SSMB29
ఎంటర్‌టైన్మెంట్

SSMB29: మహేశ్ సినిమా కోసం కష్టపడుతున్న ప్రియాంక చోప్రా.. రాజమౌళి ప్లాన్ ఏంటో!

SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ29(వర్కింగ్ టైటిల్) మూవీ తెరకెక్కుతున్నది. స్క్రిప్ట్, ఇంకా ఇతర పనుల వల్ల చాలాకాలం షూటింగ్ ఆలస్యమైన ఈ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటిస్తున్నది. మహేశ్, ప్రియాంక తొలిసారి కలిసి నటిస్తుండడం, ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్థాయిలో పేరు పొందిన రాజమౌళి మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టే దర్శక ధీరుడు ఈ మూవీని ఓ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నాడు. బాహుబలి టైమ్‌లో హీరో హీరోయిన్లకు కత్తిసాము నేర్పించినట్టు మహేశ్, ప్రియాంక చేత కూడా కొత్త కొత్త విన్యాసాలు చేయిస్తున్నట్టు సమాచారం.

తెగ కష్టపడుతున్న ప్రియాంక చోప్రా

మహేశ్ సినిమా కోసం ప్రియాంక చోప్రా చేత మయూర్భంజ్ చౌ డ్యాన్స్ శిక్షణ ఇప్పించారు. ఈ విషయాన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్ విక్కీ భారతీయ వెల్లడించాడు. ప్రియాంకతో కలిసి దిగిన ఫోటోనో పోస్ట్ చేసి డ్యాన్స్ శిక్షణకు సంబంధించి ఆమెతో పని చేసిన అనుభవాన్ని పంచుకున్నాడు. రిహార్సల్స్ సమయంలో ప్రియాంక తన అసమాన శక్తిని ఎలా తీసుకున్నదో, షూటింగ్ సమయంలో ఎలా ప్రదర్శించిందో విక్కీ హైలైట్ చేశాడు. ‘‘ప్రియాంక చోప్రాతో కలిసి పని చేయడం నిజంగా ఓ ప్రత్యేక అనుభవం. ఆమె చాలా తెలివైనది. ఎంతో ఫన్నీ, అలాగే బలమైన మహిళ. తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితో చాలా ఆప్యాయంగా ఉంటుంది. డ్యాన్స్ రిహార్సల్స్, షూటింగ్ సమయంలో ఆమె చూపిన చొరవ స్ఫూర్తిదాయకం’’ అని కొరియోగ్రాఫర్ విక్రీ భారతీయ పోస్ట్ చేశాడు. ఇతను మయూర్భంజ్ చౌ నృత్యంలో ఆరితేరాడు.

Read Also- Man Vs Leopard: ఆర్ఆర్ఆర్ సీన్ రిపీట్.. తారక్ తరహాలో చిరుతతో సామాన్యుడి ఫైట్.. వీడియో వైరల్!

మయూర్భంజ్ చౌ అంటే ఏంటి?

మయూర్భంజ్ చౌ ను చౌ నృత్యం అని కూడా పిలుస్తారు. ఇది మార్షల్, జానపద సంప్రదాయాలతో కూడుకున్న భారతీయ నృత్యం. మూడు రాష్ట్రాల్లో ఇది ప్రముఖంగా ఉన్నది. ఒడిశాలో మయూర్భంజ్ చౌ అని, జార్ఖండ్‌లో సెరైకెల్లా చౌ అని, పశ్చిమ బెంగాల్‌లో పురూలియా చౌ అని పిలుస్తుంటారు. ఈ డ్యాన్స్‌లో యుద్ధ కళలు, విన్యాసాలు, జానపద నృత్యం ఉంటాయి. శక్తి, శివుడు, విష్ణువుకు సంబంధించిన ఇతివృత్యాలతో కూడుకున్న నృత్యం ఇందులో ఉంటుంది. 2010లో ఈ చౌ నృత్యాన్ని యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చారు. ఒడిశాలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన డ్యాన్స్ ఇది.

ఎస్ఎస్ఎంబీ29 నెక్స్ట్ షెడ్యూల్ కెన్యాలో..

మరోవైపు, రాజమౌళి దర్శకత్వంలో మహేశ్, ప్రియాంక చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది. తాజా సమాచారం ప్రకారం కీలకమైన షెడ్యూల్ కోసం చిత్రబృందం కెన్యా వెళ్తున్నది. అక్కడ మహేశ్, ప్రియాంక చోప్రాకు చెందిన సీన్స్ షూటింగ్ చేయనున్నారు. సినిమాలో ఈ సీన్స్ కీలక మలుపు తిప్పేవని టాక్. కథకు ఎంతో కీలకమైన ఈ సీన్స్ షూటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తున్నది.

Read Also- Gold Rate ( 25-06-2025): గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్?

Just In

01

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు