Murali Mohan: గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) పురస్కరించుకుని ఒకరోజు ముందుగా.. కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను (Padma Awards 2026) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పద్మ పురస్కారాలలో ఈసారి బాలీవుడ్ దివంగత నటుడు ధర్మేంద్రను పద్మ విభూషణ్ వరించింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి పద్మ భూషణ్ వరించగా, టాలీవుడ్‌కు చెందిన సీనియర్ నటులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌లకు పద్మశ్రీ (Padma Shri) పురస్కారం వరించింది. ఇంకా మాధవన్‌కు కూడా పద్మశ్రీ పురస్కారం దక్కింది. దీంతో ఆయా నటులు, వారి ఫ్యామిలీలు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ అవార్డుకు ఎంపిక చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మురళీ మోహన్ (Murali Mohan) తనకు పద్మశ్రీ రావడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ..
Also Read- Padma Awards 2026: మమ్ముట్టికి పద్మ భూషణ్.. మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌లకు పద్మశ్రీ
లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది
‘‘అందరికీ నమస్కారం. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన పద్మ అవార్డు.. నిన్న సాయంత్రం ప్రకటించినప్పటి నుంచి అనేక మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, మీడియా వారు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. వాళ్లందరితో నా సంతోషాన్ని పంచుకునే అవకాశం నాకు వచ్చింది. ‘మీకు ఎప్పుడో రావాల్సింది.. ఇప్పుడైనా వచ్చింది’ అని అంటుంటే.. ఏది ఆలస్యం కాదు… లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది అని చెప్పాను. అన్నీ మనం అనుకున్నప్పుడే రావు. ఒక చెట్టుకి పండు కావాలని అనుకున్నప్పుడు దొరకకుండా.. ఎన్నో ఎదురు చూపుల తర్వాత దక్కితే చాలా ఆనందంగా ఉంటుంది కదా. ఏదైనా ఎదురు చూపుల తర్వాత దొరికితే దానికి విలువ ఎక్కువ. ఈ అవార్డును కూడా నేను అలాగే ఫీలవుతున్నాను.
Also Read- Chiranjeevi: వింటేజ్ చిరంజీవే కాదు వింటేజ్ ఫంక్షన్ సెలబ్రేషన్.. ఈ సంక్రాంతి అదిరిపోయింది
ఇంత మంచి అవార్డు ఇచ్చినందుకు థ్యాంక్యూ
చాలా చాలా సంతోషంగా ఉంది. మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరో సందర్భంలో దీని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడతాను. ఇంత మంచి అవార్డును ఇచ్చిన ప్రధాని నరేంద్రమోదీకి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి, చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కృతజ్ఞతలు. ఈ అవార్డు అందుకున్న తర్వాత మరింత వివరంగా ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడతాను. అందరికీ థ్యాంక్యూ’’ అంటూ ఆయన ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు నెటిజన్లందరూ కంగ్రాచ్యులేషన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
‘పద్మశ్రీ’ పురస్కారంపై మురళీ మోహన్ స్పందనిదే.. pic.twitter.com/LsLtcYxZgm
— Balu Kondapalli (@Balu2070) January 26, 2026
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

