Ustad Bhagat Singh: హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబోలో రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్ డ్రామా ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంతో పవన కళ్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చేస్తున్నారు. ఇప్పటికే ‘గబ్బర్ సింగ్’ సినిమాలో పోలీస్ పాత్ర వేసిన పవన్ ఆ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. మళ్లీ అదే తరహారలో ఇండస్ట్రీ హిట్ కొట్టేందుకు కాంబినేషన్ రిపీట్ చేస్తు్న్నారు. శ్రీలీల కథానాయికగా కనిపించనున్న విషయం తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రఫీని అయనంక బోస్, ఎడిటింగ్‌ను చోటా కె. ప్రసాద్ నిర్వహిస్తున్నారు. అషుతోష్ రాణా, పంకజ్ త్రిపాఠి, గౌతమి, నవాబ్ షా, చమ్మక్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మూవీ టీం. ఈ సినిమాలోకి మరో ముద్దుగుమ్మ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వారు తెలిపారు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read also- Dialysis Patients: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. డయాలసిస్ రోగులకు చేయూత.. మంత్రి సీతక్క
రాశి ఖన్నా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో ‘శ్లోక’ పాత్రలో చేరినట్లు మూవీ టీం అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో రాశి ఖన్నా ఒలివ్ గ్రీన్ దుస్తుల్లో కెమెరాతో ఉన్న స్టిల్‌ను విడుదల చేశారు. ఆమె ఒక ఫోటోగ్రాఫర్ పాత్రలో పవన్ కళ్యాణ్ సరసన నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం తమిళ చిత్రం తెరి రీమేక్, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది, పవన్ కళ్యాణ్ మరోసారి పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నారు. రాశి ఖన్నా రాకతో ఈ సినిమా మరింత అందంగా మారిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఫైట్లు అదిరిపోయోలా తీశారంటూ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. రాశి ఖన్నా కూడా చేరడంతో ఈ హైప్ మరింత పెరిగింది.
Read also- Honeymoon Murder case: నెల రోజులుగా జైల్లోనే.. అయినా బుద్ధిరాలేదు.. తోటి ఖైదీలతో సోనమ్ ఏం చేసిందంటే?
ఇప్పటికీ ఈ సినిమా నుంచి కోన్ని లుక్స్ అనధికారకంగా విడుదల అయ్యాయి. దీనిపై మూవీ టీం కూడా సీరియస్ అయింది. ఇలాంటి చర్యలు జరగకుండా చూసుకుటామని అభిమానులకు భరోసా ఇచ్చింది. రాశి ఖన్నా ఉస్తాద్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో కాకుండా సిద్ధూ జొన్నలగడ్డ సరసన ‘తెలుసు కదా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ గా శ్రీనిధి కనిపించనున్నారు. ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ లుక్‌కు అందరూ ఫిదా అయ్యారు. దీనిపై ఓ అభిమాని పోస్ట్ పెట్టగా.. దానికి హరీశ్ శంకర్ సరదాగా రిప్లై ఇచ్చారు. ‘‘పవన్ ఉస్తాద్ లుక్ అదిరిపోయింది. ఓ అభిమానిగా హరీశ్ శంకర్ ఆయన్ని అద్భుతంగా చూపించనున్నారని అర్థమవుతోంది’’ అని పోస్ట్ పెట్టారు. దీనికి దర్శకుడు రిప్లై ఇస్తూ.. ‘తరతరాలుగా.. నరనరాల్లో ఆయనపై అభిమానం ఉప్పొంగుతోంది’ అని రిప్లై ఇచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.