SKN: యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) నటించిన ‘డ్యూడ్’ (Dude Movie) మూవీ అనూహ్య విజయాన్ని అందుకుంది. దీపావళి స్పెషల్‌గా విడుదలైన ఈ సినిమాకు మొదట మిశ్రమ టాక్ వచ్చినా, ఆ ప్రభావం మాత్రం కలెక్షన్స్‌పై పడలేదు. ప్రస్తుతం ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరడంతో టీమ్ గ్రాండ్‌గా సక్సెస్ సెలబ్రేషన్స్‌ను జరుపుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మమిత బైజు హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ ఓ కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 17న ఈ సినిమా విడుదలై, ఊహించని కలెక్షన్స్‌ను రాబట్టడంతో.. మేకర్స్ డ్యూడ్ బ్లాక్ బస్టర్ 100 కోట్ల జర్నీగా సక్సెస్ మీట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గెస్ట్‌గా హాజరైన నిర్మాత ఎస్కేఎన్.. ఈ చిత్ర హీరోకు తెలుగు ప్రేక్షకులు అభిమానించే తమిళ స్టార్ హీరోల రేంజ్‌ని ఇచ్చేశారు.
Also Read- Chiranjeevi: పేరు, ఫొటోల విషయంలో చిరంజీవి తీసుకున్న నిర్ణయానికి కారణం బాలయ్యేనా?
ఎలైట్ క్లబ్‌లోకి ప్రదీప్..
ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్కేఎన్ (Producer SKN) మాట్లాడుతూ.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌కు ప్రతి నెలా ఏదో ఒక రూపంలో రూ. 100, రూ. 200 కోట్ల సినిమాలు వస్తూనే ఉన్నాయి. వారు ఇండస్ట్రీలో రూ. 2000 కోట్ల కలెక్షన్స్ చూసిన నిర్మాతలు. వారికి ప్రతి నెల ఒక బ్లాక్‌బస్టర్ వస్తుంటుంది. దీపావళికి వచ్చిన ఈ సినిమా పాన్ సౌత్ ఇండియా బ్లాక్ బాస్టర్‌గా నిలిచినందుకు ఆనందంగా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవిల విజన్ వేరు. వాళ్ళ కిరీటంలో మరో మైలురాయి చేరినందుకు వారికి అభినందనలు చెబుతున్నాను. తొలి సినిమా విజయం సాధించడం చాలా స్పెషల్.. అందులోనూ. రూ. 100 కోట్ల సినిమా సాధించిన డైరెక్టర్ కీర్తికి ప్రత్యేకంగా అభినందనలు. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక సుకుమార్ సినిమా చూస్తున్నంత ఇంటెన్సిటీ ఫీల్ అయ్యాను. మమిత బైజు లక్కీ హ్యాండ్. ఇందులో అద్భుతంగా నటించారు. తనకు మరెన్నో విజయాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా విషయానికొస్తే తెలుగు, తమిళ్ అనేవి రెండు స్టేట్స్ కావు.. సినిమాల పరంగా ఒకటే స్టేట్. తమిళ స్టార్స్ కూడా మా స్టార్స్‌గానే ఫీల్ అవుతాం. కమల్ హాసన్, రజినీకాంత్, సూర్య, అజిత్, ధనుష్, విజయ్ సేతుపతి.. ఇలా ఎవరొచ్చినా సరే మా సొంత సినిమాలానే ప్రేమిస్తాం. ప్రదీప్ కూడా ఇప్పుడు ఈ ఎలైట్ క్లబ్‌లో జాయిన్ అయ్యారు. మూడుసార్లు ఇండస్ట్రీని షేక్ చేసి.. వరుసగా మూడు వంద కోట్ల సినిమాలు ఇవ్వడమంటే మాములు విషయం కాదు. ప్రదీప్ కేవలం హీరో మెటీరియల్ కాదు.. యాక్టర్ మెటీరియల్ స్టార్ మెటీరియల్. ప్రదీప్ ఇంకా ఎన్నో విజయవంతమైన సినిమాలు చేయాలని, మైత్రి మూవీ మేకర్స్ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.
Also Read- Star Heroines: ఈ స్టార్ హీరోయిన్స్ వచ్చేస్తున్నారు.. రీ ఎంట్రీలో నిలబడతారా?
తెలుగు ప్రేక్షకులే..
హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. ‘డ్యూడ్’ సినిమా 100 కోట్ల కలెక్షన్స్‌ని క్రాస్ చేసినందుకు హ్యాపీ. అందుకు తెలుగు ఆడియన్స్‌కి కృతజ్ఞతలు తెలపడానికే ఈ వేడుకను నిర్వహించడం జరిగింది. తెలుగు ఆడియన్స్ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. ‘లవ్ టుడే, డ్రాగన్’ చిత్రాలను ఎలా అయితే ఆదరించారో.. ఈ చిత్రానికి అంతకంటే ఎక్కువ ఆదరణ అందించారు. తెలుగు ప్రేక్షకులు సపోర్ట్‌కి ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మా టీమ్ అందరికీ ధన్యవాదాలని తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
