Virgin Boys team and RGV Team
ఎంటర్‌టైన్మెంట్

Virgin Boys: రామ్ గోపాల్ వర్మ రియల్ వర్జిన్.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు

Virgin Boys: ఎప్పుడూ మందు, అమ్మాయిలతో ఉండే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) వర్జిన్ అంటూ ‘వర్జిన్ బాయ్స్’ నిర్మాత రాజా దారపునేని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్ గురు బ్యానర్‌పై రాజా దారపునేని నిర్మాతగా దయానంద్ గడ్డం రచనా, దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘వర్జిన్ బాయ్స్’. జూన్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో మిత్రా శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బబ్లు, కౌశల్ మంద, ఆర్జె సూర్య, సుజిత్ కుమార్, కేదార్ శంకర్, ఆర్జె శరన్, శీతల్ తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ‘దం దిగా దం’ అనే పాటను విడుదల చేసేందుకు మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మీడియా అడిగిన ప్రశ్నకు రామ్ గోపాల్ వర్మ పేరుతో నిర్మాత రాజా దారపునేని (Raja Darapuneni) ఆసక్తికరంగా సమాధానమిచ్చారు.

Also Read- Varalaxmi Sarathkumar: పెళ్లైన ఏడాదికే వరలక్ష్మి ఇలా చేసిందేంటి.. భర్త పరిస్థితేంటి?

‘మీకు తెలిసిన మోస్ట్ ఫేమస్ వర్జిన్ బాయ్ ఎవరు?’ అని మీడియా అడిగిన ప్రశ్నకు నిర్మాత రాజా దారపునేని సమాధానమిస్తూ.. ‘నువ్వేమైనా ఉన్నావా ఏంటి?’ అని ఆ ప్రశ్న అడిగిన విలేఖరినే నవ్వుతూ ప్రశ్నించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. ‘‘చెప్తా చెప్తా.. చిన్న ఉదాహరణ చెప్తా. నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు ఒక్క గాళ్ ఫ్రెండ్ కూడా ఉండేది కాదు. ఒక్కొక్కడి చుట్టూ ఐదారు మంది ఉండేవారు. వాడిని చూసి.. వాడొక వేస్ట్ గాడు.. వీడికి ఎలా పడ్డార్రా.. అని అనుకునేవాడిని. ఆ తర్వాత నాకు అర్థమైంది. ఉదాహరణకు రామ్ గోపాల్ వర్మ (RGV)ని చూస్తే.. ఆయన చుట్టూ ఎప్పుడూ అమ్మాయిలు ఉంటారు. అంటే ఆయనని కామెంట్ చేస్తున్నానని కాదు.. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నానంతే. ఆయన ఎప్పుడూ అమ్మాయిలతో ఉంటారు. ఫైనల్‌గా నాకు అర్థమైంది ఏమిటంటే.. వాళ్లే రియల్ వర్జిన్స్ అని అప్పుడర్థమైంది. ఎందుకంటే, మీరు సముద్రం మధ్యలో ఉన్నారనుకోండి. బాగా దాహం వేస్తుంది. చుట్టూ నీళ్లే ఉంటాయి.. కానీ తాగలేరు. సముద్రం మధ్యలో దాహమవుతుంటే చుట్టూ నీళ్లు ఉన్నా.. తాగగలరా? సేమ్ అంతే. నాకు తెలిసి.. చుట్టూ అమ్మాయిలు ఉన్నవాడే రియల్ వర్జిన్. నోట్ దిస్ పాయింట్’’ అని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

">

Also Read- Chiranjeevi: ప్లీజ్.. చిరంజీవి ఇజ్జత్ తీయకండ్రా!

‘వర్జిన్ బాయ్స్’ సినిమా గురించి ప్రస్తావిస్తూ.. ఈ సాంగ్ లాంచ్ వేడుకకి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పటికే ‘వర్జిన్ బాయ్స్’ చిత్రం నుంచి టీజర్, ఒక పాటను వదిలాం. అవన్నీ మంచి స్పందనను రాబట్టుకున్నాయి. సినిమా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుంది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు.. ఎన్నో ప్రశంసలతో కొనియాడారు. ఆడవాళ్లు కూడా ఈ చిత్రాన్ని ప్రశంసించడం ప్రత్యేకంగా అనిపించింది. చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది. చిత్రానికి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్ వచ్చింది. చిత్రాన్ని నైజాంలో ఏషియన్ సునీల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. జులై 11వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు గ్రాండ్‌గా తీసుకురాబోతున్నామని తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు