dude-movie( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Dude Collection: ఆ మార్కును టచ్ చేసిన ప్రదీప్ రంగనాధన్ ‘డ్యూడ్’.. గ్రాస్ ఎంతో తెలిస్తే షాక్?

Dude Collection: ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెరకెక్కిన ‘డ్యూడ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అక్టోబర్ 17న తమిళం, తెలుగు భాషల్లో విడుదలైన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం, ఆరు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను మించిపోయింది. ఇది ప్రదీప్ రంగనాధన్ మూడో సారి రూ.100 కోట్లు సాధించిన సినిమా. ప్రదీప్ మునుపటి హిట్‌లు ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ తర్వాత వరసగా ఈ సినిమా కూడా రూ.100 కోట్లు సాధించింది. దీనిని చూసిన ‘డ్యూడ్’ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. వరుసగా చేసిన సినిమాలు హిట్ ట్రాక్ పట్టడంతో కోలీవుడ్ లో నంబర్ ఒన్ హీరో అవుతారని ఆశిస్తున్నారు.

Read also-Venkatesh: ‘మన శంకరవరప్రసాద్ గారు’లో వెంకీ మామ ఎంట్రీ అదుర్స్.. చిరుతో చేతులు కలిపి..

సినిమా మొదటి రోజు రూ.9.75 కోట్లతో బలమైన ఓపెనింగ్ పొందింది. వీకెండ్‌లో కలెక్షన్లు మరింత పెరిగి, ఐదో రోజు (దీపావళి సెలవు) నాటికి రూ.80-95 కోట్ల మధ్య చేరుకుంది. ఆరో రోజు కొంత డిప్ వచ్చినా (సుమారు రూ.3.75 కోట్లు), మొత్తం వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.100 కోట్లు దాటడంతో నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో నెట్ కలెక్షన్ రూ.50.3 కోట్లు (తమిళం, తెలుగు కలిపి), ఓవర్సీస్ నుంచి రూ.20 కోట్లకు పైగా వచ్చాయి. ఈ సినిమా 2025లో తమిళ సినిమాల్లో 8వ అత్యధిక గ్రాసర్‌గా ర్యాంక్ సాధించింది. ప్రదీప్ మునుపటి సినిమాలు ‘లవ్ టుడే’ (రూ.100+ కోట్లు), ‘డ్రాగన్’ తర్వాత, ‘డ్యూడ్’ అతన్ని కోలీవుడ్‌లో టాప్ హీరోల్లో ఒకరిగా మార్చింది. నార్త్ అమెరికాలో మాత్రమే మంగళవారం రూ.46 వేల డాలర్లు (సుమారు రూ.38 లక్షలు) వసూలు చేసింది.

Read also-Nepotism: నెపోటిజం అంటే ఏమిటి?.. టాలీవుడ్‌లో అది ఎంతవరకూ ఉందంటే?

కీర్తిస్వరన్ డెబ్యూ సినిమాగా రూపొందించిన ‘డ్యూడ్’, ప్రదీప్ (అగన్), మమితా బైజు (కురల్)ల మధ్య చిన్నప్పటి నుంచి పెరిగిన ప్రేమకథను చిత్రీకరిస్తుంది. కలిసి పెరిగిన ఇద్దరూ, కుటుంబ విరోధాలు ఎదుర్కొంటూ ప్రేమలో పడతారు. అగన్ తల్లి (రోహిణి), కురల్ తండ్రి (శరత్‌కుమార్) మధ్య పాత కాన్ఫ్లిక్ట్‌లు బయటపడతాయి, రహస్యాలు బయటపడి కుటుంబ జీవితాలు కుప్పకూలుతాయి. కామెడీ, ఎమోషన్స్ మిక్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ కథ, యూత్‌కు సంబంధించిన మెసేజ్‌లతో ముగుస్తుంది. ఇలా వెరైటీ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డ్యడ్ ప్రపంచ వ్యాప్తంగా మంచి టాక్ సంపాధించుకుని కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!