Ram Charan: చిరు, పవన్ ఇచ్చేశారు.. చరణ్ పిక్చర్ అభి బాకీ హై!
Mega Heroes (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Ram Charan: చిరు, పవన్ ఫామ్‌లోకి వచ్చేశారు.. చరణ్ పిక్చర్ అభి బాకీ హై!

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ వరకు మెగా హీరోలు నటించిన సినిమాలు వరసగా పరాజయాలను చవి చూశారు. మరీ ముఖ్యంగా ‘గేమ్ ఛేంజర్’ గ్లోబల్ హిట్‌తో చరణ్ తన రేంజ్‌ని ఇంకాస్త పెంచుకుంటాడని అంతా ఊహించారు. కానీ ఆ సినిమా భారీ ఫ్లాప్‌ని చవిచూసింది. ఇక ఆ తర్వాత వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు’ సినిమా అయినా రికార్డులను కొల్లగొట్టి, సంచలన విజయాన్ని నమోదు చేస్తుందని అభిమానులు భావించారు. కానీ ఆ సినిమా కూడా అనుకున్నంతగా థియేటర్లలో సక్సెస్ కాలేదు. దీంతో మెగా హీరోల స్టామినాపై ట్రోలింగ్ మొదలైంది. ఇక అప్పుడే మరోసారి పవన్ కళ్యాణ్ మెగా సత్తా ఏంటో చూపించారు. సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’గా వచ్చి రికార్డుల సునామీ సృష్టించారు. 2025 సంవత్సరానికే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా ‘ఓజీ’ (OG Movie) నిలవడంతో పాటు, అప్పటి వరకు మెగా పరాజయాలకు చరమగీతం పాడేసింది.

Also Read- BB JODI Season 2: డిమోన్, రీతూ ఎంట్రీ.. బాబోయ్ అది కెమిస్ట్రీ కాదు.. !

వెంటవెంటనే మెగా జోష్..

దీంతో మెగా హీరోలకు మంచి రోజులు వచ్చాయని అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. నిజమే, మెగా హీరోలకు మంచి రోజులు వచ్చేశాయి. తాజాగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా కూడా ప్రీమియర్స్‌తోనే పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని, వీక్ టైమ్‌లో కూడా రికార్డ్ కలెక్షన్స్‌ను రాబడుతోంది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని, సక్సెస్‌ ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. ఇలా పవర్ స్టార్ వెంటనే మెగాస్టార్ కూడా హిస్టరీ క్రియేట్ చేయడంతో.. ఇప్పుడందరి కళ్లు మెగా పవర్ స్టార్‌పైనే ఉన్నాయి. ఎందుకంటే, రామ్ చరణ్‌కు కూడా ఇప్పుడో మంచి సాలిడ్ హిట్ కావాలి. పవర్ స్టార్, మెగాస్టార్ నార్మల్‌గా అయినా ఆడేస్తారు. కానీ, రామ్ చరణ్ గ్లోబల్ బ్యాట్స్‌మెన్. ఒక్కసారి పాజిటివ్ టాక్ వస్తే.. టాలీవుడ్ సత్తా ఏంటో చూపించగల నటుడు. అలాంటి హీరోకి హిట్ పడితే ఎలా ఉంటుందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Also Read- Director Maruthi: ‘ది రాజా సాబ్’ అర్థం కావడానికి టైమ్ పడుతుందని నాకు ముందే తెలుసు!

పిక్చర్ అభి బాకీ హై చరణ్

శంకర్ వంటి దర్శకుడితో చేసిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రమే చరిత్రను తిరగరాయాల్సింది. కానీ, అది వర్కవుట్ అవలేదు. ఇప్పుడందరి కళ్లు రామ్ చరణ్ ‘పెద్ది’ (Ram Charan Peddi) సినిమాపైనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్, వినిపిస్తున్న టాక్.. ఈసారి చరణ్ తాండవం ఎలా ఉంటుందో చూస్తారనేలా చేస్తున్నాయి. ఇదే ఊపుతో రామ్ చరణ్ కూడా ఓ మాంచి హిట్ కొడితే మాత్రం మెగాభిమానులను పట్టుకోవడం ఎవరితరం కాదు. ‘చికిరి చికిరి’ సాంగ్‌తోనే రికార్డులు బద్దలు కొడుతున్న చరణ్.. ‘పెద్ది’తో ఈసారి ఎవరూ ఊహించని విజయాన్ని అందుకుంటాడని మెగా ఫ్యాన్స్ ఎంతగానో నమ్ముతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే అది నిజమే అనేలా కూడా అనిపిస్తోంది. అందుకే.. ‘పిక్చర్ అభి బాకీ హై చరణ్’ అంటూ ఫ్యాన్స్ ఈ రెండు వరుస విజయాల తర్వాత కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. చూద్దాం మరి.. ఈ మెగా జోష్‌‌కు చరణ్ హ్యాట్రిక్ ట్రీట్ ఇస్తాడేమో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Nari Nari Naduma Murari: పండుగ ఆఫర్.. ఎంఆర్‌పీ ధరలకే మా సినిమా టికెట్లు!

Director Maruthi: మెగాస్టార్‌తో ఛాన్స్ వస్తే.. నా లైఫ్ సర్కిల్ ఫిల్ అయినట్లే!

Ram Charan: చిరు, పవన్ ఫామ్‌లోకి వచ్చేశారు.. చరణ్ పిక్చర్ అభి బాకీ హై!

Damodar Raja Narasimha: ఉగాది నాటికి టిమ్స్ హాస్పిటల్‌ను ప్రారంభిస్తాం.. మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం!

Bandi Sanjay: కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయాభివ్రుద్ధికి కృషి చేస్తా.. బండి సంజయ్ కుమార్ హామీ!