Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)ల ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ చిత్ర ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu). విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అలరించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. నయనతార హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలైన మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకొని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో హౌస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ (రీజనల్ ఫిల్మ్స్) సెలబ్రేషన్‌ని ఆదివారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.
తెలుగు సినిమా ఫ్యూచర్
ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. నా మిత్రుడు, సోదరుడు, ఫ్యామిలీ ఫ్రెండ్ వెంకీ ఈ సినిమాలో ఉండాలని కోరుకున్నది నేనే. నేను కోరుకున్నట్టుగా ఈ సినిమాల్లో ఉండేలా చేశాడు డైరెక్టర్ అనిల్. వెంకీ సెట్‌లో వున్న ప్రతిరోజు సెట్టంతా నవ్వులతో నిండిపోయేది. టీనేజ్ బాయ్స్ లాగా ఫీల్ అయిపోయాం. నా పాటలకి తన డాన్స్ చేయడం, తన సాంగ్స్ నేను రిపీట్ చేయడం చక్కగా బ్యాలెన్స్ చేశాడు అనిల్. ఇద్దరు సూపర్ స్టార్స్‌ని అద్భుతంగా బ్యాలెన్స్ చేసిన క్రిడెట్ అనిల్‌ది, తను ప్లాన్ చేసిన విధానం అద్భుతం. అనిల్ తెలుగు సినిమా ఫ్యూచర్. ఈ సినిమా చేస్తున్నప్పుడు చేసిన ఎంజాయ్‌మెంట్ మళ్లీ ఎక్స్‌పీరియెన్స్ చేయాలని ఉంది. వెంకీ నేను కలిసి చేసే ఫుల్ లెంత్ సినిమా చేస్తే వస్తే బాగుంటుందని ఆలోచన ఉంది. మా ఇద్దరినీ అద్భుతంగా బ్యాలెన్స్ చేయగలననే భరోసా అందరికీ ఇచ్చాడు అనిల్.
Also Read- Chiranjeevi: వింటేజ్ చిరంజీవే కాదు వింటేజ్ ఫంక్షన్ సెలబ్రేషన్.. ఈ సంక్రాంతి అదిరిపోయింది
నయా పైసా ఇవ్వలేదు
నిర్మాత సాహూ ఈ సినిమా రష్ చూసే అదిరిపోయింది అన్నాడు. నిజంగా తన ఎక్కువ మాట్లాడరు. ఆ రోజే ఈ సినిమా విజయం గురించి హింట్ ఇచ్చిన వ్యక్తి సాహూ. సుస్మిత ఇండస్ట్రీలోకి వస్తామని అనుకున్నప్పుడు తన ఫస్ట్ రామ్ చరణ్‌తో చెప్పింది. తను వెల్కం చేశాడు. రంగస్థలంలో తన కాస్ట్యుమ్స్‌ను చూసుకుంది. ఆ సినిమాకి ఒక లుంగీ కావాలంటే రాజమండ్రి వీధుల్లో తనే స్వయంగా తిరిగింది. అప్పుడే కచ్చితంగా ఇండస్ట్రీలో సాధించగలదనే నమ్మకం కుదిరింది. ఈ ఇండస్ట్రీ అద్దం లాంటిది మనం ఎలా ఉంటే దాని రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. తను నిర్మాత అవ్వాలనుకున్నప్పుడు వెబ్ సిరీస్‌లతో మొదలు పెట్టింది. అక్కడ అనుభవాన్ని సంపాదించింది. ప్రతి డిపార్ట్‌మెంట్ గురించి తెలుసుకుంది. తర్వాత చిన్న చిన్న హీరోలతో సినిమాలు చేసింది. నిజానికి తను అనుకుంటే మా ఫ్యామిలీలో ఎవరో ఒక హీరోతో సినిమా చేయవచ్చు. కానీ తను అలా అనుకోలేదు. ఈ సినిమా కోసం సాహూతో కలిసి తనే సొంతంగా ప్రొడ్యూస్ చేసింది. ఈ సినిమా కోసం నేను నయా పైసా ఇవ్వలేదు. నాకు రావాల్సిన రెమ్యునరేషన్ సమయానికి తగ్గట్టుగా ఆ ఇద్దరి నుంచి తీసుకున్నాను. అంత ప్రొఫెషనల్‌గా తన ప్రవర్తించింది. తను ఈరోజు ఈ విజయాన్ని ఆస్వాదిస్తుంది. ఒక ఫాదర్‌గా సుస్మితను చూసి నేను గర్వపడుతున్నాను.
Also Read- Allu Arjun: ఐకాన్ స్టార్ ఆర్డర్‌లో సందీప్ వంగా కూడా.. క్లారిటీ ఇదే!
కృతజ్ఞతతో కళ్ళు చెమర్చాయి
కొరియోగ్రాఫర్ భాను, విజయ్, ఆట సందీప్ అందరికీ కూడా గొప్ప భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి అద్భుతమైన లిరిక్స్ అందించిన రైటర్స్, గొప్ప మ్యూజిక్ ఇచ్చిన భీమ్స్‌కి అభినందనలు. అందరూ కూడా ‘మీసాల పిల్ల’ పాటకి బాగా కనెక్ట్ అయిపోయారు. అలాగే వెంకటేష్, నేను కలిసి చేసిన సంక్రాంతి సాంగ్ అదిరిపోయింది. ఈ సినిమా 85 రోజుల్లో పూర్తి కావడానికి ప్రధాన పాత్ర వహించింది డీఓపి సమీర్ రెడ్డి. ఈ సినిమా రిలీజ్‌కి ముందే సూపర్ హిట్ అయిపోయింది అని చెప్పాను. ఎందుకంటే అనుకున్న టైమ్‌కి అనుకున్న బడ్జెట్లో సినిమాని చేయగలిగాం. ప్రకాష్ అద్భుతమైన సెట్స్ వేశారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క నటీనటులకు పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నాను. డైరెక్టర్ అనిల్ ప్రమోషన్స్‌లో దిట్ట. నయనతారని ఒప్పించి ప్రమోషన్స్ చేయించాడు. ఈ క్యారెక్టర్‌లో తను ఒదిగిపోయింది. తను ఈ సినిమాకి ఎంతగానో నిండుదనం తీసుకొచ్చింది. అనిల్ రావిపూడి రైటింగ్ టీమ్ అందరికీ అభినందనలు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఒక వీడియో చూశాను. మమ్మల్ని ఆనందింపజేయడం కోసం మీరు ఇంకా కష్టపడుతున్నారా అని ఓ మహిళ చెబుతుంటే.. చాలా ఎమోషనల్‌గా అనిపించింది. కృతజ్ఞతతో నాకు కళ్ళు చెమర్చాయి. మిమ్మల్ని ఆనందంపజేసే అవకాశం నాకు ఆ భగవంతుడు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని సంతోషపరిచేందుకు కష్టపడడంలో నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను. నేను పని చేయడానికి శక్తి మీ నుంచి వస్తుంది. ఈ జన్మ ఉన్నంత వరకు మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాను. ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

