Mirai Movie Collections: 150 కోట్ల క్లబ్‌లోకి చేరిన ‘మిరాయ్’
Mirai Movie
ఎంటర్‌టైన్‌మెంట్

Mirai Movie Collections: 150 కోట్ల క్లబ్‌లోకి చేరిన ‘మిరాయ్’ .. తేజ సజ్జా సరికొత్త రికార్డ్!

Mirai Movie Collections: యంగ్ సూపర్‌హీరో తేజా సజ్జా (Teja Sajja) తన విజయ పరంపరను కొనసాగిస్తూ బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘మిరాయ్’ (Mirai Movie) ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 150 కోట్ల కలెక్షన్స్ సాధించి, ఈ సీజన్‌లోనే అతిపెద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్ర విజయయాత్ర అద్భుతంగా కొనసాగుతోంది. ఫెస్టివల్ కావడంతో పాటు, టికెట్ల ధరలు కూడా తగ్గడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు క్యూ కడుతున్నారు. దీంతో మరోసారి కలెక్షన్స్ ఊపందుకున్నాయి.

Also Read- Bigg Boss 9 Telugu Promo: తనూజ మూతిపై దాడి.. హోస్‌లో మళ్లీ రచ్చ రచ్చ.. ప్రోమో చూస్తే గూస్ బంప్సే!

రూ. 150 కోట్ల క్లబ్‌లోకి..

ప్రస్తుతం థియేటర్లలో పవన్ కళ్యాన్ ‘ఓజీ’ రూపంలో పోటీ ఉన్నప్పటికీ, ‘మిరాయ్’ అద్భుతమైన వసూళ్లతో (Mirai Collections ) దూసుకెళ్తోంది. ఇటీవలే ఓవర్సీస్‌లో 3 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటిన ఈ సినిమా, తాజాగా ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల కీలక మైలురాయిని అధిగమించిందని మేకర్స్ అధికారికంగా తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. వాస్తవానికి ఈ చిత్ర టీమ్ ‘మిరాయ్’ టికెట్ ధరలను పెంచకుండానే ఈ అద్భుత విజయాన్ని సాధించడం విశేషం. దసరా సెలవుల్లో థియేటర్లలోకి ప్రేక్షకులు పోటెత్తుతుండటంతో ‘మిరాయ్’ డ్రీమ్ రన్ ఇంకా కొనసాగే అవకాశం ఉంది.

Also Read- Viral News: అమ్మకు బాలేదని లీవ్ అడిగిన ఉద్యోగి.. అందరి తల్లులు పోయేవారే.. డ్రామా చేయకంటూ బాస్ ఫైర్

తేజా సజ్జాకు డబుల్ బ్లాక్‌బస్టర్

‘హనుమాన్’ తర్వాత వరుసగా రెండవసారి రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన హీరోగా తేజా సజ్జా నిలవడం ఆయన కెరీర్‌కు ఒక మైల్‌స్టోన్. రెండు వరుస బ్లాక్‌బస్టర్‌లతో ఆయన బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ.. తన కెరీర్‌కు మంచి బాటను వేసుకున్నారు. ఈ రెండు సినిమాలకు సీక్వెల్ ఉంది కాబట్టి.. మరో రెండు బ్లాక్ బస్టర్స్ ఫిక్సయిపోవచ్చు. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటించగా, మనోజ్ మంచు విలన్ పాత్రలో కనిపించారు. జగపతి బాబు, శ్రియా శరణ్ వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. శక్తివంతమైన యాక్షన్ సన్నివేశాలు, అద్భుతమైన విజువల్స్‌తో పాటు, ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. కంటెంట్‌లో ఉన్న బలం, దసరా పండుగ సీజన్ కలిసి రావడంతో.. నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లకు ఈ సినిమా భారీ లాభాలు తెచ్చిపెట్టిందని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ సక్సెస్‌తో నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ ఆనందంలో తేజ సజ్జా, దర్శకుడు కార్తీక్ ఏం కావాలంటే అది గిఫ్ట్‌గా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన విషయం తెలిసిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..

Crime News: జైలు నుంచి ఇటీవలే విడుదల.. అంతలోనే చంపేశారు.. దారుణ ప్రతీకార హత్య

Bandla Ganesh: ‘మోగ్లీ 2025’పై బండ్ల గణేష్ రివ్యూ.. ‘వైల్డ్’ అర్థమే మార్చేశారు