varanasi-title(x)
ఎంటర్‌టైన్మెంట్

Varanasi title controversy: చిక్కుల్లో రాజమౌళి ‘వారణాసి’ టైటిల్.. అందుకు హనుమంతుడికి కోపం వచ్చిందా!..

Varanasi title controversy: పాన్ ఇండియా స్టార్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు తో రూపొందిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘వారణాసి’. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ కోసమే రాజమైళి గ్లోబల్ రేంజ్ ఎరేంజ్ మెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ టైటిల్ చుట్టూ ఇప్పుడు వివాదం నడుస్తోంది. ఈ టైటిల్ తమదేనంటూ రామ భక్త హనుమాన్ క్రియేషన్స్ బ్యానర్ ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్రయించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో ఒక్కసారిగా ‘వారణాసి’ టీం అవాక్కయింది.

Read also-Nayanthara in NBK111: బాలయ్య బాబు సరసన నాలుగోసారి హీరోయిన్‌గా నటించనున్న ఇండియన్ క్వీన్.. ఎవరంటే?

ఇటీవలే ‘గ్లోబ్ ట్రూటర్’ పేరుతో భారీ ఈవెంట్‌ను నిర్వహించి, ఈ ప్రాజెక్ట్‌కు ‘వారణాసి’ అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. ఈ టైటిల్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందింది. తాజాగా ఈ టైటిల్ తమదేనంటూ ఓ నిర్మాణ సంస్థ అభ్యంతరం తెలిపింది. అయితే, ‘రామ భక్త హనుమాన్ క్రియేషన్స్’ బ్యానర్ తరపున నిర్మాత విజయ్ అనే వ్యక్తి ఫిల్మ్ ఛాంబర్ (ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) ను ఆశ్రయించారు. ‘వారణాసి’ అనే టైటిల్‌ను తాము కొన్నాళ్ల క్రితమే రిజిస్టర్ చేసుకున్నామని, తమ బ్యానర్ తరఫున ‘రఫ్’ ఫేమ్ సుబ్బారెడ్డి దర్శకత్వంలో ఒక చిన్న సినిమాను కూడా ఇదే టైటిల్‌తో ప్రకటించామని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజమౌళి బృందం తమ అనుమతి లేకుండా ఈ టైటిల్‌ను వాడుకోవడం సరికాదని, ఈ విషయంపై నిర్మాతల మండలి న్యాయం చేయాలని వారు కోరారు. టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ లో హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలకు హనుమంతుడికి కోపం వచ్చి ఉంటుందని నెటిజన్లు అంటున్నారు.

ఇలా జరిగితే ఏం చేస్తారు..

సినీ పరిశ్రమలో ఒకే టైటిల్‌పై ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది నిర్మాతలు హక్కులు క్లెయిమ్ చేయడం కొత్తేమీ కాదు. ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు, ఫిల్మ్ ఛాంబర్ నిబంధనల ప్రకారం.. ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారికే టైటిల్‌పై ప్రాథమిక హక్కు ఉంటుంది. పెద్ద సినిమా నిర్మాతలు చిన్న సినిమా నిర్మాతలను సంప్రదించి, కొంత మొత్తం చెల్లించి టైటిల్‌ను కొనుగోలు చేయడం లేదా పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవడం సాధారణంగా జరుగుతుంది. లేదంటే, వివాదం ముదిరితే, టైటిల్‌కు ముందు హీరో పేరు లేదా దర్శకుడి పేరు చేర్చి కొత్త టైటిల్‌గా మార్చి విడుదల చేయడం గతంలో జరిగింది. గతంలో మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘ఖలేజా’ సినిమా కూడా ఇలాంటి వివాదంలో చిక్కుకున్నప్పుడు, దానిని ‘మహేష్ ఖలేజా’గా విడుదల చేశారు. ప్రస్తుతం ‘వారణాసి’ టైటిల్ పైన కూడా రాజమౌళి పేరును చేర్చి ‘రాజమౌళి వారణాసి’గా విడుదల చేసే అవకాశం ఉందనే చర్చ కూడా నడుస్తోంది. అయితే, ఈ వివాదంపై రాజమౌళి లేదా మహేష్ బాబు బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Read also-Human Sagar death: ప్రముఖ ఒడియా గాయకుడు కన్నుమూత.. రాజకీయ ప్రముఖులు సంతాపం

మరో వివాదం

‘వారణాసి’ టైటిల్ వివాదంతో పాటు, ఇదే ఈవెంట్‌లో దర్శకుడు రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు కూడా మరో వివాదానికి దారి తీశాయి. ఈవెంట్‌లో సాంకేతిక లోపం తలెత్తినప్పుడు రాజమౌళి భావోద్వేగంతో మాట్లాడుతూ, “నాకు దేవుడిపై అంత నమ్మకం లేదు. నాన్నగారు హనుమంతుడు అన్నీ నడిపిస్తాడని చెప్పారు. ఇదేనా నడిపించడం?” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ, ‘రాష్ట్రీయ వానరసేన’ అనే సంస్థ హైదరాబాద్‌లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో రాజమౌళిపై ఫిర్యాదు చేసింది. మత విశ్వాసాలను కించపరిచినందుకు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మొత్తం మీద, ప్రతిష్ఠాత్మకమైన ‘వారణాసి’ చిత్రం టైటిల్ ప్రకటన, రాజమౌళి వ్యాఖ్యల కారణంగా ప్రారంభంలోనే వరుస వివాదాలలో చిక్కుకోవడం సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. అయితే దీని గురించి ఇప్పటి వరకూ రాజమౌళి నుంచి కానీ నిర్మాతలనుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. అయితే ఏం జరుగుతుంతో చూడాలి మరి.

Just In

01

Ginning Mills Srike: ఎక్కడికక్కడ జిన్నింగ్‌ మిల్లుల మూత.. తీవ్ర ఆందోళనలో పత్తిరైతులు

Kalvakuntla Kavitha: కేసీఆర్ తప్పు చేశారు.. కుట్ర చేసి నన్ను పంపేశారు.. కవిత సంచలన కామెంట్స్

Chhinnamasta Devi: రాజమౌళి ‘వారణాసి’ గ్లింప్స్‌లో కనిపించిన శిరస్సు లేని దేవత గురించి తెలుసా.. ఇది తెలిస్తే భక్తుడైపోతారు..

Air Pollution: వాయు కాలుష్యం వల్ల వచ్చే ప్రమాదకర అనారోగ్య సమస్యలు ఇవే..!

Delhi Blast Case: ఢిల్లీ పేలుడుకు పాల్పడ్డ బాంబర్ ‘అన్‌సీన్ వీడియో’ వెలుగులోకి.. వామ్మో వీడు మామూలోడు కాదు