Ram Charan: డ్రగ్స్ నివారణ పోరాటంలో అందరం ఐక్యంగా నిలబడి, డ్రగ్స్‌ని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరం ఒక సోల్జర్‌లా మారుదామని పిలుపునిచ్చారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం (Anti Drugs Day 2025) పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఓ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) స్పెషల్ గెస్ట్‌లుగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), రామ్ చరణ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Also Read- Virgin Boys: రామ్ గోపాల్ వర్మ రియల్ వర్జిన్.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు
ఈ కార్యక్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మై బ్రదర్ విజయ్ దేవరకొండ, దిల్ రాజులతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన మిగతా పెద్దలందరికీ థాంక్యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలకు బాగా వెళ్లేవాడిని. ఇక్కడ మీ అందరిని చూస్తుంటే మళ్లీ నాకు ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ పోలీసు శాఖకు ధన్యవాదాలు. ఇలాంటి అవేర్నెస్ ప్రజంట్ కచ్చితంగా కావాలి.
Also Read- OTT Controversy: వెబ్ సిరీస్ కూడా కాపీ.. కాంట్రవర్సీలో ‘కానిస్టేబుల్ కనకం’.. మ్యాటరేంటంటే?
కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని స్కూల్స్ బయట.. గోలి సోడాలు, చాక్లెట్లు దొరికే చోట డ్రగ్స్ అమ్ముతున్నారనే వార్తలు చూసి నేను షాక్ అయ్యాను. ఇది ఇంత పెద్ద ఆర్గనైజడ్ క్రైమ్ లాగా అయిపోయిందా? అని చాలా బాధేసింది. అప్పుడు నేను పేరెంట్‌ని కాదు. కానీ ఇప్పుడు నేను పేరెంట్‌ని. రేపు పొద్దున్న మా పిల్లల్ని బయటికి పంపించాలంటే ఎంత భయంగా ఉంటుందో నాకు అర్థమవుతుంది. డ్రగ్స్ జీవితాన్ని సర్వ నాశనం చేస్తాయి. పొద్దున్నే లేచి వ్యాయామం చేసి, మన వర్క్ పూర్తి చేసి, ఇంటికి వచ్చి ఓ ఆట ఆడుకుని, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడంలోనే రియల్ హై ఉంటుంది. ఒక మంచి సక్సెస్ ఫుల్ సినిమా తీసినప్పుడు ఒక హై ఉంటుంది. మంచి మార్క్స్ తెచ్చుకోవడం ఒక హై. ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం హై. గేమ్స్ ఆడటం ఒక హై. జీవితంలో ఎన్ని హై మూమెంట్స్‌ని పెట్టుకుని.. జీవితాన్ని బలికోరే వాటిని అలవరచుకోవడం కరెక్ట్ కాదు.
మనందరం కూడా డ్రగ్స్ రహిత సమాజం కోసం పోరాటం చేయాలి. మన భవిష్యత్తుని మనమే రక్షించుకుందాం. మేమందరం తెలంగాణ గవర్నమెంట్‌కి సపోర్ట్ చేస్తున్నాం. డ్రగ్స్‌ని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ ఒక సోల్జర్‌లా మారాలని కోరుకుంటున్నాను..’’ అని చెప్పుకొచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, విజయ్ దేవరకొండ, టీఎఫ్‌డిసి చైర్మన్ – నిర్మాత దిల్ రాజు వంటి వారంతా ప్రసంగించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు