PuriSethupathi: హీరోయిజానికి ఎలివేషన్ ఇచ్చే దర్శకులలో పూరి స్టైలే వేరు. సాధారణ హీరోలను కూడా ఆయన స్టార్స్‌ని చేస్తాడనే పేరు తెచ్చుకున్న పూరీకి గత కొంతకాలంగా అస్సలు కలిసి రావడం లేదు. ఒక సినిమా హిట్ అయితే.. నాలుగు సినిమాలు ఫట్ అనేలా పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు టాలీవుడ్ నుంచి ఏ హీరో కూడా డేట్స్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. దీంతో ఆయన కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. విజయ్ సేతుపతి సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని అప్డేట్స్ కూడా వచ్చాయి. ముఖ్యంగా ఇందులోని తారాగణం సినిమాపై ఇంట్రస్ట్‌ని క్రియేట్ చేస్తుంది. అలాగే రీసెంట్‌గానే ఈ సినిమాను చాలా సింపుల్‌గా సంస్థ ఆఫీస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. సోమవారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ని స్టార్ట్ చేసినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Also Read- Sehwag Son: సెహ్వాగ్ పెద్ద కొడుకు సంచలనం.. వేలంలో భారీ ధర
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ (Puri Jagannadh), వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) తొలిసారిగా కలిసి చేస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘#పూరిసేతుపతి’ (PuriSethupathi) అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ ప్రాజెక్ట్‌ను జెబి మోషన్ పిక్చర్స్ జెబి నారాయణ్ రావు కొండ్రోల్లా కొలాబరేషన్‌లో.. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. నటి చార్మీ కౌర్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త హీరోయిన్‌గా నటిస్తుండగా, టబు, విజయ్ కుమార్ వంటివారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హైదరాబాద్‌లో సోమవారం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకున్న ఈ చిత్రానికి సంబంధించి విజయ్ సేతుపతి, సంయుక్త, ఇతర తారాగణం సభ్యులు పాల్గొనే కీలక సన్నివేశాలను భారీ సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. ఎలాంటి బ్రేక్స్ లేకుండా, ఖర్చు విషయంలో భారీగా వెళ్లకుండా షూటింగ్‌ను శరవేగంగా జరిపేలా పూరి జగన్నాధ్ అండ్ టీమ్ పక్కా ప్లానింగ్‌తో చిత్రీకరణ జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
Also Read- Tabu: 16ఏళ్ళ వయసులో ఆ హీరో టబుతో అలాంటి పని చేశాడా.. అందుకే ఆమె పెళ్లి చేసుకోలేదా?
గత చిత్రాలు ఇచ్చిన ఝలక్‌తో పూరి చాలా ఛేంజ్ అయ్యారని, ఈసారి ఆయన బాక్సాఫీస్‌పై కొట్టే దెబ్బ మాములుగా ఉండదని అంతా అనుకుంటున్నారు. అందులోనూ ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. అందుకే ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా వెళ్లాలని చిత్ర టీమ్‌కు దర్శకుడు పూరి జగన్నాధ్ ముందే సూచనలు చేశారట. అంటే పూరి ఈసారి బాక్సాఫీస్‌ని భయపెట్టబోతున్నాడని ఫిక్సయిపోవచ్చు. చూద్దాం.. గాయపడ్డ పులి నుంచి వచ్చే గర్జన ఎలా ఉండబోతోందో! ఈ సినిమాతో మళ్లీ పూరీ సత్తా చాటితే మాత్రం.. మళ్లీ కొన్నాళ్ల పాటు ఆయనకు ఢోకా ఉండదు. అంతేకాదు, టాలీవుడ్ హీరోలతో పని లేకుండా ఇతర ఇండస్ట్రీలలోని హీరోలతో కూడా ఆయన పని చేసుకోవచ్చు. సో.. ఎలా చూసినా ఈ సినిమా పూరికి డూ ఆర్ డై మూమెంట్ అని చెప్పక తప్పదు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు