Prasads Multiplex: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా నటించిన ‘ఓజీ’ (OG Movie) సినిమాను చూడటానికి వచ్చే అభిమానులకు ప్రసాద్స్ మల్టీప్లెక్స్ (Prasads Multiplex) సంస్థ ఓ సలహాను జారీ చేసింది. సలహా అనే కంటే ఓ రిక్వెస్ట్ చేసిందని చెబితే బాగుంటుందేమో. ‘ఓజీ’ సినిమా విడుదలైన అన్ని చోట్ల ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకుని, రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకెళుతోన్న విషయం తెలిసిందే. కొంతమంది కావాలని నెగిటివిటీని క్రియేట్ చేస్తున్నా, అభిమానులు దానిని తిప్పికొడుతున్నారు. సినిమాలో కథ పరంగా రొటీన్ అని అనిపించినా.. స్ర్కీన్‌ప్లే, హీరో ఎలివేషన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయనేలా.. కేవలం అభిమానులు మాత్రమే కాదు, చూసిన ఇతర ప్రేక్షకులు కూడా చెబుతున్నారు. ఇక అభిమానులకు కావాల్సినంత స్టఫ్ ఇందులో ఉండటంతో, వారి ఒంటి మీద షర్ట్‌లు ఆగడం లేదు. ఇదే విషయాన్ని గమనించిన ప్రసాద్స్ మల్టీప్లెక్స్ సంస్థ.. అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేసింది.
Also Read- TGSRTC: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై ఆర్టీసీ ఏఐ వినియోగం.. ఎందుకో తెలుసా?
చించివేయడం గమనించాము
ఈ ప్రకటనలో.. ‘‘ప్రసాద్స్ మల్టీప్లెక్స్ నుంచి మా విలువైన ప్రేక్షకులందరికీ ఈ సలహా జారీ చేయబడింది. సంవత్సరాలుగా, సినిమా అనేక రకాల ఉత్సవాలను రేకెత్తించింది. విజిల్స్, కేరింతలు, చప్పట్లు, ఇంకొన్ని సార్లు గ్యాలరీలో డ్యాన్సులు కూడా. ఇవి మేము కూడా ఇష్టపడే, సంతోషించే సంప్రదాయాలు. ప్రేక్షకులను సంతోషపరచడమే మా ధ్యేయం కాబట్టి.. వీటిని మేము కూడా ఎంజాయ్ చేస్తాము. కాకపోతే.. ‘దే కాల్ హిమ్ ఓజీ’ సినిమాతో, ఆ ఉత్సాహం, కేరింతలు సాధారణ స్థాయిని మించిపోతున్నాయి. ప్రేక్షకులు అడ్రినలిన్ ఉత్సాహంలో కేకలు, కేరింతలతో పాటు కొందరు తమ టీ-షర్టులను ఉత్సాహంతో చించివేయడం వంటివి గమనించాము. మీ ఉత్సాహాన్ని మేము అభినందిస్తున్నప్పటికీ, దానివల్ల కలిగే నష్టాలను కూడా మేము అర్థం చేసుకోగలము. కాబట్టి, సినిమా చూడటానికి వచ్చేటప్పుడు దయచేసి అదనంగా మరో టీ-షర్టును తీసుకొచ్చుకోవాలని మేము హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రసాద్స్ మల్టీప్లెక్స్ మీకు మరపురాని సినిమాటిక్ అనుభవాన్ని హామీ ఇస్తుంది, కానీ మీ దుస్తుల సురక్షితత్వానికి మేము బాధ్యత వహించలేము.’’ అని పేర్కొంది.
Also Read- Arjun Das: ఓరి నీ అభిమానం చల్లగుండా.. మరీ ఇంత పెద్ద మెసేజ్ ఏంటయ్యా?
సక్సెస్‌కు ఇంతకంటే కొలమానం ఏముంటుంది
ఇక ప్రకటన ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తుండటం విశేషం. ఇలాగే ఓవర్సీస్‌లో ‘ఓజీ’ సినిమాపై నెగిటివ్‌గా ఓ ప్రకటన వచ్చింది. కంటెంట్ డిలేపై డిస్ట్రిబ్యూటర్ రియాక్షన్ అంటూ ఓ ప్రకటన వచ్చింది. ఇప్పుడు కొన్ని చోట్ల థియేటర్లలో అల్లరల్లరి జరుగుతున్న క్రమంలో.. ప్రసాద్స్ మల్టీప్లెక్స్ విడుదల చేసిన ప్రకటన కూడా అంతా నెగిటివ్ అని అనుకుంటున్నారు. కానీ రెండు మూడు సార్లు చదివిన తర్వాత కానీ, అసలు విషయం అర్థం కావడం లేదు. ఇక ప్రసాద్స్ మల్టీప్లెక్స్ నుంచి వచ్చిన ఈ ప్రకటనతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. ఒక సినిమా సక్సెస్‌కు ఇంతకంటే కొలమానం ఏముంటుంది? దీనికి ఏ రివ్యూలు సరిపోతాయ్? అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
#TheyCallHimOG #OG pic.twitter.com/ZHllpXoWj0
— Prasads Multiplex (@PrasadsCinemas) September 25, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు