Anasuya: సోషల్ మీడియా క్వీన్, కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన అనసూయ (Anasuya) తాజాగా ఇన్‌స్టా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ కచ్చితంగా హీరోయిన్ రాశీ (Raasi)ని ఉద్దేశించే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అప్పుడెప్పుడో ‘జబర్ధస్త్’ షోలో హైపర్ ఆదితో కలిసి అనసూయ ‘రాశిగారి ఫలాలు’లో భాగమైంది. ఈ మధ్య శివాజీ ఇష్యూ (Sivaji Comments)లో ఈ వీడియోను బయటికి తీసి మరీ, అనసూయను ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో రాశి, తన యూట్యూబ్ వేదికగా ఆ ఇన్సిడెంట్‌ని గుర్తు చేస్తూ, పేర్లు చెప్పుకుండా ఇన్ డైరెక్ట్‌గా అనసూయ, రోజా (Roja)లకు కౌంటర్ ఇచ్చింది. అప్పుడు పకపకా నవ్విన వారు, ఇప్పుడు పోరాటాలు చేస్తామంటూ ముందుకు రావడం హాస్యాస్పదమంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. దీనికి అనసూయ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతూ.. వివరణ ఇవ్వడమే కాకుండా మనస్ఫూర్తి క్షమాపణలు చెబుతున్నానని తెలిపింది.
Also Read- First Ticket: పవన్ కళ్యాణ్, బాలయ్య రూ. 5 లక్షలు.. చిరు సినిమాకు ఇంత తక్కువా?
సారీ చెప్పినందుకు అహం దెబ్బతిందా?
‘‘తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్‌లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తుల్ని నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది కానీ, అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. అది పొరపాటే.. దయచేసి నా క్షమాపణలను అంగీకరిండి. వెనక్కి వెళ్లి ఇప్పుడు నేను దాన్ని సరిదిద్దలేను. మనుషులు మారుతుంటారు, ఆ షో లో ద్వంద్వార్ధపు మాటలని ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచి పెట్టడం వరకు నాలోని ఆ మార్పు మీరు గమనించవచ్చు’’ అంటూ అనసూయ ఓ లేఖను విడుదల చేసింది. దీంతో గొడవ సద్దుమణిగి ఉంటుందని, అనసూయ తన తప్పు తెలుసుకుందని అంతా అనుకుంటున్నారు. మరి ఏమైందో ఏమో.. ఉన్నట్టుండి రాశికి కౌంటర్ అన్నట్లుగా తాజాగా ఓ పోస్ట్ చేసింది. క్షమాపణలు చెప్పినందుకు తన అహం దెబ్బతిని ఉండొచ్చు. అందుకే ఇలా తను కూడా ఇన్ డైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది.
Also Read- The Raja Saab: ‘ది రాజా సాబ్’ సెన్సార్ పూర్తి.. ఏం సర్టిఫికెట్ వచ్చిందంటే?
వాళ్లే నిజమైన హీరోయిన్లు..
తన లేఖలో ‘మహిళల శరీరాల చుట్టూ అల్లిన కథనాలను ప్రశ్నించడానికి నేను మునుపటి కంటే ఇప్పుడు మరింత బలంగా, సాధికారతతో ఉన్నాను. మీరు నన్ను అర్థం చేసుకుంటారని, నాకు మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నాను’ అని చెప్పిన అనసూయ, ‘‘హీరోయిన్ తెరపై కాదు. సత్యం మాట్లాడే ధైర్యం, సొంత దారిలో నడిచే శక్తి, సరైన దానికి నిలబడే గుండె ఉన్నవాళ్లే నిజమైన హీరోయిన్. మిగతావాళ్లు కేవలం నటులు మాత్రమే’’ అని ఇన్‌స్టా స్టోరీ (Anasuya Insta Story)లో పేర్కొంది. అంటే, హీరోయిన్ రాశికి ఇది కౌంటర్‌లానే ఉందని అంతా అనుకుంటున్నారు. ప్రస్తుతం మహిళకు సంబంధించి, వారి గౌరవానికి సంబంధించి పోరాటం చేస్తుంటే, సపోర్ట్ ఇవ్వకపోగా.. ఎప్పుడో జరిగిన విషయాన్ని పట్టుకుని తనకు కౌంటర్లు ఇవ్వడం హీరోయిన్ లక్షణం కాదన్నట్లుగా అనసూయ చేసిన ఈ పోస్ట్ ఉందని నెటిజన్లు భావిస్తున్నారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తుండటం విశేషం. మొత్తంగా చూస్తే, ఇప్పుడు ఆడవాళ్ల మధ్యే పెద్ద తుఫాను రాబోతుందనే సంకేతాన్ని అనసూయ పోస్ట్ ఇస్తుందనే సందేహం కలుగకమానదు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

