Rajendra Prasad: తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్ (Nata Kireeti Rajendra Prasad)ను పద్మశ్రీ (Padma Shri) వరించిన విషయం తెలిసిందే. ఈ పురస్కారంపై రాజేంద్ర ప్రసాద్ సంతోషం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘ఈ గౌరవం కేవలం నాకు మాత్రమే దక్కింది అని నేను అనుకోవడం లేదు. ఇది తెలుగు హాస్యానికి, వినోదాన్ని కోరుకునే సామాన్య ప్రేక్షకుడికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. అసలు నేను ఈ స్థాయిలో నిలబడటానికి, ఈ అవార్డు అందుకోవడానికి ముఖ్య కారణం మీరే. 48 ఏళ్లుగా నేను ఏ వేషం వేసినా, ఏ ప్రయోగం చేసినా మీరందించిన ప్రేమే నాకు ఈరోజు ఇంతటి గుర్తింపు తెచ్చింది. నాలాంటి ఒక నటుడిని, మీ ఇంటి మనిషిలా ఆదరించి, ‘నటకిరీటి’ని చేసి, ఈ స్థాయికి తీసుకువచ్చింది మీ చప్పట్లే. ఆ ఋణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను’’ అంటూ రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ఎమోషనల్ అయ్యారు. ఆయన విడుదల చేసిన వీడియోలో..
Also Read- Murali Mohan: లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది.. పద్మశ్రీపై మురళీ మోహన్ స్పందనిదే!
ఈ అవార్డు నాది కాదు.. మీది
‘‘నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్లందరికీ నమస్కారం. ఈ రోజు నా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు. భారత ప్రభుత్వం నాకు ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రకటించిందని తెలిసినప్పటి నుంచి నా కళ్లు ఆనందంతో నిండిపోయాయి. ఒక నటుడిని గుర్తించి, ఇంత గొప్పటి గౌరవాన్ని అందించిన భారత ప్రభుత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే నా పేరును ఈ పురస్కారానికి సిఫార్స్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, పెద్దలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నిజం చెప్పాలంటే ఈ అవార్డు నాది కాదు.. మీది. దాదాపు 48 ఏళ్లుగా నన్ను ఒక నటుడిగా మాత్రమే కాకుండా, మీ ఇంట్లో ఒక మనిషిగా, మీలో ఒకడిగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. నేను నవ్వించినా, ఏడిపించినా.. ‘మా రాజేంద్ర ప్రసాద్’ అని మీరు చూపించిన ఆప్యాయత.. నాకు దక్కిన నిజమైన అదృష్టం. ఆ ప్రేమే ఈ రోజు ఇక్కడ వరకు నడిపించింది. ఈ అవార్డును నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.
Also Read- Megastar Chiranjeevi: ఆ మహిళ వీడియో చూసి నా కళ్ళు చెమర్చాయి
మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను సొంత బిడ్డలాగా ఆదరించారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నాతో పాటు ఈ ఏడాది పద్మ పురస్కారాలు అందుకుంటున్న దేశంలోని మహానుభావులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు ఎప్పుడూ నాపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. బతికున్నంతవరకు సర్వదా.. మీ రాజేంద్ర ప్రసాద్’’ అని రాజేంద్రుడు ఈ వీడియోలో తన సంతోషాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అవార్డుకు మీరు అర్హులు, చాలా ఆలస్యమైంది, ఇప్పటికే మీకు వచ్చి ఉండాల్సింది అంటూ రాజేంద్ర ప్రసాద్ అభిమానులు, నెటిజన్లు ఈ వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా సరైన గౌరవం దక్కినందుకు సంతోషంగా ఉందంటూ ఫ్యాన్స్ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.
పద్మశ్రీ పురస్కారం రావడం పూర్వజన్మ సుకృతం
ఈ గౌరవం కేవలం నాకు మాత్రమే కాదు తెలుగు హాస్యానికి, తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు దక్కిన గుర్తింపు
– రాజేంద్ర ప్రసాద్#RajendraPrasad #MuraliMohan #PadmaShri #PadmaAwards2026 #Padmashri2026 #PadmaShriAward #BIGTVCinema pic.twitter.com/z3erC0Biqb
— BIG TV Cinema (@BigtvCinema) January 26, 2026
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

