Dude Movie Still
ఎంటర్‌టైన్మెంట్

Dude Movie: ప్రదీప్ రంగనాథన్ మూవీకి ఊహించని ఓటీటీ డీల్!

Dude Movie: కోలీవుడ్‌లో దర్శకుడిగా కెరీర్ మెదలు పెట్టి స్టార్ హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). డైరెక్టర్‌గానూ యాక్టర్‌గానూ ప్రేక్షకులను మెప్పించి తానేంటో నిరూపించుకుంటున్నాడు. ‘కోబలి’తో దర్శకుడిగా అరంగేట్రం చేసి తన స్టామినా ఏంటో సినిమా ఇండస్ట్రీకి తెలియజేశాడు. ఇక హీరో, డైరెక్టర్‌గానే కాకుండా లిరిసిస్ట్‌గా కూడా మారి ‘లవ్ టుడే’ (Love Today) తీశాడు. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఆ దెబ్బతో రంగనాథన్ మార్కెట్ అమాంతం పెరిగింది. ఈ మధ్యకాలంలో విడుదలైన ‘డ్రాగన్’ (Dragon) మూవీ వంద కోట్లను వసూలు చేసిందంటేనే చెప్పవచ్చు ప్రదీప్ ఏ స్థాయిలో బాక్సాఫీస్‌ను కొల్లగొడుతున్నాడో అని. ఇలా విభిన్న జానర్స్‌లో సినిమాలు తీసి, ప్రేక్షకులకు అసలైన వినోదం అందిస్తున్నాడు ప్రదీప్ రంగనాథన్.

Also Read- Junior Movie: ‘వైరల్ వయ్యారి’ సాంగ్.. గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల దుమ్ములేపారు..

ఇప్పుడిదే జోష్‌లో మరో రెండు సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు ప్రదీప్ రంగనాథన్. అందులో ఒకటి ‘లవ్ ఇన్సురెన్స్ కంపెనీ’ కాగా.. మరొకటి యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘డ్యూడ్’. ఇందులో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌ ‘డ్యూడ్‌’ను టాలీవుడ్‌ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తుంది. కీర్తిశ్వరన్ ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ‘ప్రేమలు’ హీరోయిన్ మమిత బైజు (Mamitha Baiju) కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది దీవాళి రోజున పేలేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి వచ్చిన అప్డేట్‌తో, ‘డ్యూడ్’పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అర్థమవుతోంది. ఇంతకీ ఆ అప్డేట్ ఏమిటంటే.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఊహించని ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.

Also Read- Notice to Political Parties: బిగ్ బ్రేకింగ్.. 13 రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ షాక్!

ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ. 25 కోట్లకు కొనుగోలు చేసిందనేలా టాక్ మొదలైంది. నిజంగా ఇది ఊహించని ధర అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే.. సినిమా విడుదలకు ముందే ఈ సినిమా సక్సెస్ అయినట్లుగా భావించవచ్చు. ఈ ఓటీటీ డీల్‌తో ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగాయి. ఈ దీపావళి రోజున ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలా ఉంటుందో.. ఎన్నెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. మైత్రీ మూవీ మేకర్స్ టాలీవుడ్‌లోనే అగ్ర నిర్మాణ సంస్థగా దూసుకెళుతోంది. స్టార్ హీరోలతో పాటు కంటెంట్ బేస్డ్ సినిమాలు, ఇంకా ఇతర ఇండస్ట్రీలలోని హీరోలతో సినిమాలు చేస్తూ.. పాన్ ఇండియా సంస్థగా గుర్తింపును పొందుతోంది. ఇటీవల బాలీవుడ్‌లోనూ ఈ సంస్థ సక్సెస్‌ను అందుకున్న విషయం తెలిసిందే. మరో వైపు మమిత బైజు కూడా టాలీవుడ్‌లో అవకాశాల కోసం చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఈ భామ సూర్య సరసన ఓ మూవీ చేస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?