పాయింట్ చేయడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

Also Read- Brahmanandam: నా దృష్టిలో అందమైన హీరో ఎవరో తెలుసా?.. బ్రహ్మానందం సంచలన వ్యాఖ్యలు

రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఆయన బర్త్‌డేను పురస్కరించుకుని ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ మంచి స్పందనను రాబట్టుకుంది. ఇంకా జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత మాస్ట్రో ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులలో ఒకటిగా ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రాన్ని ఆయన పుట్టినరోజున 27 మార్చి, 2026లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నామని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..