Venkatesh: టాలీవుడ్ చరిత్రలో మొదటి సారి కలిసి చేయబోతున్న ఇద్దరు స్టార్ హీరోలకు ‘మనశంకరవరప్రసాద్ గారు’ సినిమా వేదిక అయింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్ కామియో రోల్ చేయబోతున్నారనే విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి ఓ వీడియోను విడుదల చేశారు నిర్మాతలు. కామియో రోల్ చేయబోతున్న విక్టరీ వెంకటేష్ పై షూటింగ్ ప్రారంభమైంది. దీనిని సూచిస్తూ నిర్మాతలు ఓ వీడియో విడుదల చేశారు. దీనిని చూసిన మెగా, దగ్గుబాటి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సినిమాలో ఈ సీన్ సెకండాఫ్లో రాబోతుందని సమాచారం. ఈ కామియో భారీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించనుందని, ఇద్దరు స్టార్లతో కలిసి డ్యాన్స్ నంబర్ కూడా ఉంటుందని నిర్మాతలు స్పష్టం చేశారు.
Read also-Nepotism: నెపోటిజం అంటే ఏమిటి?.. టాలీవుడ్‌లో అది ఎంతవరకూ ఉందంటే?
ఈ సినిమా చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీటీవీ గణేష్, రేవంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. బీమ్స్ సెసిరోలియో సంగీతం, సాహు గారపాటి, సుష్మితా కొనిదెలా నిర్మాణం చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా సంక్రాంతి 2026కి ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రానుంది. ఇప్పటికే విడుదలైన మొదటి సాంగ్ ‘మీసాల పిల్ల’ పాట దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అవుతోంది. అనిల్ రవిపూడి గతంలో ‘పటాస్’, ‘ఎఫ్2’, ‘ఎఫ్3’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సక్సెస్‌లతో తన మార్క్ ఎంటర్‌టైనర్‌లను అందించారు. ఈసారి కూడా ఫన్, లాఫ్టర్, డ్రామా, హ్యూమర్, ఎమోషన్, మాస్ మూమెంట్స్ మిక్స్‌తో పూర్తి ఎంటర్‌టైనర్‌గా రాబోతోందని అభిమానులు ఆశిస్తున్నారు.
Read also-Upasana Konidela: మెగా ఫ్యామిలీలో డబుల్ దీపావళి.. మరో వారసుడు వచ్చేస్తున్నాడోచ్.. ఫ్యాన్స్‌కు పండగే!
నిర్మాతలు ఈ స్పెషల్ మూమెంట్‌ను క్యాప్చర్ చేసి, హార్ట్‌వార్మింగ్ బిహైండ్-ది-సీన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో చిరంజీవి “వెంకీ, వెల్‌కమ్ మై బ్రదర్” అంటూ స్వాగతం పలుకుతూ కనిపిస్తారు. దానికి వెంకటేష్ “చిరు సర్, మై బాస్” అంటూ స్మైల్‌తో స్పందిస్తారు. రెండు స్టార్ల మధ్య ప్లేఫుల్ బాంటర్, స్మైల్స్, మ్యాజిక్ మూమెంట్స్.. అంతా ఫ్యాన్స్‌ను ఎక్సైట్ చేస్తున్నాయి. చిరంజీవి తన ఎక్సైట్‌మెంట్‌ను కూడా వ్యక్తం చేశారు. ఈ కామియోతో సినిమా డబుల్ స్టార్ అట్రాక్షన్‌తో మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వెంకీ మామ కూడా కలవడంతో ఈ సినిమాకు మరింత ఫన్ యాడ్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Happy to share the screen with my dear Megastar @Kchirutweets in #ManaShankaraVaraPrasadGaru ❤️
And back again with my most favourite @AnilRavipudi for another Sankranthi 😉😉😉
This Sankranthi is going to be a truly special one ❤️ https://t.co/ego4ahGgk6
— Venkatesh Daggubati (@VenkyMama) October 23, 2025
