Prithviraj Shetty: ‘కిస్సిక్ టాక్స్ విత్ వర్ష’ (Kissik Talks With Varsha) పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూస్ ఇప్పుడు ఎంతగా వైరల్ అవుతున్నాయో తెలియంది కాదు. ప్రతి వారం ఒక గెస్ట్‌తో వర్ష చేస్తున్న ఈ ఇంటర్వ్యూలో రొటీన్‌గా కాకుండా అన్నీ మిక్సై ఉండటం విశేషం. ఇప్పటికే ఈ ఇంటర్వ్యూకి వచ్చిన సెలబ్రిటీల వీడియోలు వైరల్ అవుతుండగా, తాజాగా ఈ వారం వచ్చే గెస్ట్ ఎవరో రివీల్ చేస్తూ, ప్రోమో విడుదల చేశారు. ఈ వారం గెస్ట్‌గా వస్తుంది ఎవరో కాదు.. బిగ్ బాస్ 8 ఫేమ్ పృథ్వీరాజ్ శెట్టి (Prithviraj Shetty). ఈ ఇంటర్వ్యూలో పృథ్వీ తన కెరీర్, వ్యక్తిగత జీవితం, ఇతర ఆసక్తికరమైన విషయాలెన్నింటినో పంచుకున్నారు. ఈ ప్రోమోని గమనిస్తే..
Also Read- Anasuya: నిన్న సారీ చెప్పి.. ఇప్పుడేంటి అలాంటి పోస్ట్ పెట్టింది
ఆ సినిమాల్లో నేను హీరో అయ్యింటే బాగుండేది
ఈ ప్రోమో ఆరంభంలో హోస్ట్ వర్ష, పృథ్వీని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అని సంబోధిస్తూనే విష్ణు ప్రియ (Vishnu Priya) ప్రస్తావనను తెచ్చారు. ఆ తర్వాత ఒక సరదా సన్నివేశంలో, వీరిద్దరూ ఒక లిఫ్ట్‌లో ఉన్నప్పుడు అది అకస్మాత్తుగా ఆగిపోయినట్లు నటించాలని వర్ష కోరగా, పృథ్వీ పంచ్‌తో ఆమె షాకయింది. ఈ క్రమంలో పృథ్వీ, వర్షల మధ్య జరిగిన కామెడీ డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. పృథ్వీ తనకి నచ్చిన సినిమాల గురించి మాట్లాడుతూ.. సందీప్ రెడ్డి వంగా చేసిన ‘యానిమల్’, రీసెంట్‌గా వచ్చి వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన బాలీవుడ్ ఫిల్మ్ ‘దురంధర్’, యష్ ‘కెజియఫ్’ వంటి సినిమాలని చెప్పారు. అంతేకాదు, ఆ సినిమాలలో తను నటించి ఉంటే చాలా బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ క్యారెక్టర్లు తనకు బాగా సెట్ అవుతాయని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, తాను దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేశానని, ‘‘సార్, నేను త్వరలో మీ సినిమాలో హీరోగా నటిస్తాను’’ అని చెప్పానని, కానీ ఆయన ఇంకా ఆ మెసేజ్ చూడలేదని సరదాగా చెప్పారు. తన ఫోన్‌లోని ఆ మెసేజ్‌ని కూడా ఇందులో చూపించారు.
Also Read- First Ticket: పవన్ కళ్యాణ్, బాలయ్య రూ. 5 లక్షలు.. చిరు సినిమాకు ఇంత తక్కువా?
నన్ను పెళ్లి చేసుకోవద్దని చెబుతా..
తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన సమయం గురించి చెబుతూ, తన తండ్రి మరణించిన క్షణాలను పృథ్వీరాజ్ శెట్టి గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఒకవేళ తన తండ్రి మళ్ళీ తిరిగి వస్తే ముందుగా ఆయన్ని గట్టిగా హత్తుకుని, ఐ లవ్ యు అని చెబుతానని అన్నారు. ఇంకా, తను నటుడిగా ప్రయత్నిస్తున్న రోజుల్లో బంధువుల నుంచి ఎదురైన హేళనలను కూడా గుర్తు చేసుకున్నారు. ‘వీడు యాక్టింగ్ అంటూ తిరుగుతున్నాడు’ అని చుట్టుపక్కల వారు అనేవారని, ఆ సమయంలో తన తల్లి ఇతరులకు ఏం చెప్పాలో తెలియక ఇబ్బంది పడేవారని చెప్పుకొచ్చారు. ఇక సంక్రాంతి పండుగ గురించి అడిగినప్పుడు, పృథ్వీకి ఆ పండుగ విశిష్టత పెద్దగా తెలియదని వర్ష ఆటపట్టించింది. అలాగే, ఒకవేళ యాంకర్, బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ అయినటువంటి విష్ణుప్రియ వచ్చి తనను పెళ్లి చేసుకోమంటే ఏం చెబుతావని అడగగా.. ‘‘నన్ను వద్దు తల్లి.. నువ్వు ఏదైనా మంచి సంబంధం చూసుకుని పెళ్లి చేసుకో’’ అని చెబుతానని సరదాగా అన్నారు. మరో విశేషం ఏమిటంటే.. ఈ షో మధ్యలో పృథ్వీరాజ్ శెట్టికి విష్ణు ప్రియ ఫోన్ చేసి, దాదాపు ఇలాంటి ప్రశ్నలే అడగడం. మొత్తంగా చూస్తే.. ఈ ప్రోమో చాలా ఎంటర్‌టైనింగా, అదే సమయంలో ఎమోషనల్‌గానూ సాగింది. ఈ షోకి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ శనివారం రాత్రి 8 గంటలకు బిగ్ టీవీలో ప్రసారం కానుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

