టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) రాజకీయ, వ్యక్తిగత నిరాశల కలబోతగా చేసిన ట్వీట్లు తెలంగాణలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలోని రాజకీయ నాయకులను, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)లను ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అసలు రాహుల్ రామకృష్ణకు ఏమైంది? అంటూ నెటిజన్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ ట్వీట్స్‌కు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ట్వీట్స్ చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితిపై డౌట్స్ వస్తున్నాయనేలా వారు రియాక్ట్ అవుతుండటం విశేషం. ఇప్పుడే కాదు.. గతంలో కూడా ఆయన ఇలాంటి ట్వీట్స్‌తోనే వార్తలలో నిలిచారు. ఇక సినిమాలు మానేసి వెళ్లిపోతా.. నా వల్ల కాదంటూ అప్పట్లో చేసిన కొన్ని సంచలన ట్వీట్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. అది కేవలం సినిమాల వరకే.. కానీ ఇప్పుడు రాజకీయాలకు ముడిపెడుతూ ఆయన చేసిన ట్వీట్స్ నిజంగానే దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన ట్వీట్స్ ఒక్కసారి గమనిస్తే.. (Rahul Ramakrishna Tweets)
Also Read- Sir Creek Area: చరిత్ర మారిపోతుంది జాగ్రత్త.. పాకిస్థాన్‌కు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సంచలన వార్నింగ్
విసిగి పోయాను.. చంపేయండి
రాహుల్ రామకృష్ణ ఓ ట్వీట్‌లో తన వ్యక్తిగత నిరాశను తెలియజేస్తూ.. ‘‘నేను విసిగిపోయా. నన్ను చంపేయండి’’ అని పేర్కొనడం తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. మరొక ట్వీట్‌లో ఆయన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై స్పందించారు. ‘మనం భయంకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం’ అంటూనే, ‘డంబుల్ డోర్ కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నా’ అని మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు. ఇంకా ఇదే ట్వీట్‌లో ‘నేను బాగా విసిగిపోయాను.. నన్ను చంపేయండి’ అని అనడం చూస్తుంటే.. తను ఆశించినట్లుగా ఏమీ జరగడం లేదని, పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఈ ట్వీట్ తెలియజేస్తుంది. దీని కంటే ముందు అక్టోబర్ 2 గాంధీ జయంతి కాగా, ఆయనను ఉద్దేశిస్తూ కూడా ఓ ట్వీట్ చేశారు. అందులో ‘మళ్ళీ చెబుతున్నా, గాంధీ సాధువు కాదు.. అలానే మహాత్ముడు కాదు’ అని పోస్ట్ చేశారు.
Also Read- Pawan Kalyan: అసలిప్పటి వరకు ‘ఓజీ’ స్టోరీ ఏంటో నాకు తెలీదు
ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నెలకొన్న సమస్యలపై రాహుల్ రామకృష్ణ మరో ట్వీట్‌లో.. ‘‘హైదరాబాద్ మునిగిపోయింది. హామీలన్నీ విఫలమయ్యాయి. వీటిని చక్కబెట్టేందుకు ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు కేసీఆర్’’ అంటూ ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ చేసిన పోస్ట్ బాగా వైరల్ అవుతుంది. ఈ ట్వీట్‌లో ఆయన హైదరాబాద్‌లో వరదలు, ఇతర సమస్యలన్నీ దూరం కావాలంటే కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటున్నట్లుగా ఉంది. మరో ట్వీట్‌లో.. ‘ప్రపంచమంతా ద్వేష రహిత మార్గంలో జీవించాలని, ప్రేమించాలని కోరుకుంటున్నాను.. ఎందుకంటే మనమందరం మనుషులం, కేవలం మనుషులం’ అని పేర్కొన్నారు. మొత్తంగా, ఈ ట్వీట్లు రాహుల్ రామకృష్ణ వ్యక్తిగత నిరాశను, రాష్ట్రంలోని ఇతర సమస్యలపై ఆగ్రహాన్ని కలిపి రాజకీయ నాయకులను ట్యాగ్ చేస్తూ, ప్రస్తుత ప్రభుత్వంపై చేసిన విమర్శలుగా కనిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. వీటిపై అధికార పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు