OG Success Meet
ఎంటర్‌టైన్మెంట్

Pawan Kalyan: అసలిప్పటి వరకు ‘ఓజీ’ స్టోరీ ఏంటో నాకు తెలీదు

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) ఓజాస్ గంభీరగా నటించిన చిత్రం ‘ఓజీ’ (They Call Him OG). యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 25న థియేటర్లలో వచ్చిన ఈ సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 24 రాత్రి నుంచే ప్రత్యేక షోలు ప్రదర్శించబడిన విషయం తెలిసిందే. మొదటి షో నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను రాబట్టుకున్న ఈ చిత్రం మొదటి వారాంతంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.252 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి.. ఇప్పుడు రూ. 300 కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకెళుతోంది. పవన్ కళ్యాణ్‌ను మునుపెన్నడూ చూడని విధంగా దర్శకుడు సుజీత్ చూపించిన తీరుకి అభిమానులు ఫిదా అవుతున్నారు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్, సుజీత్ దర్శకత్వ ప్రతిభ, థమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం, రవి కె చంద్రన్, మనోజ్ పరమహంసల సినిమాటోగ్రఫీ కలిసి.. ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిలిపాయి. తెలుగు సినీ చరిత్రలో సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్న ఈ చిత్ర విజయోత్సవ వేడుకను బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. పవన్ కళ్యాణ్‌తో పాటు, చిత్ర బృందమంతా ఈ వేడుకకు హాజరయ్యారు.

Also Read- Mirai Movie Collections: 150 కోట్ల క్లబ్‌లోకి చేరిన ‘మిరాయ్’ .. తేజ సజ్జా సరికొత్త రికార్డ్!

చాలా తక్కువ సార్లు జరుగుతుంటుంది

ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘ఓజీ’ సినిమా మా అందరికీ చాలా చక్కటి అనుభూతిని ఇచ్చింది. చాలా అరుదుగా సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి, గ్రేట్ కలెక్షన్స్ వస్తుంటాయి. కానీ, ఒక సెలబ్రేషన్‌లా ఒక సినిమా రిలీజ్ అవ్వడం చాలా తక్కువ సార్లు జరుగుతూ ఉంటుంది. అలాంటి అవకాశం ‘ఓజీ’కి లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి ఒక సినిమా సుజిత్ ద్వారా నాకు రావడం. దానికి థమన్ జీవం పోయడం, రవి కె చంద్రన్ ఫోటోగ్రఫీ.. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, డీవీవీ దానయ్య ఇలా ఈ సినిమా గొప్పగా రావడానికి కారణమైన అందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు.

ఇప్పటి వరకు ‘ఓజీ’ స్టోరీ ఏంటో నాకు తెలీదు

ఒక సినిమా కథని రాయడం, చెప్పడం చాలా ఈజీ.. కానీ రాసిన కథను తెర మీదకు తీసుకురావడం చాలా చాలా కష్టం. ఎందుకు అంటే డైరెక్టర్ దగ్గర నుంచి లైట్ మ్యాన్ వరుకు అందరూ యూనిటీగా పని చేయాలి. ‘జానీ’ టైమ్‌లో నాకు ఇలాంటి టీమ్ లేదు. అది ఓజీ విషయంలో జరిగింది. మీకు ఒక విషయం చెప్పాలి. అసలు ఇప్పటి వరకు ‘ఓజీ’ స్టోరీ ఏంటో నాకు తెలీదు. త్రివిక్రమ్, నేను మాట్లాడుకుంటున్నపుడు సుజిత్ టాపిక్ వచ్చింది. అలా ఓజీ స్టోరీ వినడానికి ఆయనని కలవడం జరిగింది. అప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే, మీరు ఒక కత్తి పట్టుకుని జపానీస్ డ్రెస్‌లో ఉంటారు. గన్స్ ఉంటాయి, మీరు ఒక గ్యాంగ్ స్టర్. ఇలాగే చెప్పాడు కథ, నాకు ఏం అర్థం కాలేదు. కానీ సుజిత్ నాకు ఇచ్చిన పేపర్స్‌ను మా అబ్బాయి అకీరా నందన్ చదువుతూ చాలా ఆనందిస్తుండేవాడు. అప్పుడు అనిపించింది, ఈ తరం వాళ్ళకి అర్థం అయ్యే కథే ‘ఓజీ’ సినిమా అని.

Also Read- School Principal: బ్యాంక్ చెక్‌లో అక్షర దోషాలు.. అడ్డంగా బుక్కైన ప్రిన్సిపల్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

ఈ యూనివర్స్‌ను కంటిన్యూ చేయాలనుకుంటున్నా..

కొన్నిసార్లు సుజిత్‌లో నన్ను నేను చూసుకుంటా. ఎందుకు అంటే కొన్ని సార్లు మనం చెప్పాలి అనుకున్నది చెప్పలేకపోవచ్చు, కానీ చేసి చూపించగలమని నేను బాగా నమ్ముతాను. అది సుజిత్‌లో నాకు కనిపించింది. అందుకే సుజిత్‌కి నేను ఒక మాట ఇచ్చాను. ఓజీ సీక్వెల్ గానీ, ప్రీక్వెల్ గానీ మనం చేస్తున్నామని. కాకపోతే కొన్ని కండీషన్స్ అప్లయ్ అవుతాయి. ఒక ఫ్లాప్ సినిమా ఎంత నిరుత్సాహ పరుస్తుందో నాకు తెలుసు. కానీ ఓజీ సినిమా నాకు మళ్లీ సినిమా చేయాలి అనే బలాన్ని ఇచ్చిందని మాత్రం చెప్పగలను. కాబట్టి నాకున్న టైమ్‌లో ‘ఓజీ’ యూనివర్స్ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. థమన్ ఇచ్చిన సంగీతం నన్ను ‘తమ్ముడు’ సినిమా రోజులకి తీసుకువెళ్లింది. రఘువరన్ అంటే నాకు చాలా ఇష్టం. అర్జున్ దాస్‌ని చూసినపుడు నాకు ఆయనే గుర్తుకు వస్తారు. నాకు అలాంటి గొంతు లేదే అని నేను చాలా ఫీల్ అవుతుంటాను. ‘ఓజీ’ యూనివర్స్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Pawan Kalyan: అసలిప్పటి వరకు ‘ఓజీ’ స్టోరీ ఏంటో నాకు తెలీదు

Mirai Movie Collections: 150 కోట్ల క్లబ్‌లోకి చేరిన ‘మిరాయ్’ .. తేజ సజ్జా సరికొత్త రికార్డ్!

Vilaya Thandavam: ‘విలయ తాండవం’ టైటిల్ పోస్టర్ అదిరింది

Avika Gor: ప్రియుడితో ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏడడుగులు.. ఫొటోలు వైరల్

Disqualification Hearing: నలుగురు ఎమ్మెల్యేల సుదీర్ఘ విచారణ.. నెక్స్ట్ ఏంటి?