Dude trailer out: ప్రదీప్ రంగనాధన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘డ్యూడ్ (Dude)’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదలైంది. దీపావళి కానుకగా అక్టోబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘లవ్ టుడే’ తర్వాత ప్రదీప్ నటించిన ఈ చిత్రం రొమాంటిక్, కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్ కలగలిపిన యూత్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందించగా, ఇప్పటికే విడుదలైన మూడు పాటలు సోషల్ మీడియాలో అదిరిపోయే టాక్ తెచ్చుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఈ సినిమా కథలో ప్రదీప్ పాత్ర ఒక మాస్ అటిట్యూడ్ ఉన్న యువకుడి చుట్టూ తిరుగుతుంది. కానీ ఇందులో ప్రేమతో పాటు కుటుంబ సెంటిమెంట్ కూడా ప్రధానంగా ఉండబోతుందని సమాచారం. సినిమాకి సంబంధించిన పోస్టర్లు ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో కీ రోల్ చేయబోతున్నారు. ప్రదీప్, మమితా జోడీ తెరపై సూపర్ హిట్ కెమిస్ట్రీగా మారుతుందని సినీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే “డ్యూడ్” సినిమాకి సంబంధించిన డిజిటల్ హక్కులను ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ మొత్తానికి దక్కించుకుందని సమాచారం. దీపావళి రేసులో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read also-Mahesh Babu: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ‘SSMB29’ టైటిల్ ఇదేనా!..
ట్రైటర్‌ను చూస్తుంటే.. ప్రదీప్ రంగనాధన్ మరో సారి ‘లవ్ టుడే’ ట్రెండ్ లో కొత్త కథతో చచ్చాడనిపిస్తుంది. ఆవారాగా తిరిగే ఓ అబ్బాయికి ప్రేమ, పెళ్లి జీవితంలో ఎం సంక్లిస్టంగా మారతాయో ఇందులో దర్శకుడు కీర్తీశ్వరన్ కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రేమించిన అమ్మాయి ప్రేమ కోసం నిలబడే తీరు ప్రేమలో మరో కోణాన్ని చూపిస్తుంది. అదే సమయంలో వారిద్దరూ విడిపోవాల్సి వస్తే ఎలా ఉంటుందో అప్పుడు జరిగే పరిణామలు ఎమోషనల్ కామెడీతో చూపించారు. మమిత బిజు, ప్రదీప్ రంగనాధన్ కాంబినేషన్ బాగా సెట్ అయింది. సందర్భానికి తగ్గట్టుగా సాయి అభ్యంకర్ అందించిన సంగీతం ట్రైటర్ కు మరింత హైప్ ఇచ్చింది. రంగనాధన్ ప్రతి డైలాగ్ యువతను ఆకట్టుకునేలా ఉన్నాయి. బోల్డ కామిడీ క్రింగ్ గా ఉంది. ప్రదీప్ రంగనాధన్ మరో హిట్ ఇవ్వబోతున్నాడని ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఇప్పటికే బారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా కు ఈ ట్రైలర్ మరిన్ని అంచనాలు పెంచింది. ఈ సినిమా విడుదల కోసం అభిమానలు ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు.
