Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ ఒక్కసారిగా ఇలా షాక్ ఇచ్చిందేంటి? ఇప్పుడామె భర్త పరిస్థితేంటి? అని కోలీవుడ్ అంతా మాట్లాడుకుంటోంది. ఇంతకీ వరలక్ష్మి శరత్ కుమార్ ఏం చేసింది? ఎందుకిలా ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు? అని అనుకుంటున్నారు కదా! కోలీవుడ్ నటుడు విశాల్‌తో ప్రేమాయణం నుంచి వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) ఎప్పుడూ వార్తలలో నిలుస్తూనే ఉంది. హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టిన వరలక్ష్మి శరత్ కుమార్, నటిగా మంచి మార్కులే వేయించుకుంది. కాకపోతే ఆమెకు హీరోయిన్ అవకాశాలు అంతగా రాలేదు. కొన్నాళ్ల పాటు ఖాళీగానే ఉంది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా తనలోని విలక్షణ నటిని పరిచయం చేయడంతో.. ఒక్కసారిగా బిజీ నటిగా మారిపోయింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఆమె కోసమే పాత్రలు రాస్తున్నారంటే.. ఏ రేంజ్‌లో వరలక్ష్మి శరత్ కుమార్ తన సత్తా చాటుతుందో అర్థం చేసుకోవచ్చు.
Also Read- Kannappa Movie: పవన్ కళ్యాణ్ నిర్ణయంతో ‘కన్నప్ప’కు ఎంత లాభమో! ఇప్పటికైనా తెలిసిందా?
విశాల్ (Vishal)తో బ్రేకప్ తర్వాత మళ్లీ ప్రేమ వ్యవహారాల్లో ఆమె పేరు వినిపించలేదు. తనకు వచ్చిన అవకాశాల్లో మంచి వాటిని సెలక్ట్ చేసుకుంటూ, నటిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్, సడెన్‌గా 2024లో ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ ప్రేమ వ్యవహారం ఎక్కడా బయటికి కూడా రానివ్వలేదు. ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్‌తో కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న వరలక్ష్మి, ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. వారిద్దరి వివాహం 2024లో గ్రాండ్‌గా జరిగింది. అయితే పెళ్లై ఏడాది కూడా కాకుండానే.. భర్తకు దూరమవుతుంది వరలక్ష్మి శరత్ కుమార్. అదేంటి వారిద్దరి మధ్య ఏమైనా మనస్పర్థలు వచ్చాయా? ఈ మధ్య సెలబ్రిటీలు విడిపోతున్నట్లుగానే వారు కూడా విడిపోతున్నారా? అని అనుకుంటారేమో.. అలాంటిదేమీ లేదు. అసలు విషయంలోకి వస్తే..
ప్రస్తుతం దక్షిణాది చిత్రాలలో బిజీ బిజీగా ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్.. ఇప్పుడు తన పరిధిని విస్తరించబోతుంది. అంటే బాలీవుడ్‌కు వెళ్లిపోతుందా? బాలీవుడ్‌కు వెళితే భర్తకు దూరం ఎందుకవ్వాలి? అందులోనూ భర్తది ముంబై నగరమేగా.. అని థింక్ చేస్తున్నారు కదా. మాములుగా అయితే దక్షిణాది సెలబ్రిటీలకు తమ నెక్ట్స్ స్టెప్ బాలీవుడ్ పైనే ఉంటుంది. కానీ, వరలక్ష్మి అందుకు భిన్నంగా స్టెప్ వేస్తుంది. ఆమె ఏకంగా హాలీవుడ్ వెళ్లిపోతుంది. అవును ప్రముఖ హాలీవుడ్ నటుడు జెరెమీ ఐరన్స్ సరసన ఓ చిత్రంలో ఆమె నటించబోతుంది. మరి హాలీవుడ్ చిత్రమంటే కొన్నాళ్లపాటు అక్కడే ఉండాలి కదా. ఈ గ్యాప్‌లో ఆమె భర్తని వదిలి ఉండాలి కదా.. అందుకే, పెళ్లైనా ఏడాదికే భర్తకు కొన్నాళ్లకు పాటు దూరంగా ఉండే నిర్ణయం తీసుకుందేంటి? అని కోలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు హైలైట్ అవుతున్నాయి.
Also Read- SSMB29: మహేశ్ సినిమా కోసం కష్టపడుతున్న ప్రియాంక చోప్రా.. రాజమౌళి ప్లాన్ ఏంటో!
వెటరన్ దర్శకుడు చంద్రన్ రత్నం (Chandran Rutnam) దర్శకత్వంలో ‘రిజానా – ఎ కేజ్డ్ బర్డ్’ అనే సినిమాలో ఆమె నటిస్తోంది. ఈ సినిమాలో నటించడంపై ఆమె మాట్లాడుతూ.. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) వంటి గొప్ప నటుడితో కలిసి నటించడంతో నా డ్రీమ్ నెరవేరినట్టు అనిపిస్తోంది. ‘లయన్ కింగ్’ సినిమాలో స్కార్ పాత్రకు ఆయనే వాయిస్ ఇచ్చారు. ఆ సినిమా నాకు ఎంతో ఇష్టం. అన్ని డైలాగులు చెప్పేస్తాను. ఇప్పుడా సినిమాకు వాయిస్ ఇచ్చిన నటుడితో కలిసి నేను నటించడం అనేది ఒక గొప్ప అవకాశం. ఇది నా కెరీర్‌లో మరిచిపోలేని ఒక మైలురాయిగా నిలిచిపోతుందని తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు