Rajendra Pradad: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం వారిద్దరూ భేటీ అయినట్లుగా డిప్యూటీ సిఎమ్ఓ, ఆంధ్రప్రదేశ్ ట్విట్టర్ ఎక్స్‌లో అధికారికంగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫొటోలు చూస్తుంటే వారిద్దరూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించే కాకుండా, పలు విషయాలను చర్చించినట్లుగా సమాచారం. అలాగే గతంలో వారి మధ్య ఉన్న మధుర జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. ఈ భేటీ అనంతరం పవన్ కళ్యాణ్‌ను రాజేంద్ర ప్రసాద్ ఘనంగా సత్కరించారు.
Also Read: Krishnaveni: ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన నటి, నిర్మాత మృతి
అందుకేనా భేటీ!
పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇండస్ట్రీ తరపున ఎటువంటి సన్మాన కార్యక్రమాలు జరగలేదు. అందరూ ట్వీట్స్ రూపంలో, అధికారిక ప్రకటనల ద్వారా శుభాకాంక్షలు చెప్పారు తప్పితే, ఇండస్ట్రీ పర్సన్ డిప్యూటీ సీఎం అయ్యారని, టాలీవుడ్ తరపున ఎటువంటి అభినందన సభ జరగలేదు. ఒక వేళ జరిగి ఉంటే ఇండస్ట్రీ అంతా హాజరై, పవన్ కళ్యాణ్‌ని అభినందించే వారేమో. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇచ్చిన పార్టీ తప్పితే, అందరూ కలిసి ఎటువంటి కార్యక్రమం నిర్వహించలేదు. టాలీవుడ్‌కి చెందిన కొందరు సమయం దొరికినప్పుడు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్‌ని కలిసి అభినందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాజేంద్ర ప్రసాద్ కూడా, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్‌ను కలిసి అభినందించి ఉంటారనేలా టాక్ వినబడుతోంది.
ఈరోజు ఉదయం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి @PawanKalyan తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ప్రముఖ నటుడు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు. pic.twitter.com/DVijEJTRaq
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) February 16, 2025
అప్పుడు కుదరలేదనేనా!
ఏపీలో కూటమి ప్రభుత్వం గెలిచి, మంత్రులుగా ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన అనంతరం పవన్ కళ్యాణ్ తన పనిలో నిమగ్నమయ్యారు. ఆయన తీసుకున్నమంత్రిత్వ శాఖలకు పూర్తి న్యాయం చేసేలా బిజీబిజీగా మారిపోయారు. మరోవైపు రాజేంద్రప్రసాద్ తన కుమార్తెను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో మునిగిపోయారు. అందుకే, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్‌ని రాజేంద్రుడు కలవలేకపోయారని, ఇప్పుడు సమయం చూసుకుని ఇలా వచ్చి, ఆయనని అభినందించారని అంతా మాట్లాడుకుంటున్నారు. మెగా ఫ్యామిలీతో నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్‌కి ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవిని రాజేంద్ర ప్రసాద్ ఎంతగా అభిమానిస్తారో అందరికీ తెలిసిన విషయమే.