barbiric(image :x)
ఎంటర్‌టైన్మెంట్

Vijay Paul Reddy: ‘త్రిబాణధారి బార్బరిక్’ నిర్మాత నుంచి వరసగా మూడు చిత్రాలు.. నిజంగా సినిమా వర్కవుట్ కాలేదా?

Vijay Paul Reddy: సినిమాల్లో ఎప్పుడూ ప్రయోగాలు చూస్తూనే ఉంటారు చాలా మంది నిర్మాతలు. అలాంటి ప్రయోగాలు చేసేవారిలో ముందు వరుసలో ఉంటారు జయ్ పాల్ రెడ్డి అడిదల. ఆయన తీసిన సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నా కలెక్షన్ల్ పరంగా అందగా ఆడలేదు అన్న వారు అవాక్కయ్యేలా మరో సినిమాను లైన్లో పెట్టారు. వానరా సెల్యూలాయిడ్ బ్యానర్ మీద వచ్చిన ‘త్రిబాణధారి బార్బరిక్’, ‘బ్యూటీ’ వంటి చిత్రాలు వచ్చి ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ ప్రాజెక్టులతో నిర్మాతగా తన అభిరుచిని చాటుకున్నారు విజయ్ పాల్ రెడ్డి అడిదల. నిర్మాతగా మంచి చిత్రాల్ని ఆడియెన్స్‌కి అందించాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి వచ్చిన విజయ్ పాల్ రెడ్డి ఎప్పటి కప్పుడు సరికొత్త ప్రాజెక్టులతో ప్రజలను రంజింపజేయాలని ఎప్పుడూ తాపత్రయ పడుతుంటారు.
దీనిని చూస్తుంటే మార్బరిక్ సినిమా కలెక్షన్లు బాగానే సాధించింది అన్నట్లు క్రిటిక్స్ చెబుతున్నాయి.

Read also-Ananya Nagalla: ప్రేమలో అనన్య నాగళ్ల.. ఏకంగా లాంగ్‌టెర్మ్ రిలేషన్‌షిప్ అంట, ఎవరితోనంటే?

సినిమాల్ని కమర్షియల్‌గా చూడని నిర్మాతగా విజయ్ పాల్ రెడ్డి డిఫరెంట్ కంటెంట్‌లకు ఓకే చెబుతున్నారు. ‘త్రిబాణధారి బార్బరిక్’ అంటూ సరికొత్త ప్రయోగం చేశారు. ‘బ్యూటీ’ అంటూ ప్రతీ అమ్మాయిని, ప్రతీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని టచ్ చేశారు. ఇక ఇప్పుడు మరో మూడు ప్రాజెక్టుల్ని లైన్‌లో పెట్టారు. ఇందులో ఓ ప్రముఖ హీరోతో విజయ్ పాల్ రెడ్డి ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూడు ప్రాజెక్టులు కూడా డిఫరెంట్ జానర్‌లో ఉండబోతోన్నాయని సమాచారం. ఇక ఈ డిఫరెంట్ కంటెంట్ స్టోరీల్ని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకు రాబోతోన్నారు. ఇండస్ట్రీలో ఒక సినిమాను నిర్మించి రిలీజ్ చేయడమే గొప్ప విషయం అంటే.. విజయ్ పాల్ రెడ్డి వరుసగా రెండు చిత్రాల్ని విడుదల చేశారు. ఇక ఇప్పుడు మరో మూడు ప్రాజెక్టుల్ని కూడా నిర్మించేందుకు సిద్దమయ్యారు. ఈ మూడు ప్రాజెక్టుల్కి సంబంధించిన ఇతర వివరాల్ని త్వరలోనే ప్రకటించనున్నారు.

Read also-Dude trailer out: ‘డ్యూడ్’.. ట్రైలర్ వచ్చేసింది.. చూసేయండి మరి..

స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’ విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్ల పరంగా అనుకున్నంత ఆడలేదు. ఈ సినిమాకు సంబంధించి ఆ సమయంలో దర్శకుడు చేసిన పని టాలీవుడ్ పరిశ్రమను మొత్తం ఆశ్చర్యానికి గురిచేసేలా చేసింది. ఈ సినిమా ఎలా ఉంది అని ప్రజలను అడగ్గా వారు చాలా బాగుందన్నారు కనీ థియోటర్లుకు జనాలు మాత్రం రాలేదు. దీనికి నిరాశ చెందిన దర్శకుడు ఎమోషన్ కు లోనౌతూ తనను తాను చెప్పుతో కూడా కొట్టకున్నాడు. ఆ వీడియో అప్పుడు తెగ వైరల్ అయింది. కానీ నిర్మాత మాత్రం సినిమాలు తీయడం ఆపలేదు. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీలో సత్య రాజ్, ఉదయభాను, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ వంటి వారు ప్రముఖ పాత్రలను పోషించారు.

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది