Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) రేంజ్ ఇప్పుడు కేవలం టాలీవుడ్‌కో, సౌత్ ఇండియాకో పరిమితం కాలేదు. ‘పుష్ప’ సిరీస్ చిత్రాలతో గ్లోబల్ వైడ్‌గా క్రేజ్ సంపాదించుకున్న బన్నీ, తన తదుపరి సినిమాల విషయంలో సెన్సేషనల్ డైరెక్టర్లను లైన్లో పెడుతున్నారు. ఇప్పటికే అగ్ర దర్శకులతో సినిమాలు అనౌన్స్ చేసిన బన్నీ, ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వయలెంట్ అండ్ రా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేతులు కలపబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్.. అల్లు అర్జున్, సందీప్ రెడ్డి వంగా (Sandeep Raddy Vanga) కాంబినేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. సందీప్ ప్రస్తుతం ప్రభాస్‌తో ‘స్పిరిట్’, రణబీర్ కపూర్‌తో ‘యానిమల్ పార్క్’ చిత్రాల పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ రెండు భారీ ప్రాజెక్టులు పూర్తయిన వెంటనే అల్లు అర్జున్, సందీప్ వంగా కాంబోలో సినిమా పట్టాలెక్కుతుందని భూషణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో అల్లు అర్జున్ అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు.
Also Read- Chiranjeevi: వింటేజ్ చిరంజీవే కాదు వింటేజ్ ఫంక్షన్ సెలబ్రేషన్.. ఈ సంక్రాంతి అదిరిపోయింది
మైండ్ బ్లాక్ అయ్యే లైనప్
అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న, చేయబోయే సినిమాల జాబితా చూస్తుంటే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయాల్సిందే అనిపిస్తోంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న మాస్ డైరెక్టర్ అట్లీ (Atlee)తో బన్నీ ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయబోతున్నారు. ఆ వెంటనే ‘ఖైదీ, విక్రమ్’ సినిమాలతో సంచలనం సృష్టించిన లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj)తో బన్నీ సినిమా ఉంటుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో’ వంటి హ్యాట్రిక్ హిట్ల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబోలో మరో మ్యాజిక్ రిపీట్ అయ్యే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగాతో ఓ పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం అల్లు అర్జున్ చేయనున్నారని తెలుస్తోంది.
Also Read- Mohan Babu: మోహన్ బాబుకు గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు
బాక్సాఫీస్ దాసోహం అవ్వాల్సిందే!
ఒకవైపు మాస్ అండ్ స్టైలిష్ ఎలిమెంట్స్‌తో అట్లీ, లోకేశ్ కనగరాజ్.. మరోవైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, ఇప్పుడు అందరికంటే భిన్నంగా ఆలోచించే సందీప్ రెడ్డి వంగా. ఈ నలుగురు దర్శకులు అల్లు అర్జున్‌లోని భిన్నమైన నటుడిని బయటకు తీస్తారనే విషయంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ముఖ్యంగా సందీప్ వంగా మార్క్ రా అండ్ రస్టిక్ క్యారెక్టరైజేషన్‌లో బన్నీని చూడటం అంటే అభిమానులకు పూనకాలే. ఈ ప్రాజెక్టులన్నీ పట్టాలెక్కితే భారతీయ సినిమా చరిత్రలో అల్లు అర్జున్ ఒక అన్-స్టాపబుల్ ఫోర్స్‌గా మారడం ఖాయమని అల్లు ఆర్మీ నమ్ముతోంది. ప్రస్తుతానికి ఈ సినిమాలన్నీ చర్చల దశలో, కొన్ని ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఏది ఏమైనా, ఐకాన్ స్టార్ తన ‘ఆర్డర్’ను చాలా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారనేది మాత్రం అర్థమవుతోంది. మరి ఈ క్రేజీ డైరెక్టర్లతో బన్నీ సృష్టించే వండర్స్ ఎలా ఉంటాయో చూడాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే!
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

